స్టార్ డైరెక్టర్ రాజమౌళి టెన్షన్ లో ఉన్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇలా టెన్షన్ పడటానికి కారణం 'బాహుబలి 2' అని తెలుస్తోంది. 'బాహుబలి 2' షూటింగ్ ఆరంభమై శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకూ షూట్ చేసిన రషెస్ ని ఇటీవల రాజమౌళి చూసారట. ఆయన ఏ మాత్రం ఈ రషెస్ పట్ల శాటిస్ ఫ్యాక్షన్ గా లేరట. దాంతో రీషూట్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారమ్. రీషూట్ చేయాలంటే దాదాపు 30కోట్ల వరకూ లాస్ అవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ విషయంలోనే రాజమౌళి టెన్షన్ గా ఉన్నారట. ఈ రీషూట్ విషయంలో నిర్మాతలు కూడా చాలా టెన్షన్ గా ఉన్నారని సమాచారమ్.
బాహుబలి' ఫస్ట్ పార్్ కి సంబంధించి రాజమౌళి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. కథ అంతా దాచేసి, మసి పూరి మారేడు కాయ చేసారని, అంత భారీ బడ్జెట్ తో తీయాల్సిన సినిమా కాదనే విమర్శలు వచ్చాయి. అందుకే సెకండ్ పార్ట్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారట. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా సెకండ్ పార్ట్ ని అందరి మన్ననలు అందుకునేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నారట రాజమౌళి. దాంతో ఇప్పుడు జరిగిన షూటింగ్ రషెస్ చూసుకుని అప్ సెట్ అయ్యినట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా రాజమౌళి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అలాగే ప్రచారం అవుతున్న ఈ విషయం ఎంతవరకూ నిజమో కూడా తెలియాల్సి ఉంది.