filmybuzz

View

హీరోల టార్గెట్ మారింది.. ఇక భారీ బడ్జెట్ చిత్రాలే!

Friday,July08th,2016, 07:46 AM

50కోట్ల క్లబ్ లో ఓ సినిమా చేరడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఓ రికార్డ్ అనేంతగా టాలీవుడ్ పరిస్థితి ఉండేది. అలా 50కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం తదుపరి చిత్రాలకు పెద్ద సవాల్ అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా సునాయాసంగా తెలుగు సినిమా 50కోట్ల వసూళ్లను సాధించేస్తోంది. ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సింఫుల్ కథతో మసాలాలన్నీ మిక్స్ చేసి గ్రాండియర్ విజువలైజేషన్ తో సినిమా తెరకెక్కితే... ఆ సినిమా 50కోట్లు వసూళ్లు చేయడం పెద్ద కష్టమేం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇక 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాల విడుదల తర్వాత తెలుగు సినిమా టార్గెట్ 75 నుంచి 100కోట్లు అయిపోయింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. కాబట్టి స్టార్ హీరోలు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసి 150కోట్లు వరకూ తమ సినిమాలు వసూళ్లు సాధించేలా చూసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్ తదుపరి సినిమాల ప్లానింగ్స్ ఈ రేంజ్ లోనే ఉన్నాయి.


పవన్ కళ్యాణ్
'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ కాంబినేషన్ లో 100కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత యస్.రాధాకృష్ణ. ఈ చిత్రానికి సంబంధించి త్రివిక్రమ్ స్ర్కిఫ్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ స్ర్కిఫ్ట్ వర్క్ పూర్తయ్యేలోపు డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ తో భారీ బడ్జెట్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట పవన్.


మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా రూపొందనుంది. కాగా ఈ సినిమాని 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్. ఈ సినిమా స్టోరీ లైన్ న్యాయవ్యవస్థపై హీరో ఉక్కుపాదం మోపే విధంగా ఉంటుందట. సోషల్ మెసేజ్ తో రూపొందనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఎన్టీఆర్
ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న 'జనతాగ్యారేజ్' చిత్రం 70కోట్లు వరకూ బిజినెస్ చేసిందనే వార్తలు ఉన్నాయి. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను బట్టి 80కోట్లు వరకూ ఈ సినిమా వసూళ్లు కురిపించడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు, ఇక బ్లాక్ బస్టర్ అయితే 80కోట్ల పైనే ఈ సినిమా వసూళ్లు ఉంటాయి. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందనుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా బడ్జెట్ 100కోట్ల పైనే ఉండబోతోందట.ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి 2' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.'బాహుబలి', 'బాహుబలి' 2 100కోట్ల పైన బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమాలు. ఈ నేపధ్యంలో తదుపరి సినిమాని కూడా భారీ బడ్జెట్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. దాదాపు 100కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. యు.వి క్రియేషన్స్ పతాకంపైనే ఈ చిత్రం రూపొందనుందట. పౌరాణికం కాదు... హిస్టారికల్ మూవీ కాదు... మరి ఇంత బడ్జెట్ ఎందుకు అవుతుందనే వివరాల్లోకి వెళితే... ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనుందట. యాకన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం ఫారిన్ లోనే జరగనుందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్, గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారట. 'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాలతో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకునే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారట. అందుకే మూడు భాషల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.


రాంచరణ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు రాంచరణ్. 75కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని వినికిడి.


అల్లు అర్జున్
సరైనోడు చిత్రంతో అల్లు అర్జున మార్కెట్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్, 100కోట్ల క్లబ్ లో చేరిపోవాలనే టార్గెట్ తో ఉన్నాడు అల్లు అర్జున్, అందుకే హరీ్ష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోతున్న సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాత అల్లు అరవింద్.


ఇక యంగ్ హీరోలు ఇలా ప్లాన్ చేసుకుంటుంటే... సీనియర్ హీరోలు కూడా ఏమీ తగ్గడంలేదు. బాలయ్య 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి', చిరంజీవి 150వ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. నాగార్జున 'నమో వెంకటేశాయ' అంటూ భక్తిరసాత్మక చిత్రాన్ని చేస్తున్నాడు. 'బాబు బంగారం' చిత్రం తర్వాత వెంకటేష్ 'సాలా కడూస్' చిత్రం హిందీ రీమేక్ లో నటించడానికి సమాయత్తమవుతున్నాడు. ఇది భారీ బడ్జెట్ తోనే తెరకక్కనుందట.


సో... హీరోల టార్గెట్ మారింది. 100కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసి, 150కోట్ల వరకూ తమ మార్కెట్ ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఇది శుభపరిణామమే. కాకపోతే బడ్జెట్ మాత్రమే కాకుండా, కథలు పరంగా కేర్ తీసుకోవాలి. బ్లాక్ బస్టర్స్ ఇచ్చే విధంగా కృషి చేయాలి. అప్పుడే వీరి టార్గెట్ నెరవేరుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !