గ్లామర్ చిందిస్తూ, మంచి పాత్రలు చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా ఆ స్టార్ హీరో పాలిట విలన్ అయ్యింది. ఎవరా స్టార్ హీరో అనే వివరాల్లోకి వెళితే...స్టార్ హీరో విశాల్ 'చక్ర' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా ఈ సినిమాలో రెజీనా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర ఏంటనే విషయం తెలియదు. తాజా వార్తల ప్రకారం రెజీనాది విలన్ రోల్ ఆట. ఆమె నటన ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందట. అయితే రెజీనా విలన్ గా నటిస్తోందనే విషయంలో చిత్రం యూనిట్ సీక్రెన్సీ మెయింటెన్ చేస్తోంది. టీజర్ లో ఎక్కడా రెజీనాని చూపించలేదు. సినిమాలో కూడా సెకండ్ హాఫ్ వరకూ విలన్ ఎవరనే విషయం తెలియదట. ఆమె క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసారని సమాచారమ్.
బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాధ్ కథానాయికగా నటిస్తోంది. ఎం.ఎస్.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది.