View

హీరోగా తెరంగేట్రం చేసిన రవితేజ సోదరుడి తనయుడు

Thursday,March23rd,2023, 03:02 PM

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. పెళ్లి సందD చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశిస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


ఈ సందర్భంగా నిర్మాత జె జే ఆర్ రవిచంద్ గారు మాట్లాడుతూ ..  జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీలో ఈ రోజు ప్రొడక్షన్ నెంబర్ 2 ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉంది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఈ కార్య్రమంలో రాఘవేంద్రరావు గారు స్క్రిప్ట్ అందజేయడం.. ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టడం.. కెమెరా సురేష్ బాబు గారు స్విచ్ ఆన్ చేశారు. వారికి కృతజ్ఞతలు. పెళ్లి సందD మూవీతోనే ప్రూవ్ చేసుకున్న దర్శకురాలు గౌరి రోణంకి రెండో చిత్రాన్ని మా బ్యానర్ లో చేయడం సంతోషంగా ఉంది. రవితేజ గారి సోదరుడు రఘు గారి అబ్బాయి మాధవ్ ను హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా గౌరి గారి పెళ్లి సందడి ఫ్లేవర్ లో కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. మంచి పాయింట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి.. తన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ గారు షూటింగ్ లో బిజీగా ఉండి.. ఈ ఓపెనింగ్ కు రాలేకపోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తోన్న మాధవ్ గారు ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. గతంలో సాంబశివ క్రియేషన్స్ బ్యానర్ లో ఐదు చిత్రాలు చేశాను. జేజేఆర్ బ్యానర్ లో మొదటి సినిమా నవీన్ చంద్రతో చేశాను. ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో అన్ని క్రాఫ్ట్స్ హైలెట్ కాబోతున్నాయి. టెక్నీషియన్స్ అందరూ ఇప్పటికే పెద్ద సినిమాలు చేసి నిరూపించుకుని ఉన్నారు. మొదట్నుంచీ నాకు సపోర్ట్ గా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్యూ సో మచ్..’ అన్నారు.


దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ .. ‘నా తల్లి దండ్రులకు, మా గురువు గారు కే రాఘవేంద్రరావు గారికి థ్యాంక్యూ సో మచ్. ఓ రకంగా ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారు, సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్ గా సాగే కలర్ ఫుల్ గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు  ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ తో సపోర్ట్ గా నిలుస్తున్నారు అనుకుంటున్నాను. ఇక నా గత చిత్రం లాగానే మీడియా సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.


హీరో మాధవ్ మాట్లాడుతూ.. ‘అందరికీ చాలా థ్యాంక్యూ. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడి వచ్చిన అందరికీ థ్యాంక్యూ సో మచ్’ అన్నారు.


త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర నటీ నటుల వివరాలు తెలియజేయబోతోన్న ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు..


సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : రామ్
ఆర్ట్ డైరెక్టర్  : కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ : విప్లవ్
పిఆర్వో : జిఎస్కే మీడియా
నిర్మాత : జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం : గౌరి రోణంకి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !