View

జేమ్స్ బాండ్ మూవీ రివ్య్వూ

Friday,July24th,2015, 09:22 AM

చిత్రం - జేమ్స్ బాండ్
బ్యానర్ - ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్
నటీనటులు - అల్లరి నరేష్, సాక్షి చౌదరి, చంద్రమోహన్, ప్రభ, ఆశిష్ విద్యార్ధి, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని కృష్ణమురళి తదితరులు
మాటలు - శ్రీధర్ సీపాన
ఎడిటింగ్ - ఎం.ఆర్.వర్మ
కెమెరా - దాము నర్రాపు
సంగీతం - సాయి కార్తీక్
సమర్పణ - ఎ టీవి
కో-ప్రొడ్యూసర్ - అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిషోర్ గరికిపాటి
ప్రొడ్యూసర్ - రామబ్రహ్మం సుంకర
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సాయికిశోర్ మచ్చ
విడుదల తేదీ - 24.7.2015

'జేమ్స్ బాండ్'... ఈ క్యారెక్టర్ కి ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులున్నారు. వెండితెరపై జేమ్స్ బాండ్ చేసే వీరోచిత విన్యాసాలకు థ్రిల్ అయిపోతుంటారు. అంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ను టైటిల్ గా చేసుకుని 'అల్లరి' నరేశ్ హీరోగా ఓ సినిమా రూపొందితే అంచనాలు ఉంటాయి. పైగా.. 'నేను కాదు నా పెళ్లాం' అనే ట్యాగ్ లైన్ పెట్టడం వల్ల అసలీ 'జేమ్స్ బాండ్' ఎలా ఉంటుంది? అనే ఆసక్తి ప్రేక్షకులకు కలగడం సహజం. ఆ ఆసక్తితో థియేటర్ కి వచ్చే ప్రేక్షకులను రంజింపజేసేలా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడా? నరేశ్ మార్క్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం సంతృప్తిపరుస్తుందా?.. తెలుసుకుందాం.

à°•à°¥
బుల్లెట్ అలియాస్ పూజ (సాక్షి చౌదరి) దుబాయ్ ని గడగడలాడించే డాన్. ఆమె తండ్రి సుమన్. చిన్న వయసులోనే బుల్లెట్ ను తల్లి (ప్రభ)కి దూరంగా తీసుకెళ్లిపోయి, దుబాయ్ లో పెంచుతాడు సుమన్. ఎవ్వరికీ భయపడకూడదని కూతురిని డాన్ లా తయారు చేస్తాడు. పెద్దయ్యాక బుల్లెట్ దుబాయ్ ని తన గుప్పెట్లో పెట్టుకుని రాజ్యమేలుతుంటుంది. తండ్రి సుమన్ చనిపోతూ బుల్లెట్ కి ఆమె తల్లి గురించి చెప్పి, ఇండియాలో ఉన్న తల్లిని కలవమని చెబుతాడు. ఇండియాలో ఉన్న తల్లిని కలిసిన బుల్లెట్ తనకు దుబాయ్ లో ఉద్యోగం అని చెప్పి అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి ఆమెను కలుస్తుంటుంది. ఒకరోజు తన తల్లికి క్యాన్సర్ అని తెలుసుకున్న బుల్లెట్ దుబాయ్ నుంచి వచ్చేసి, తల్లి కోరిక మేరకు ఇండియాలో తల్లితో పాటు సెటిల్ అవుతుంది. తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. కాకపోతే కాపురం చేయడానికి కాదు... తల్లి ముందు నటించే మొగుడు తనకు కావాలనుకుంటుంది బుల్లెట్. ఇందుకోసం కొన్ని కండీషన్స్ పెట్టి పెళ్లికొడుకుని సెట్ చేయమని తన మనుషులను ఆజ్ఞాపిస్తుంది. శారదరావు అనే మ్యారేజ్ బ్రోకర్ దగ్గర బుల్లెట్ ఫోటో ఇచ్చి ఆమె బ్యాక్ గ్రౌండ్ చెప్పి, అతనిని బెదిరించి వరుడిని వెతకమని చెబుతారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న నాని( అల్లరి నరేష్) తన పెళ్లి గురించి, తనకు కాబోయే భార్య గురించి బోల్డన్ని కలలు కంటాడు. మంచి సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడపాలనుకుంటాడు. గుడిలో బుల్లెట్ ని సంప్రదాయకరమైన కట్టు., బొట్టుతో చూసిన నాని తొలి చూపుతోనే ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తల్లి కోసం బుల్లెట్ గుడికి అంత సంప్రదాయబద్ధంగా వెళుతుంది. బుల్లెట్ కోసం వెతుకుతూ ఉంటాడు నాని. ఫ్రెండ్ ద్వారా మ్యారేజ్ బ్రోకర్ దగ్గర బుల్లెట్ ఫోటో ఉన్న సంగతి తెలుసుకుని అతని దగ్గరకి వెళ్లి తన పెళ్లి బుల్లెట్ తో సెట్ చేయమని చెబుతాడు. బుల్లెట్ డాన్ అన్న సంగతి తెలిస్తే ఎవ్వరూ పెళ్లి చేసుకోవడంలేదని, ఆ విషయాన్ని దాచేసి బుల్లెట్, నాని పెళ్లి జరిపించేస్తాడు శారదా రావు.

పెళ్లి తర్వాత తన భార్య డాన్ అన్న సంగతి తెలుసుకున్న నాని ఏం చేస్తాడు? తల్లి కోసం నటించడానికే భర్త కావాలనుకున్న బుల్లెట్ చివరికి నానిని వదిలేస్తుందా? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు
'అల్లరి' నరేశ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రని అయినా సునాయాసంగా చేసేస్తాడు. ఈ చిత్రంలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన సాఫ్ట్ కుర్రాడు లక్ష్మీప్రసాద్ అలియాస్ నానిలా బాగా నటించాడు నరేశ్. పిరికితనం ప్రదర్శించే సన్నివేశాల్లో నవ్వించాడు. నరేశ్ బాడీ లాంగ్వే్జ్ బాగుంది. ఇక, బుల్లెట్ అలియాస్ పూజ అనే డాన్ పాత్రకు వంద శాతం సరిపోయింది సాక్షీ చౌదరి. పవర్ ఫుల్ డాన్ గా తను కనిపించే సన్నివేశాలు బాగున్నాయి. యాక్చువల్ గా రొమాంటిక్ సీన్స్ కన్నా పవర్ ఫుల్ సీన్స్ లోనే తను బాగా నటించిందని చెప్పాలి. ఇక, చంద్రమోహన్, ప్రభ, జయప్రకాశ్ రెడ్డి, సత్యకృష్ణన్, ఆశిష్ విద్యార్థి, అలీ, సప్తగిరి, తాగుబోతు రమేష్ ఇలా సినిమాలో బోల్డంత మంది నటీనటులు ఉన్నారు. అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
కథ మామూలుదే. చిన్న పాయింట్ చుట్టూ సన్నివేశాలు అల్లి, తీశారు. కాకపోతే, నరేష్ గత చిత్రాల ఛాయలు అక్కడక్కడా కనిపించాయి. దర్శకుడు ఓకే అనిపించుకున్నాడు. ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ శ్రీధర్ సీపాన డైలాగ్స్. పంచ్ డైలాగ్స్ బాగా రాశాడు. ఎమోషన్ సీన్స్ లో కూడా పంచ్ డైలాగ్స్ రాయాలనే తాపత్రయం కనిపించలేదు. ఏ సీన్ కి ఎలా రాయాలో అలానే రాశాడు. సాయికార్తీక్ అందించిన పాటలు ఓకే అనే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణ విలువలను మెచ్చుకోవాలి. ఏ విషయంలోనూ రాజీపడకుండా నిర్మించారు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
నరేశ్ అంటే కామెడీ సినిమానే చేయాలి. తను బాగా నటించగలిగినప్పటికీ నరేశ్ ని సీరియస్ రోల్స్ లో ప్రేక్షకులు అంగీకరించలేదు. అందుకు ఓ ఉదాహరణ 'నేను'. ఆ సినిమా తర్వాత పూర్తిగా కామెడీ జోనర్ కి పరిమితమైపోయాడు నరేశ్. ప్రేక్షకుల ఇష్టం మేరకు వినోదమే ప్రధానంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తరహా చిత్రమే 'జేమ్స్ బాండ్'. ఒక్క వినోదాన్ని ఆశించి మాత్రమే ఈ సినిమాకి వెళితే, నిరుత్సాహపడే అవకాశం లేదు. ఎందుకంటే, సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ స్పీడ్ గా ఉంది. అర్థం కాక బుర్ర గోక్కునే సన్నివేశాలు, ఇబ్బందిపడే బూతు జోకులు లేవు. ఒకే ఒక్క రొమాంటిక్ సాంగ్ మినహాయిస్తే, ఇది క్లీన్ సినిమా.

ఇది కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కాదు. బ్రహ్మాండం బద్దలు కొడతామని చిత్రబృందం వాగ్ధానాలు చేయలేదు. సరదాగా నవ్వుకునే మంచి ఎంటర్ టైనర్ తీశాం అని చెప్పారు. చెప్పిందే చేశారు. తన మార్క్ సినిమాతో 'నరేశ్ ఈజ్ బ్యాక్' అనిపించుకున్నాడు మన అల్లరోడు. పాపం.. డాన్ అయిన వైఫ్ చేతిలో చిక్కుకుపోయి మనవాడు పడే పాట్లు, ఆ తర్వాత అదే డాన్ వైఫ్ ని కాపాడటానికి తొడగొట్టే భర్తగా మన అల్లరోడు చేసిన ఫైట్లు... మొత్తం మీద తెగ సందడి చేశాడు. ఈ సందడిని ఓసారి చూస్తే.. ఏమీ కాదు.. మహా అయితే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు.

ఫైనల్ గా చెప్పాలంటే ఇది అవుట్ అండ్ అవుట్ నరేశ్ మార్క్ ఎంటర్ టైనర్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !