మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రితం హాట్ హాట్ గా చర్చించుకునేవారు. ఇప్పుడిప్పుడే ఈ విషయం గురించి పెద్దగా ఎవ్వరూ మాట్లాడుకోవడంలేదు. అయితే తాజాగా వచ్చిన ఓ వార్తతో మళ్లీ మెగా బ్రదర్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న 'గబ్బర్ సింగ్ 2' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ పూణేలో జరిగింది. రెండో షెడ్యూల్ కి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 26నుంచి సెకండ్ షెడ్యూల్ ఆరంభంకానుందని సమాచారమ్. ఇదిలా ఉంటే... ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22)నాడు విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడట. ఇదే తన అన్నయ్యకు తను ఇస్తున్న గిఫ్ట్ గా భావిస్తున్నాడట పవన్ కళ్యాణ్. ఇదే కనుక జరిగితే మెగా అభిమానులందరూ ఫుల్ ఖుషీ అయిపోతారు. ఎందుకంటే మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు మెగా అభిమానులను చాలా ఇబ్బందిపెడుతున్నాయి. ఇప్పుడు అన్నయ్య బర్త్ డే రోజున తమ్ముడు సినిమా ఫస్ట్ లుక్ విడుదలైతే అన్నదమ్ములు సఖ్యతగానే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలు బయటికి వెళతాయి. దాంతో మెగాభిమానులందరూ కూడా ఒకే తాటిపైకి వస్తారు.