View

ఇంటర్య్వూ - తరుణ్ రాజ్ అరోరా (అర్జున్ సురవరం)

Wednesday,December04th,2019, 09:18 AM

స్టైలిష్ విల‌న్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు త‌రుణ్ రాజ్ అరోరా. ఖైదీ నంబ‌ర్ 150 త‌ర్వాత మ‌ళ్లీ అర్జున్ సుర‌వ‌రం లో ప్ర‌తినాయ‌కుడిగా నటించాడు. క‌థానాయిక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన అంజ‌లా జ‌వేరి భ‌ర్తే త‌రుణ్ అరోరా. ఇటీవ‌ల అర్జున్ సుర‌వ‌రం విడుద‌లైన సంద‌ర్భంగా తరుణ్ అరోరా తో ఇంటర్వ్యూ...


నా కెరీర్ మొదట మోడలింగ్ తో స్టార్ట్ అయ్యింది. అందుచేత నేను ప్ర‌తి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తాను. అది న‌ట‌న‌లోనూ క‌నిపించేలా చూసుకోవ‌డం నా బాధ్యత. ఆ ప్ర‌య‌త్నంలో సక్సెస్ అయ్యానని సంతృప్తి ఉంది.


నిఖిల్ అర్జున్ సురవరం లో చాలా మంచి పాత్ర‌లో నటించాను. త‌మిళ చిత్రం కణిత‌న్‌ కి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృక‌లో కూడా నేనే న‌టించా. అక్క‌డ క‌థ  ప్ర‌ధానంగా హీరో, విల‌న్‌ల మ‌ధ్యే సాగుగుతుంటుంది. తెలుగులో మాత్రం ఇత‌ర పాత్ర‌ల‌కి కూడా ప్రాధాన్యం ద‌క్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకి మరింత మేలు చేసింది. చూసిన‌వాళ్లంతా బాగుంది అంటున్నారు.


యాక్టింగ్ భాష‌కి సంబంధించిన మ్యాటర్ కాదు. భావం ముఖ్యం. ఎక్క‌డైనా భావాలు, భావోద్వేగాలు ఒకే ర‌కంగా ఉంటాయి. అయితే హిందీలో నా సంభాష‌ణ‌ల్ని ఒక గంట ముందు చెబితే స‌రిపోతుంది, ఇక్క‌డైతే ఇంకొంచెం ముందు చెబుతుంటారు. కాక‌పోతే నాకు భాష‌ల‌తోనూ, ప్రాంతాల‌తోనూ నాకున్న అనుబంధం ప్ర‌త్యేకంగా ఉంటుంది. నేను అస్సోంలో పుట్టా. చ‌దువుల కోస‌మ‌ని చెన్నై వ‌చ్చా. బెంగుళూరులో మోడ‌ల్‌గా కొన‌సాగా. అలా అన్ని సౌత్ ఇండియా సిటీస్ తో నాకు అనుబంధం ఉంది. హిందీ చిత్రాల్లో అవ‌కాశాలు రావ‌డంతో ముంబై వెళ్లా. అక్క‌డ్నుంచి ఇప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చాయి, మ‌ళ్లీ ద‌క్షిణాదికి వ‌చ్చా. ఎక్క‌డికి వెళ్లినా నువ్వు అక్క‌డివాడివి క‌దా అంటుంటారు. అయితే ఇప్పుడు చాలామంది న‌న్ను సౌత్ విల‌న్ అని పిలుస్తుంటారు. ఈ గుర్తింపు నాకు చాలు అనుకుంటున్న.


నా భార్య అంజలా జవేరి న‌ట‌న గురించి నాకెప్పుడూ ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వ‌దు. నీకు న‌చ్చింది చేయ్ అంటుంది.  నేను చేసిన సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.


కొన్ని సినిమాల్లో చేసిన పాత్ర‌లు సంతృప్తినివ్వ‌క‌పోవ‌డంతో మళ్ళీ మోడలింగ్ లోకి వెళ్ళాను. ఆ సినిమాల‌తో నిర్మాత‌ల‌కి డ‌బ్బులొచ్చాయి కానీ, స‌రైన పాత్ర‌లు అనిపించ‌లేదు. దాంతో మోడ‌లింగ్‌వైపు వెళ్లాలనిపించింది. కానీ అప్పుడు చేసిన ఆ  త‌ప్పులు, అప్పుడు చేసిన ఆ సినిమాలు ఇప్పుడు బాగా ప‌నికొస్తున్నాయి. నేను చేసిన తప్పులు నన్ను చాలా నేర్పించాయి.


అంజలా జవేరి నేను ముంబాయిలో ప్రేమలో పడ్డాం. నేను మోడలింగ్ చేసేవాడిని, ఆమె నటిగా ఉంది, ఆ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ముందు నేనే ప్రేమ‌ని వ్య‌క్తం చేశా. అప్పుడు త‌ను ద‌క్షిణాదిలో సినిమాలు చేస్తుంది. నేనేమో మోడ‌ల్‌గా ఉన్నా. ఒక ఈవెంట్‌లో క‌లుసుకున్న‌ప్పుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్నాం. త‌ర్వాత ప్రేమ‌, పెళ్లి. మాకు పిల్ల‌లు లేరు, పిల్లలు వద్దు అనునకున్నాం. మేమే ఒక‌రికొక‌రు పిల్ల‌ల్లాగా ఉంటాం.


అంజలా జవేరి మంచి క‌థ కోసం ఎదురు చూస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి ప్ర‌స్తుతం చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ ద‌శ‌లో త‌న‌కి త‌గ్గ క‌థ, పాత్ర చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. త్వరలో ఆమె నటించే చిత్ర వివరాలు తెలియజేస్తాము.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !