మనమంతా’, ‘తోలుబొమ్మలాట’ తర్వాత విశ్వంత్ చేస్తున్న సినిమా ‘ఓ పిట్టకథ’. విశ్వంత్, బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, నిత్యా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈనెల 6న చిత్రం విడుదవుతోంది. ఈ సందర్భంగా విశ్వంత్ దుద్దంపూడి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం...
పిట్టకథ గురించి చెప్పండి.. ఈ సినిమా ఎలా మొదలయ్యింది?
డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారి ఈ సినిమా గురించి చెప్పారు. చెందు ముద్దు చెప్పిన కథ చాలా బాగుంది చేస్తావా అని అడిగారు. యేలేటిగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే మరో మాట మాట్లాడకుండా సినిమా చేయడానికి అంగీకరించాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే... ఇందులో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ వుంటుంది. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది సినిమాకి హైలైట్.
చంద్రశేఖర్ యేలేటితో మీ అనుబంధం?
నేను ఆయన డైరెక్షన్ లో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆయన అంటే నాకు చా లా గౌరవం. నాకు సరైన కథ రావడంలేదు, ఒక పర్ఫెక్ట్ సినిమా చెయ్యాలి. మీతో ట్రావెల్ అవుతానని చెప్పి ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఇక స్క్రీన్ ప్లేలో ఆయనకున్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఆలాంటి ఆయనకు 'పిట్టకథ' స్క్రీన్ ప్లే బాగా నచ్చింది.. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.
‘ఓ పిట్టకథ’ చాలా సింఫుల్ టైటిల్.. ఈ టైటిల్ పెట్టడానికి కారణం?
ఈ స్టోరీకి స్ర్కీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఓ రకంగా చెప్పాలంటే స్ర్కీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ. నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు. విలేజ్ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా అనిపిస్తోంది. టైటిల్ అలా పెట్టడానికి కూడా స్క్రీన్ ప్లేనే కారణం.
ఈ సినిమాలో థ్రిల్ అయ్యే పాయింట్ ఏంటీ?
సినిమాలో థ్రిల్ అయిన పాయింట్ ఇప్పుడు నేను చెప్పే కంటే.. సినిమా చూశాక ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మీరు ఫీల్ అయితే బాగుంటుంది. అయితే నా క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను ఇలాంటి క్యారెక్టర్‌లో ఇంతవరకు చెయ్యలేదు.
మీ జర్నీ గురించి?
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే. కాకపోతే కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మంచి సినిమాలు చేశాను అనే సంతృప్తి ఉంది. కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాను.
కమర్షియల్‌గా హిట్ లేకపోతే మార్కెట్ పెరగడం కష్టం కదా?
అవును.. సినిమా అంటే కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వాలి. అయితే అన్ని సినిమాలు అలా అవ్వవు. బట్, నేను కూడా మంచి కమర్షియల్ హిట్ కోసం చూస్తున్నాను. రీసెంట్‌గా ‘కాదల్’ అని ఒక సినిమా చేశాను. అది నాకు కమర్షియల్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాను.
మీ తదుపరి సినిమాలు?
‘కాదల్’ మూవీ రాబోతుంది. అలాగే ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో సినిమా కూడా ప్రస్తుతం షూట్‌లో ఉంది. ఈ సినిమా ఎమోషనల్‌గా సాగుతూనే కమర్షియల్ యాంగిల్‌లోనే ఉంటుంది. ఈ రెండు సినిమాలు బాగా వస్తున్నాయి.