View

ఇంటర్య్వూ - హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ( స్పై)

Sunday,June25th,2023, 03:45 PM

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై' తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న à°ˆ సినిమాని à°š‌à°°‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో  à°¨à°¿à°°à±à°®à°¿à°‚చారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29à°¨ à°ˆ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ విలేకరుల సమావేశంలో 'స్పై' విశేషాలని పంచుకున్నారు.  


స్పై ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
ఇది నా మొదటి తెలుగు సినిమా. నిజంగా డ్రీమ్ డెబ్యు. దర్శకుడు గ్యారీ బిహెచ్ à°ˆ సినిమా సైన్ చేసినపుడే నన్ను హీరోయిన్ à°—à°¾ అనుకున్నారు. నేరుగా వచ్చి à°•à°¥ చెప్పారు. à°•à°¥ విని చాలా థ్రిల్ అయ్యాను.  à°‡à°‚దులో నాది చాలా ఇంటెన్స్ రోల్. మరో ఆలోచన లేకుండా సైన్ చేశాను. స్పై .. ఎక్సయిటింగ్ యాక్షన్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది.


మీ పాత్ర యాక్షన్ కోణంలో ఉంటుందా ?
ఇందులో నా పాత్రకు చాలా కోణాలు వుంటాయి. యాక్షన్, స్టంట్స్ అన్నీ వుంటాయి. à°°à°¾ ఏజెంట్ à°—à°¾ కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. యాక్షన్,  à°—న్ షూటింగ్ లో  à°¦à°¾à°¦à°¾à°ªà± ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. నిజంగా ఇది చాలా ఎక్సైటింగ్ జర్నీ. à°ˆ పాత్ర  à°šà±‡à°¸à±‡ క్రమంలో 'à°°à°¾' గురించి చాలా నేర్చుకున్నాను. ఎలాంటి గుర్తింపుని ఆశించకుండా దేశానికి సేవ చేస్తుంటారు. అలాగే à°ˆ సినిమా యాక్షన్ విషయంలో నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. ఇకపై యాక్షన్ పాత్రలు వస్తే చాలా కాన్ఫిడెంట్  à°—à°¾  à°šà±‡à°¸à±à°¤à°¾à°¨à°¨à±‡ నమ్మకం వుంది. స్పై à°•à°¿ పార్ట్ 2 చేసే స్కోప్ వుంది. ఒకవేళ అది జరిగితే అందులోనూ నేనే హీరోయిన్ à°—à°¾ ఉండాలనేది నా కోరిక.(నవ్వుతూ)


నిఖిల్ తో పని చేయడం ఎలా అనిపించింది ?  
నిఖిల్ బ్రిలియంట్ యాక్టర్. హ్యాపీ డేస్ నుంచి ఆయన వర్క్ ని చూస్తున్నాను. ఆయన కథల ఎంపిక చాలా బాగుంటుంది. తను చాలా పాజిటివ్ పర్సన్ . చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.


స్పై మ్యూజిక్ గురించి చెప్పండి ?
శ్రీచరణ్ పాకాల గారు నేపధ్య సంగీతం తో పాటు తూ ముజే ఖూన్ ధో పాట చేశారు, అలాగే విశాల్ చంద్రశేఖర్ గారు రెండు పాటలు చేశారు. స్పై మ్యూజిక్ ఎక్స్ట్రార్డినరి  à°—à°¾  వుంటుంది.  


స్పై షూటింగ్ లో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
నేను ఇది వరకు యాక్షన్ సినిమాలు చేయలేదు. à°°à°¾ ఏజెంట్ à°—à°¾ కనిపించడం అంటే దానికి   à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°®à±ˆà°¨ శ్రద్ధ తీసుకోవాలి. మన కదలిక, యాక్షన్, ఫైట్. యాటిట్యూడ్ అన్నీ à°°à°¾ ఏజెంట్ లా సహజంగా ఉండేలా చూసుకోవడం ఛాలెంజింగ్ à°—à°¾ అనిపించింది.  à°Ÿà±à°°à±ˆà°²à°°à± à°•à°¿ అద్భుతమైన స్పందన వచ్చింది.


మీ సినిమా ప్రయాణం ఎలా జరిగింది ?
ఇప్పటివరకూ  à°ªà±à°°à°¯à°¾à°£à°‚ చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇంజనీరింగ్ చేశాను. నేను ఎప్పుడూ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. ఆరంభంలో చిన్న చిన్న యాడ్స్ చేశాను. ఒకొక్క అడుగువేసి ఇక్కడి వరకూ వచ్చాను. à°ˆ ప్రయాణం చాలా ఆనందాన్ని ఇస్తోంది.


మీ డ్రీమ్ రోల్స్ ఏంటి ? మీ ఫేవరేట్ హీరో ఎవరు ?
చాలా డ్రీమ్ రోల్స్ వున్నాయి. అలియా భట్ చేసిన హైవే తరహ పాత్రలు పోషించాలని వుంది. నాకు అందరి హీరోలతో వర్క్ చేయాలని వుంటుంది.


ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి ?
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా చేస్తున్నా.


ఆల్ ది బెస్ట్
థాంక్స్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !