రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమానించే వారి గుండెల్లో పరిటాల రవి సజీవంగానే ఉన్నారు. పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా తీసుకుని రాంగోపాల్ వర్మ 'రక్తచరిత్ర', 'రక్తచరిత్ర 2' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాల్లో పరిటాల రవి పాత్రను బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ పోషించారు. కాగా తాజా వార్తల ప్రకారం మన మెగాస్టార్ చిరంజీవికి విలన్ అవ్వబోతున్నాడట వివేక్ ఒబెరాయ్. ఈ కాంబినేషన్ ని సెట్ చేసింది రాంచరణ్ అని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం త్వరలో ఆరంభంకానుంది. తమిళ్ చిత్రం 'కత్తి' కి ఇది రీమేక్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. కాగా చిరు ఇంట్లో ఓ పెళ్లి వేడుక జరగనుంది. అది చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి. ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు రాంచరణ్ తో కలిసి తన 150వ చిత్రానికి నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారట చిరంజీవి. అందులో భాగంగానే వివేక్ ఒబెరాయ్ ని ఈ చిత్రంలో విలన్ గా నటింపజేయాలని పిక్స్ అయ్యారట. వివేక్ ఒబెరాయ్ కూడా చిరు సినిమాలో విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశముంది.