View

ఇండియన్ సినిమాలో 'అయలాన్' కొత్త ప్రయత్నం - శివ కార్తికేయన్

Thursday,January25th,2024, 12:33 PM

''నా చిన్నప్పుడు 'కోయి మిల్ గయా' సినిమా చూసి హృతిక్ రోషన్ ఫ్యాన్ అయ్యా. ఇప్పుడీ 'అయలాన్' విడుదల తర్వాత తెలుగు రాష్ట్రాలలో చిన్నపిల్లల అందరూ శివ కార్తికేయన్ గారి అభిమానులు అయిపోతారు. ప్రచార చిత్రాలు బాగున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది'' అని యువ హీరో కార్తికేయ అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'అయలాన్'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. శుక్రవారం తెలుగులో à°—à°‚à°— ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. à°ˆ సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. స్టేజి మీద ఇద్దరు కార్తికేయలు... శివ కార్తికేయ, కార్తికేయ గుమ్మకొండ సందడి చేశారు. ఇంకా దర్శకులు గోపీచంద్ మలినేని, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. వాళ్ల చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరించారు.


ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా... ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు.


యంగ్ హీరో కార్తికేయ మాట్లాడుతూ ''మహేశ్వర్ రెడ్డి గారు 'అయలాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఇన్వైట్ చేసినప్పుడు శివకార్తికేయన్ గారిని కలవచ్చని వచ్చేశా. నా పేరు కార్తికేయ... శివ కార్తికేయన్ గారిలా అవ్వాలని అనుకుంటున్నా. నాలాంటి చాలా మంది యాక్టర్లకు ఇన్స్పిరేషన్. బ్యాగ్రౌండ్ లేకుండా ఎవరైనా సాధించవచ్చని నిరూపించిన హీరోల్లో రీసెంట్ స్టార్ శివకార్తికేయన్ గారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన స్నేహితులను తీసుకొచ్చారు. మనం ఎదుగుతూ మనతో పాటు పదిమందిని పైకి తీసుకు వెళ్లాలని అంటారు. శివ కార్తికేయన్ గారు తన స్నేహితులను కూడా ఉన్నత స్థాయికి తీసుకు వస్తున్నారు. ఆయన రీసెంట్ మూవీ 'మహావీరుడు' నా మోస్ట్ ఫేవరెట్. తమిళంలో ఆయన వరుస విజయాలు అందుకుంటున్నారు. 'వరుణ్ డాక్టర్' నుంచి తెలుగులో డబ్బింగ్ చేస్తూ ఇక్కడ కూడా హిట్స్ అందుకుంటున్నారు. నేను చిన్నప్పుడు 'కోయి మిల్ గయా' చూసినప్పుడు హృతిక్ రోషన్ ఫ్యాన్ అయ్యా. తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లలు 'అయలాన్' చూసి శివకార్తికేయన్ గారి ఫ్యాన్స్ అవుతారని ఆశిస్తున్నాను. తెలుగులో కూడా సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.


శివకార్తికేయన్ మాట్లాడుతూ ''ట్రైలర్ చూసి ఉంటారు. 'అయలాన్' సినిమా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్. ఫాంటసీ ఫిలిమ్స్ ఎప్పుడూ ప్రేక్షకులకు నచ్చుతాయి. నేను, ఏలియన్ కలిసి ఈసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాం. à°ˆ సినిమాను పిల్లలు, ఫ్యామిలీ... అందరూ కలిసి చూడొచ్చు. అందరికీ నచ్చుతుంది. ఇండియన్ సినిమాలో ఇది à°’à°• కొత్త ప్రయత్నం. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరించారు. సంక్రాంతికి విడుదలైన 'హనుమాన్' పెద్ద హిట్ అయ్యింది. à°† టీంకు కంగ్రాట్స్. à°† సినిమా ఎలాగైతే అందర్నీ ఎంటర్టైన్ చేసిందో, à°ˆ 'అయలాన్' కూడా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. అందరూ థియేటర్లకు వెళ్లి à°ˆ సినిమాను చూడండి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ బావుంటుంది. తమిళనాడులో సంక్రాంతికి విడుదలైన à°ˆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అక్కడ అందరికీ నచ్చింది. ఇక్కడ కూడా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ హైలైట్. రకుల్, భానుప్రియ, యోగి బాబు, శరద్ కేల్కర్... ప్రతి ఒక్కరూ బాగా నటించారు. తెలుగు ప్రేక్షకులు కూడా à°ˆ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంత వరకు నాకు ఇచ్చిన సపోర్ట్ à°•à°¿ థాంక్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. మా సినిమాను విష్ చేయడానికి వచ్చిన అతిథులకు థాంక్స్. బాస్ చిరంజీవి గారితో వశిష్ఠ గారు తీయబోయే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. గోపీచంద్ మలినేని గారి 'క్రాక్', 'వీర సింహా రెడ్డి' ఎంజాయ్ చేశా. ఆయన మరిన్ని ఎంటర్టైనర్స్ తీయాలి. à°ˆ రోజు ఇద్దరు కార్తికేయలు à°ˆ స్టేజి మీద ఉన్నారు. 'వలిమై' సినిమాలో కార్తికేయ నటనను తమిళ ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు. à°—à°‚à°— ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి గారు 'వరుణ్ డాక్టర్'ను తెలుగులో విడుదల చేశారు. అది సూపర్ సక్సెస్. à°† తర్వాత మేం à°ˆ సినిమా చేస్తున్నాం. ఇది సూపర్ సక్సెస్ అవుతుంది. ఆయనకు ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''సంక్రాంతికి తమిళంలో విడుదలైన 'అయలాన్' బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళనాడులో ఫ్రెండ్స్ సినిమా గురించి బాగా చెప్పారు. ఫాంటమ్ కంపెనీ వీఎఫ్ఎక్స్ బాగా చేశారని చెప్పారు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు తమిళంలో సినిమాకు మంచి పేరు వచ్చిందన్నారు. రవికుమార్ హార్డ్ వర్క్ ఆయనకు ఇంత పెద్ద విజయం వచ్చింది. తెలుగులో కూడా హిట్ అవుతుంది. 'అయలాన్' టీజర్ చూసి షాక్ అయ్యా. లాస్టులో ఏలియన్‌ను కొట్టి à°Ÿà±€ పెట్టమని చెప్పే సీన్ చూసి నవ్వుకున్నాను. 'వాలిబర్ సంఘం' నుంచి శివ కార్తికేయన్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన ప్రతి సినిమా చూశా. ఆయన కామెడీ టైమింగ్ ఎక్స్ట్రార్డినరీ. ఆయన ఆల్ రౌండర్. ఎంటర్టైన్మెంట్ స్టార్‌ను చేస్తుంది. 'డాన్', 'వరుణ్ డాక్టర్' సినిమాలు నచ్చాయి. 'అయలాన్'తో తెలుగులో మహేశ్వర్ రెడ్డి గారికి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రవికుమార్ స్టేజి మీద తెలుగు మాట్లాడుతుంటే 'స్టాలిన్' సినిమాకు వర్క్ చేసేటప్పుడు మురుగదాస్ గారిని చూసినట్టు ఉంది. à°…à°‚à°¤ తపనతో తెలుగు నేర్చుకుంటున్నారు. మా గురువు మురుగదాస్ గారితో శివకార్తికేయన్ సినిమా చేయబోతున్నారు. ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.


దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ ''నేను శివకార్తికేయన్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన అన్ని సినిమాలు ఫాలో అవుతాను. నేను రజనీకాంత్ గారికి పెద్ద ఫ్యాన్. శివ కార్తికేయన్ యంగ్ రజనీలా ఉంటారు. కంగ్రాట్స్ టు ఫాంటమ్ కంపెనీ. ఇది మామూలు కష్టం కాదు. ప్రతి ఫ్రేమ్ చేయాలి. మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు రవికుమార్ కి కంగ్రాట్స్. 2015లో ఆయన ఫస్ట్ సినిమా విడుదల అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే సినిమా 'అయలాన్' మీద ఉన్నారు. అంత ప్రెజర్ తీసుకుని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. తెలుగులో కూడా అంత కంటే హిట్ అవ్వాలి. 'డాక్టర్' తర్వాత మహేశ్వర్ రెడ్డి గారికి ఆ సినిమా కంటే ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.


గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ''శివ కార్తికేయన్ గారితో మాకు మంచి అనుబంధం ఉంది. తెలుగులో మరోసారి ఆయన సినిమా విడుదల చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే చిత్రం ఇది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది'' అని అన్నారు.


చిత్ర దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ ''సినిమాను ప్రేమిస్తూ... చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నిటినీ థియేటర్లకు వెళ్లి చూస్తూ... అవి ఘన విజయాలు సాధించేలా చేసే తెలుగు ప్రేక్షకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సినిమాకు అతి పెద్ద శక్తి ఉంది. అది భాషా భేదం లేకుండా మనల్ని కలుపుతుంది. ప్రేమించేలా చేస్తుంది. నేను కూడా తెలుగు సినిమాలు ఇష్టపడి చూస్తాను. ఈ రోజు అన్ని సినిమాలను డబ్బింగ్ చేసి విడుదల చేయడం వల్ల భాషా భేదం లేకుండా ఆనందించగలుగుతున్నాం. కొత్త ప్రయత్నాలను, ఫాంటసీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో మేం కూడా ఏలియన్ జానర్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాగా 'అయలాన్'ను తీశాం. మీరు ఆదరిస్తున్నారని నమ్ముతున్నాను'' అని అన్నారు.


రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ''రవికుమార్ మూడు నాలుగేళ్లు ఓపిగ్గా ఈ సినిమా తీశారు. ఇటువంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఈ సినిమాను ప్రోత్సహించిన శివకార్తికేయన్ గారు అభినందనీయులు. ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో టైటిల్ సాంగ్, మరొక పాట రాశా. సంక్రాంతికి తమిళనాడులో విజయఢంకా మోగించింది. తెలుగులో కూడా హిట్ అవుతుంది'' అని అన్నారు.


రాకేందు మౌళి మాట్లాడుతూ ''నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి నాకు శివకార్తికేయన్ గారు తెలుసు. షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో క్యారెక్టర్స్ నుంచి ఈరోజు హీరోగా స్టార్ స్టేటస్ అందుకున్నారు. అప్పటికి, ఇప్పటికి ఆయన ఏం మారలేదు. రెహమాన్ గారి గురించి ఒక సందర్భంలో 'ఆయన ఎప్పుడో శిఖరాన్ని టచ్ చేశాడు. అయినా అతడి పాదాలు నేల మీద ఉన్నాయి' అని చెప్పారు. శివకార్తికేయన్ గారికి కూడా ఆ మాట సరిపోతుంది. సంక్రాంతికి తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో నాలుగు పాటలు రాశా. రెహమాన్ గారి సంగీతంలో 45వ సాంగ్ అనుకుంటున్నా. 'లాల్ సలాం', మిగతా సినిమాలు రాస్తే 50 పాటలు పూర్తి అవుతాయి. మరో రెండు పాటలు రామజోగయ్య శాస్త్రి గారు, మాటలు రాజేష్ ఏ మూర్తి గారు రాశారు. తెలుగులో 'అయలాన్' విడుదల చేస్తున్న మహేశ్వర్ రెడ్డి గారికి నా ఫస్ట్ డబ్బింగ్ సినిమా చేశా. 'మరకతమణి'కి మాటలు, పాటలు రాశా. థియేటర్లలో ఈ సినిమా బాగా ఆడి, ఆయనకు డబ్బులు రావాలని కోరుకుంటున్నా. థియేటర్లలో ప్రేక్షకులు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి'' అని అన్నారు.


వీఎఫ్ఎక్స్ కాన్సెప్ట్ డిజైనర్, విజువల్ డెవలప్మెంట్ విశ్వనాథ్ సుందరం మాట్లాడుతూ ''నేను 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్', 'మరక్కార్' వంటి చారిత్రాత్మక సినిమాలకు పని చేశా. ఏడేళ్ల క్రితం దర్శకుడు రవికుమార్ ఈ సినిమాకు పని చేయాలని నన్ను పిలిచారు. సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతో ఎగ్జైట్ అయ్యా. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్'' అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !