ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలవ్వకముందే మహేష్ బాబు తదుపరి చిత్రం 'బ్రహ్మోత్సవం' మే 31న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నాడు. పి.వి.పి బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది.
కాగా ఈ సినిమా గురించి ఓ వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఈ ముగ్గురితో మహేష్ బాబు రొమాన్స్ చేస్తాడని సమాచారమ్. ఓ హీరోయిన్ గా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. మరో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక జరుగుతోందట. మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కలిసి ఈ చిత్రంలోని నటీనటుల ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారట. ఇప్పటివరకూ మహేష్ బాబు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం చూసాం. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లుతో రొమాన్స్ అంటే మంచి మజాగా ఉంటుందని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ని 90రోజుల్లో పూర్తి చేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకు కండీషన్ పెట్టాడట మహేష్ బాబు. జూలైలో 'శ్రీమంతుడు'తో అలరించబోతున్న మహేష్, ఈ యేడాది చివరిలో 'బ్రహ్మోత్సవం'తో అలరించాలని డిసైడ్ అయ్యాడట. అందుకే శ్రీకాంత్ అడ్డాలకు పక్కా ప్లానింగ్ తో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట మహేష్ బాబు. సో... ఈ యేడాది మహేష్ రెండు సినిమాలతో అలరించనున్నాడు. ఆయన అభిమానులకు పెద్ద పండగే అని చెప్పొచ్చు.