View

బర్త్ డే ఇంటర్య్వూ - నటుడు డా. నరేష్ వికె

Friday,January19th,2024, 03:16 PM

నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్ళు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకులు ప్రేమాభిమానాలు వలనే సాధ్యమౌతోంది. నా జీవితాంతకాలం సినీ పరిశ్రమకు సేవ చేస్తాను అన్నారు. ప్రముఖ నటుడు డా. నరేష్ వికె. నటుడిగా డా. నరేష్ వికె సినీ ప్రయాణం మొదలై విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన విలేకర్లతో ముచ్చటించారు.


పరిశ్రమలో సక్సెస్ ఫుల్ à°—à°¾ 50 ఏళ్ళు పూర్తి చేసుకునందుకు ముందుగా మీకు అభినందనలు...  
-థాంక్ యూ


ఈ గోల్డెన్ జూబ్లీ జర్నీ ఎలా అనిపిస్తోంది ?
- à°Šà°¹ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిందల్లా కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల గారి మేకప్ రూమ్, పొద్దున్నే మద్రాస్ లో వచ్చి కలిసే ప్రజలు, స్టూడియో వాతావణం.. ఇలా వీటి చుట్టూనే పెరిగాను. ఇదే నా జీవితం కావాలని కోరుకున్నాను. 9 యేటా 'పండంటి కాపురం' లాంటి అద్భుతమైన చిత్రంతో ఆరంగేట్రం చేశాను. అయితే బాల నటులుగా వచ్చిన వాళ్ళు హీరోలుగా సక్సెస్ కారని చెబుతుంటారు. à°ˆ భయం వుండేది. అయితే దాని గురించి పెద్దగా అలోచించలేదు. ఒక్క సినిమా హీరోగా నటిస్తే చాలని అనుకున్నాను. అనుకోకుండా..అమ్మగారి ప్రేమ సంకెళ్ళు, జంధ్యాల గారి నాలుగు నాలుగు స్తంభాలాట..ఇలా రెండు సినిమాలు వచ్చాయి. నాలుగు స్తంభాలాటతో నాకు అద్భుతమైన కెరీర్ స్టార్ట్ అయ్యింది. నా ఫస్ట్ ఇన్నింగ్స్ లో జంధ్యాల గారు, అమ్మ(విజయనిర్మల), విశ్వనాథ్ గారు, బాపు గారు, రమణ గారు, ఈవీవీ సత్యనారాయణ గారు, వంశీ గారు, రేలంగి నరసింహరావు గారు,..  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ మహనీయులతో కలసి పని చేసే అదృష్టం దొరికింది. వీరందరూ నా విజయానికి పునాది వేశారు. à°ˆ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.


ఒక మంచి యాక్టర్ కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ప్రయత్నించాను. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశాను. అయితే రాజీపడి సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. అద్భుతమైన విజయాలు వచ్చినప్పటికీ నేను అనుకున్న సినిమాలు చేయలేకపోతున్నాననే ఒక చిన్న నిరాశతోనే తొలి ఇన్నింగ్స్ ఎండ్ అయ్యింది. నేను రీల్, రియల్ లైఫ్ లో కొంచెం అడ్వెంచరస్ పర్శన్ ని. రిస్కులు తీసుకుంటాను, నా మనసుకి నచ్చింది చేస్తాను. కొంత కాలం రాజకీయాల్లో పని చేశాను. తర్వాత సోషల్ సర్విస్ లోకి వచ్చాను. ఈ క్రమంలో దాదాపు పదేళ్ళు పాటు పరిశ్రమకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ పలు వైవిధ్యమైన పాత్రలు వచ్చినపుడు నటుడు ఎస్వీ రంగారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని చేశాను. పరిశ్రమలో ఓర్పు, క్రమ శిక్షణ చాలా అవసరం. ఇవి మా అమ్మగారి నుంచి నేర్చుకున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ లో మీ శ్రేయోభిలాషి , గుంటూరు టాకీస్. అ ఆ, దృశ్యం చిత్రాలలో వివిధ్యమైన పాత్రలు రావడంతో నాకు పరిశ్రమలో కొత్త మెరుగు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త, వైవిధ్యమైన రావడం అనందంగా వుంది. ఈ సందర్భంగా దర్శక, రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
à°’à°• నటుడు పదేళ్ళు ఉండటమే గొప్ప. ఇంతమందికి ధన్యవాదాలు చెబుతూ 50 ఏళ్లు గడపడం ఆనందంగా వుంది. à°—à°¤ ఏడాది సామజవరగమన నాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది.  à°²à±€à°¡à± రోల్ లో చేసిన మళ్ళీ పెళ్లి తో పాటు ఓటీటీలో చేసిన ఇంటింటి రామాయణం, మాయాబజార్ మంచి విజయాలు సాధించాయి. ఇన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. à°’à°• నటుడిగా ఎలాంటి పాత్రలు చేయాలని అనుకున్నానో దానికి మించిన పాత్రలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత పెద్ద మార్పు వచ్చింది. తరం మారుతోంది. నేను అన్ని తరాలతో కలసి రావడం అనేది నా అదృష్టం. à°ˆ 50à°µ యేట నాకు చాలా అరుదైన గౌరవాలు వచ్చాయి. యునైటెడ్ నేషన్స్ 'సర్' నైట్ వుడ్ తో సత్కరించడం à°’à°• అరుదైన గౌరవం. ఇన్ని విజయాలతో పాటు ఇన్ని గౌరవాలు దక్కడం à°’à°• నటుడికి అరుదుగా జరుగుతుంది. ఇదంతా ప్రేక్షకులు ప్రేమామాభిమానాల వలనే సాధ్యపడింది.


కృష్ణ గారు, విజయనిర్మల లేని లోటుని ఎలా భర్తీ చేస్తున్నారు ?  
ఇల్లు à°’à°• పండగలా వుండేది. కృష్ణ గారు, విజయనిర్మలగారు,  à°‡à°‚దిరమ్మ గారు, రమేష్ .. ఇంతమంది వెళ్ళిపోవడం అనేది దాదాపుగా à°’à°• డిప్రెషన్ à°•à°¿ తీసుకెళ్ళింది. ఏదేమైనా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని ఎప్పుడూ నమ్ముతాను. వాళ్ళ ఆశయాలని ముందుకు తీసుకువెళతాం. అయితే à°ˆ సక్సెస్ ని వాళ్ళు చూడలేకపోతున్నారనే బాధ మాత్రం మనసులో వుంటుంది. వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం. వారు లేని లోటు ఎప్పటికీ వుంటుంది.


రాజకీయాల్లోకి మళ్ళీ వెళ్ళే ఆలోచన ఉందా ?
రాజకీయాల్లోకి ఒక సేవాభావంతో వెళ్లాను. అప్పటి ఇప్పటికీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితిలో అటు డైవర్ట్ కావడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వమైన సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. నంది అవార్డులని పరిశ్రమ చాలా గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డులని ప్రధానం చేయడం లేదు. ఒక తరం నటులు ఆ అవార్డులని చూడలేదు. నంది అవార్డు వేడుకని మళ్ళీ పునర్ నిర్మించాలని కోరుకుంటున్నాను.


మీ అబ్బాయి నవీన్ కి సలహాలు ఇస్తుంటారా ?
పరిశ్రమలో సక్సెస్ ప్రతిభని బట్టే వస్తుంది. నవీన్ పరిశ్రమలోకి తనుకు తానై వచ్చాడు. హీరోగా సినిమా చేశాడు. నవీన్ à°•à°¿ దర్శకుడిగా మంచి భవిష్యత్ వుంటుందని నమ్ముతున్నాను. తను చాలా మంచి రైటర్, ఎడిటర్  à°•à±‚à°¡à°¾. à°’à°• తండ్రిగా తనని మంచి దర్శకుడిగా చూడాలని కోరుకుంటున్నాను.


మీరు ఇంకా చేయాలనుకునే డ్రీం రోల్స్ ఉన్నాయా ?
చాలా వున్నాయి. అలాంటివి వస్తున్నాయి కూడా. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో కొత్త కొత్త పాత్రలు వస్తున్నాయి. మంచి నెగిటివ్ రోల్స్ చేయాలని వుంది. అలాంటి కూడా వస్తున్నాయి. నేను చేయదగ్గ లీడ్ రోల్స్ లో కూడా సినిమాలు చేస్తున్నాను. మంచి బ్యానర్స్ తో పాటు కొత్త వాళ్ళు లో బడ్జెట్ తో వస్తున్నా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. కథ, పాత్ర నచ్చితే రెమ్యునిరేషన్ గురించి ఎప్పుడూ అలోచించను.


విజయ కృష్ణ గ్రీన్‌ స్టూడియోస్‌ గురించి ?
విజయ కృష్ణ గ్రీన్‌ స్టూడియోస్‌ ని కంప్లీట్ మోడరన్ స్టూడియోగా చేస్తున్నాం. వర్చువల్ ఫ్లోర్స్ రూపొందించాలనే ఆలోచన కూడా వుంది. అలాగే త్వరలోనే మా బ్యానర్ లో à°’à°• ప్రొడక్షన్ ని అనౌన్స్ చేస్తాం. ఎంతకాలం నటుడిగా ఉంటానో అంతకాలం పరిశ్రమకు సేవ చేస్తాను.


మహేష్ బాబు, రాజమౌళి గారి సినిమా గురించి ?
మహేష్ à°•à°¿ మాస్, క్లాస్.. అన్ని వర్గాల్లో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. రాజమౌళి గారు ప్రపంచానికి ఇండియన్ సినిమాని పరిచయం చేసిన ఐకాన్. వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా తెలుగు సినీ పరిశ్రమని నెక్స్ట్ లెవల్ à°•à°¿ తీసుకువెళుతుందని నమ్ముతున్నాను.  


మీ సినిమాల్లో టాప్ 5 అంటే ఏం చెబుతారు ?
అలా చెప్పడం కష్టం.. లిస్టు చాలా పెద్దగా వుంటుంది( నవ్వుతూ) నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ, పోలీసు భార్య.. ఇలా చెబితే చాలా వుంటాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో గుంటూరు టాకీస్, సామజవరగమనా, మళ్ళీ పెళ్లి, ఇంటింటి రామాయణం.. ఇలా చాలా మంచి చిత్రాలు వున్నాయి.  


అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అండీ.. ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !