మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. తాజా వార్తల ప్రకారం కళ్యాణ్ దేవ్ రెండో సినిమాకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. మెగా కాంపౌండ్ హీరోలకు హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ దేవ్ రెండో సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమాకి కథ కూడా ఫైనలైజ్ అయినట్టు సమాచారమ్. ఓ టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
కళ్యాణ్ దేవ్ తొలి సినిమాకి చిరు హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న'విజేత' టైటిల్ ని పెట్టారు. ఇక కళ్యాణ్ దేవ్ రెండో సినిమాకి 'వరప్రసాద్ గారి అల్లుడు' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్. కాబట్టి 'వరప్రసాద్' పేరును వాడుకోవడం కలిసొచ్చే అంశం. అందుకే మెగా అల్లుడు ఈ టైటిల్ పట్ల మొగ్గుచూపుతున్నాడని ఊహించవచ్చు. మొత్తం మీద మామయ్య చిరంజీవిని ఈ మెగా అల్లుడు బాగానే వాడేస్తున్నాడు.