filmybuzz
filmybuzz

View

అర్ధనారి మూవీ రివ్య్వూ

Friday,July01st,2016, 09:10 AM

చిత్రం - అర్ధనారి
బ్యానర్ - పత్తికొండ సినిమాస్
నటీనటులు - అర్జున్ యజత్, మౌర్యాని తదితరులు
సినిమాటోగ్రఫీ - సాయి శ్రీనివాస్ గాదిరాజు
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం - రవివర్మ
మాటలు - నివాస్
నిర్మాత - రవికుమార్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - భానుశంకర్


అర్జున్ యజత్, మౌర్యాని ప్రధాన పాత్రలో పత్తికొండ సినిమాస్ పతాకంపై భాను శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అర్ధనారి'. టైటిల్, ఈ సినిమా ట్రైలర్స్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాయి. కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ మంచి మెసేజ్ కూడా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగట్టు ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
నల్లమల అడవుల్లో ఓ వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తుండటంతో ఈ సినిమా ఆరంభమవుతుంది. ఆ వ్యక్తి గురించి తెలియాలంటే టైం వచ్చేంతవరకూ ఆగాల్సిందేనని పోలీసులకు అడవుల్లో ఉన్న సన్యాసులు చెబుతారు. దాంతో పోలీసులు అడవుల నుంచి వెనుదిరుగుతారు. కట్ చేస్తే...


ట్రైన్ లో హైదరాబాద్ కి వస్తుంటాడు అర్ధనారి. టిక్కెట్ లేని కారణంగా టిసి అర్ధనారి దగ్గర మిస్ బిహేవ్ చేస్తాడు. ట్రైన్ దిగిన అర్ధనారి తన చేతిలో ఉన్న బ్యాగ్ ని ఓ పోలీస్ వెహికల్ కి తగిలించి, ఆ బ్యాగ్ లో బాంబులు ఉన్నాయని ఎఫ్ ఎం స్టేషన్ కి ఫోన్ చేసి చెబుతాడు. బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ఆ బ్యాగులో బాంబులు లేవని తేలుస్తారు. పోలీసులు రైల్వే టిసి తల, ఓ టివి చానెల్ ప్రతినిధి తల ఆ బ్యాగ్ లో ఉందని తెలుసుకుని షాక్ అవుతారు. హిజ్రాల గ్రూప్ లో చేరిన అర్ధనారి ఓ విషయంలో జడ్జిని, అతని గర్ల్ ఫ్రెండ్ ని చంపి వీడియోని పోలీసులకు పంపిస్తాడు. ఆ తర్వాత ఓ మంత్రి కొడుకుని చంపడంతో పాటు పోలీసు శాఖకు చెందిన కొంతమందిని, ప్రభుత్వ అధికారులను, చివరికి సి.యం ని కిడ్నాప్ చేస్తాడు అర్ధనారి. పోలీసులు ఓ పధకం ప్రకారం ట్రాప్ చేసి అర్ధనారిని పట్టుకుంటారు. అర్ధనారి చేసిన హత్యలు, నేరాలను పరిగణనలోకి తీసుకుని అతను ఓ సైకో అని తేల్చి జడ్జి ఊరిశిక్షను ఖరారు చేస్తారు.


అసలు అర్ధనారి ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చింది.. అర్ధనారి గతం ఏంటీ... హత్యలన్నింటికి కారణం అర్ధనారినేనా.. ఉరిశిక్ష పడ్డ అర్ధనారికి ఏమయ్యింది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
హీరో అర్జున్ ఈ చిత్రంలో అర్ధనారిగా నటించాడు. నటించాడు అనేకంటే అద్భుతంగా పెర్ ఫామ్ చేసాడు అనడం కరెక్ట్. లారెన్స్, శరత్ కుమార్ 'కాంచన' సినిమాలో హిజ్రాలుగా నటించి అదరగొట్టారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా నటించాడు అర్జున్. ఈ సినిమా అతనికి చాలా ప్లస్ అవుతుంది. ఓ విధంగా చెప్పాలంటే సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. హీరోయిన్ మౌర్యాని కూడా నటన పరంగా ప్లస్ మార్కులు వేయించుకుంటుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


సాంకేతిక వర్గం
బలమైన స్టోరీ లైన్, ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో ఈ చిత్రాన్ని చక్కగా మలిచాడు డైరెక్టర్ భాను శంకర్. చక్కటి మెసేజ్ కూడా ఉంది. కమర్షియల్ హంగులు కూడా ఉండటంతో ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఆ రకంగా డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకుని తీరాల్పిందే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా కుదరాలి. అప్పుడే సీన్స్ ఎలివేట్ అవుతాయి. ఆ పరంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. నిర్మాణపు విలువలు కూడా బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా స్టోరీ లైన్ భారతీయుడు చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. కొత్త నటీనటులతో మంచి స్టోరీతో సినిమా చేస్తే... పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని ఈ సినిమా బుజువు చేస్తుంది. ఫస్టాప్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఆసక్తిగా సాగుతుంది. కానీ సెకండాఫ్ లో అదే టెంపోని మెయింటెన్ చేయలేకపోవడం ఈ సినిమాకి మైనస్. సెకండాఫ్ ప్రేక్షకులను కొన్ని చోట్ల అసహనానికి గురి చేస్తుంది. అల్లూరి సీతారామరాజు పక్కింట్లో పుట్టాలి... నా ఇంట్లో అల్లు అర్జునే పుట్టాలని కోరుకుంటాను అనే డైలాగ్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఇలాంటి సినిమాలను ఆదరించడం వల్ల మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేశభక్తి, మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.


ఫైనల్ గా చెప్పాలంటే... అర్ధనారి ఇచ్చిన మెసేజ్ అదుర్స్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూస ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !