filmybuzz
filmybuzz

View

ఎన్టీఆర్, చెర్రీ, బన్నీ టార్గెట్ ఏంటీ.. సొంత వర్గం కోసమా?

Monday,July18th,2016, 10:53 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు రూటు మార్చారు. తెలివిగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. తమ కంటూ సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఆడియో వేడుకల్లో, సక్సెస్ మీట్ ల్లో మాత్రమే కనిపించి ఫ్యాన్స్ ని పలుకరించే ఆనవాయితీకి స్వస్తి చెప్పేసారు ఈ హీరోలు. షూటింగ్ లొకేషన్స్ లో, మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని కలుస్తున్నారు. ఎందుకీ మార్పు.. దేని కోసం ఈ హీరోల టార్గెట్ అనే చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...


ఎన్టీఆర్
'జనతాగ్యారేజ్' చిత్రం షూటింగ్ ఆరంభమైనప్పట్నుంచి లొకేషన్స్ కి వస్తున్న అభిమానులను కలుస్తున్నాడు ఎన్టీఆర్. ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. ఇప్పటివరకూ పది వేల ఫోటోగ్రాఫ్స్ కి ఫోజులిచ్చాడంటేనే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో అబిమానులకు సమయం కేటాయిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ మధ్య మనస్ఫర్ధలు ఏర్పడటం, ఇద్దరూ దూరంగా ఉండటం తెలిసిన విషయమే. దాంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ సినిమాలకు దెబ్బేస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలకు ఫస్ట్ డే రావాల్సినంత ఓపినింగ్స్ రాలేదు. నిజం చెప్పాలంటే ఈ రెండు సినిమాలు హిట్. కానీ 50కోట్ల క్లబ్ లో చేరడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అతి కఫ్టం మీద 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఎన్టీఆర్ 50కోట్ల క్లబ్ లో చేరాడు. ఇది ఎన్టీఆర్ స్టామినాకి చాలా తక్కువ. 70, 80 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోవాల్సిన స్టామినా ఉన్న హీరో ఎన్టీఆర్. బ్లాక్ బస్టర్ సినిమా అయితే 100కోట్ల క్లబ్ లో చేరిపోవాల్సిన హీరో. కానీ ఇది జరగడంలేదు. అందుకే ఎన్టీఆర్ రూటు మార్చాడు. అభిమానులకు దగ్గరవ్వడానికి తాపత్రయపడుతున్నాడు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను పెంచుకుంటున్నాడు. ఈ ఎఫెక్ట్ 'జనతాగ్యారేజ్' చిత్రంపై పడుతుంది. ఓపినింగ్స్ భారీగా ఉంటాయి. తద్వారా ఎన్టీఆర్ సినిమాల బిజినెస్ పెరుగుతుంది. వసూళ్లు అదే రేంజ్ లో పెరుగుతాయి. అందుకే ఎన్టీఆర్ చాలా తెలివిగా తనకంటూ సొంతంగా అభిమాన వర్గాన్ని ఏర్పర్చుకోవడం కోసం అడుగులు వేస్తున్నాడని అర్ధం చేసుకోవచ్చు.


రాంచరణ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఫ్యాన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎడమహం పెడమొహంగా ఉండటంతో అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మెగాభిమానులు కాస్త.. చిరు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అనేంతగా సీన్ మారింది. దాంతో మొత్తం అభిమానులను ఒక తాటిపైకి తీసుకురావడానికి మెగా హీరోలు కృషి చేసారు. అన్నయ్య, తమ్ముడు, అబ్బాయ్ రాంచరణ్ అందరూ కలుసుకున్నారు. షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లడం, ఒకరు ఆడియో ఫంక్షన్స్ కి మరొకరు అటెండ్ అవ్వడం చేస్తున్నారు. ఆ రకంగా మళ్లీ మెగాభిమానులను ఒక తాటిపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. కొంతమంది ముఖ్యమైన మెగాభిమానులను సెలెక్ట్ చేసి షూటింగ్ లొకేషన్ కి తీసుకెళ్లి చిరుని కలిసేలా చేయాలనే ప్లాన్ లో రాంచరణ్ ఉన్నాడు. దీనివల్ల మెగాభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచినట్టు అవుతుంది. పైగా మెగాబిమానులందరూ ఒకే తాటిపైన ఉంటారు. ఇది మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరోల సినిమాలకు బాగా కలిసొస్తుంది. అందుకే రాంచరణ్ ఫ్యాన్స్ ని వీలు కుదిరినప్పుడల్లా కలుస్తున్నాడు.


అల్లు అర్జున్
అల్లు అర్జున్ కి సెపరేట్ ఫ్యాన్ గ్రూప్ తయారయ్యిందని గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య 'కుమారి 21ఎఫ్' చిత్రం ఆడియో వేడుకలో అల్లు అర్జున్ పాల్గొన్నప్పుడు ఈ విషయం తేట తెల్లమయ్యింది. అఖిల భారత అల్లు సంఘం అనే గ్రూప్ ని ఏర్పాటు చేసాడు అల్లు అర్జున్. తనకంటూ సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవాలనే తాపత్రయంతోనే అల్లు అర్జున్ ఈ గ్రూప్ ని ఏర్పాటు చేసాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కి విబేధాలు నెలకొన్నాయి. వాటిని కొంతమేర క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, సొంతంగా అభిమాన వర్గాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇందుకోసం అభిమానులను కలుస్తున్నాడు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నాడు. ఇలా కంటిన్యూగా అభిమానుల టచ్ లో ఉండటం అల్లు అర్జున్ కి కలిసొస్తుందని, భవిష్యత్తులో అల్లు అర్జున్ కి సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.


మొత్తం మీద కుర్ర హీరోలందరూ తమకంటూ సొంతంగా అభిమానవర్గాన్ని ఏర్పర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. మరి దీనివల్ల ఏ మేరకు వీరు ఆశించిన ఫలితాన్ని పొందుగలుగుతారో వేచి చూడాల్సిందే.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !