ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని మహేష్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఓ సందర్భంలో రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా... మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని ఓ ప్రశ్న కూడా అడిగాడు. దాంతో మహేష్ తో రాజమౌళి సినిమా చేయడం ఖాయమని అందరూ భావించారు. కాకపోతే ఎప్పుడు వీరిద్దరి కాంబినేషన్ తెరకొస్తుందానే విషయంలో మాత్రం ఎవ్వరికీ క్లారటీ లేదు.
తాజా వార్తల ప్రకారం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం రంగం సిద్ధమవుతోందట. ఇప్పటికే మహేష్ కోసం రాజమౌళి ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తయారు చేసారట. మహేష్, రాజమౌళి మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. వచ్చే యేడాది ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. సో... 'బాహుబలి' తర్వాత రాజమౌళి సినిమా మహేష్ తోనే అని ఫిక్స్ అయిపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి 'బాహుబలి' పార్ట్ 1 విడుదలైన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారమ్. మహేష్ అభిమానులను ఈ వార్త చాలా సంతోషపెడుతుందని చెప్పొచ్చు.