కోలీవుడ్ లో డైరెక్టర్ లింగస్వామి కంటూ ఓ స్థానం ఉంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'సండై కోళి' (తెలుగులో పందెం కోడి), 'పయ్యా' (తెలుగులో ఆవారా) చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. కాగా ఈ దర్శకుడి దర్శకత్వంలో అల్లు అర్జున్ (బన్ని) ఓ సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్ రెడీ ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారు, ఎప్పుడు ఆరంభమవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'సరైనోడు' చిత్రం చేస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదలకానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా, 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారమ్. మరి లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు ఆరంభమవుతుందో వేచి చూద్దాం.