నందమూరి అబ్బాయి కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ వర్కవుట్ చేసే ప్రయత్నం జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తోన్న డైరెక్టర్ ఎవరో కాదు... ఎ.యస్.రవికుమార్ చౌదరి. 'సౌఖ్యం' చిత్రంతో ఘోర పరాజయాన్ని చవిచూసిన రవికుమార్ చౌదరి ఈసారి ఓ మాంచి స్ర్కిఫ్ట్ ని వర్కవుట్ చేసాడట. ఈ స్ర్కిఫ్ట్ నిర్మాత కె.యస్.రామరావుకి వినిపించాడట. ఆయనకు కథ నచ్చడంతో హీరోలను వర్కవుట్ చేసే పనిమీద పడ్డాడట రవికుమార్ చౌదరి.
ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్ కి స్ర్కిఫ్ట్ వినిపించాడట రవికుమార్ చౌదరి. స్ర్కిఫ్ట్ విన్న కళ్యాణ్ రామ్ ఏ నిర్ణయం చెప్పలేదటగానీ, సానుకూలంగానే స్పందించాడని సమాచారమ్. ఇక సాయిధమ్ తేజ్ కి 'పిల్లానువ్వులేని జీవితం' తో మంచి విజయాన్ని అందించాడు రవికుమార్ చౌదరి. కాబట్టి సాయిధరమ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాడట. త్వరలోనే సాయిధరమ్ తేజ్ ని కలిసి కథ చెప్పబోతున్నాడట రవికుమార్ చౌదరి. మరి ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూద్దాం.