మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పన్ కోషియమ్' చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సాగరచంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ రీమేక్ లో రవితేజ, రానాని నటింపజేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే రవితేజ, రానాను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రానా అయితే ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ పై సైన్ చేసేసాడట. కానీ రవితేజ ఇంకా సైన్ చేయలేదు. దానికి కారణం ఉందట. అదేంటంటే...
రవితేజ అడిగిన పారితోషికానికి నిర్మాతలు ఇంకా అంగీకారం తెలపలేదట. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. పారితోషికం ఫైనలైజ్ అయిన తర్వాత రవితేజ ఈ సినిమా కి సైన్ చేసే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.