సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇకలేరు అనే వార్త చిత్ర పరిశ్రమను షాక్ కి గురి చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు ఆరోగ్యం విషమించడంతో ఏఐజీ హాస్పటల్ కు తరలిస్తున్న సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్టు వార్తలు అందుతున్నాయి.
బాలనటుడిగా 'అల్లూరి సీతారామరాజు' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసారు రమేష్ బాబు. 1987 లో 'సామ్రాట్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. దాదాపు 15 సినిమాల్లో హీరోగా నటించిన రమేష్ బాబు చివరిగా తండ్రి కృష్ణతో కలిసి 'ఎన్ కౌంటర్' చిత్రంలో నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన రమేష్ బాబు సోదరుడు మహేష్ బాబుతో 'అర్జున్', 'అతిధి' చిత్రాలను నిర్మించారు. రమేష్ బాబు మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పులువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.