మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, చాలా సాహసోపేతమైన పద్ధతిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దలను ఎదిరించి, ఎంతో ధైర్యంగా పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ వివాహ బంధాన్ని త్వరగానే వదులుకుంది. శిరీష్ తనను హింసిస్తున్నాడని, కలిసి బతకలేనని విడాకుల కోసం కోర్టుకెక్కింది. విచారణ అనంతరం శ్రీజ, శిరీష్ లకు విడాకులు మంజూరు చేసింది ఫ్యామిలీ కోర్టు. ఈ ఇద్దరికీ ఒక పాప ఉంది. శ్రీజ విదేశాల్లో ఉంటోంది.
తాజా వార్తల ప్రకారం శ్రీజకు పెళ్లి చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట. శ్రీజను పెళ్లి చేసుకోవాల్సిందిగా మెగా కుటుంబం నచ్చజెప్పిందట. ఇందుకు శ్రీజ కూడా సుముఖంగానే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు శ్రీజ కోసం వరుడిని వెతకడం మొదలుపెట్టారని సమాచారమ్. శ్రీజ పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. అందుకే పెళ్లి కొడుకు విషయంలో తనే తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారట చిరు. అన్నీ కుదిరితే ఈ యేడాదే శ్రీజ పెళ్లి చేయాలని మెగా కుటుంబం భావిస్తోందట. సో... త్వరలోనే చిరు ఇంట్లో పెళ్లి బాజాలు మోగే అవకాశముందని ఫిల్మ్ నగర్ సమాచారమ్.