View

బ్రహ్మోత్సవం మూవీ రివ్య్వూ

Friday,May20th,2016, 09:47 AM

చిత్రం - బ్రహ్మోత్సవం
బ్యానర్స్ - పి.వి.పి సినిమా, యం.బి ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత, సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, ముకేష్ రుషి, శరణ్య, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ - రత్నవేలు
సంగీతం - మిక్కీ.జె.మేయర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సందీప్ గుణ్ణం
నిర్మాతలు - పెరల్ .వి.పొట్లూరి, పరమ్ .వి.పొట్లూరి, కవిన్ అన్నె
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీకాంత్ అడ్డాల


'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నుంచి వస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అంటూ ఓ సక్సెస్ ఫుల్ మల్టీస్టారర్ కి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' చిత్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఫేషన్ తో సినిమాలు నిర్మించే పివిపి సంస్థ అధినేత పొట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రానికి ఓ నిర్మాతగా మహేష్ బాబు కూడా వ్యవహరించారు. ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే సినిమా కలర్ ఫుల్ గా ఉంటుంది. అలాంటిది 'బ్రహ్మోత్సవం' లో ముగ్గురు హీరోయిన్లు నటించారు. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లు. భారీగా బిజినెస్ అయిన ఈ చిత్రం మహేష్ బాబుని 100కోట్ల క్లబ్ లో చేర్చుతుందనే అంచనాలు ఉన్పాయి. మరి ఆ అంచనాలను ఏ మేరకు ఈ చిత్రం అందుకుంటుందో వేచి చూద్దాం.


à°•à°¥
సింఫుల్ స్టోరీ లైన్ తో ఈ సినిమా సాగుతుంది. సత్యరాజ్ ది ఉమ్మడి కుటుంబం. నలుగురు బావమరుదులు (రావు రమేష్, షయాజీ షిండే, కృష్ణభగవాన్, నరేష్), వారి పెళ్లాలు (జయసుధ, తులసి, రజిత, ఈశ్వరీరావు) పిల్లలు (ప్రణీత) తన భార్య రేవతి, కొడుకు మహేష్ బాబుతో కలిసి సంతోషంగా ఉంటాడు సత్యరాజ్. వీరికి పెయింటింగ్ ఫ్యాక్టరీ ఉంటుంది. 400కోట్ల టర్న్ ఓవర్ తో రన్ అవుతున్న ఆ ఫ్యాక్టరీని కుటుంబమంతా కలిసి చూసుకుంటుంది. ఇందులో పెద్ద బావమరిది రావు రమేష్ కి తన బావ సత్యరాజ్ వల్లే తమ కుటుంబాలు నిలబడగలిగాయని ఊళ్లో వాళ్లందరూ అనుకోవడం అసలు నచ్చదు. దాంతో తన బావ దగ్గర్నుంచి విడిగా వెళ్లిపోవాలనే ఆలోచనతో ఉంటాడు. అయితే తమ కూతురు ప్రణీతను బావ కొడుకు మహేష్ బాబుకిచ్చి పెళ్లి చేస్తే ఆస్థి అంతా తమదవుతుందని భావించి పెళ్లి చేయాలనుకుంటాడు రావురమేష్. ఓ సిట్యువేషన్ లో మహేష్, కాజల్ అగర్వాల్ ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న రావు రమేష్ ఫ్యాక్టరీని అమ్మి తన భాగం తీసుకుని ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాలనుకుంటాడు.


అలాంటి సందర్భంలో ఇంట్లో జరిగిన గొడవతో రావు రమేష్ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. మనుషులు కావాలని, తన మనుషులు కలిసి ఉండాలని భావించే సత్యరాజ్ బావమరిది బయటికి వెళ్లిపోవడం భరించలేక చనిపోతాడు. మనుషులు కావాలి.. కుటుంబ విలువలు ముఖ్యం అని నమ్మిన తన నమ్మకాన్ని కొడుకు నిలబడతాడనే నమ్మకం తండ్రి చివరి మాటల్లో విన్న మహేష్ తన కుటుంబాన్ని కలపాలని భావిస్తాడు. తమ ఏడు తరాల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఫైనల్ గా ఏడు తరాల గురించి మహేష్ తెలుసుకుంటాడా... రావు రామేష్ తన బావ ఎంత మంచివాడో తెలుసుకుంటాడా... కుటుంబం అంతా కలిసి ఉండటం ఎంత ముఖ్యం అనే విషయం తెలుసుకుంటాడా అనేది ఈ చిత్ర కథ.

 

నటీనటుల పెర్ఫామెన్స్
ఉమ్మడి కుటుంబం విలువలను కాపాడాలని, తన తండ్రిలానే విలువలున్న వ్యక్తిగా బ్రతకాలనే పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. తండ్రి పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయారు. బావ అంటే అసూయతో రగిలిపోయే పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించారు. జయసుధ, తులసి, శరణ్య, నరేష్, షయాజీ షిండే.. ఇలా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ముగ్గురూ భాగున్నారు.

 

సాంకేతిక వర్గం
మన మూలాలను వెతికి పట్టుకోవడం అనే కాన్సెఫ్ట్ చాలా మంచి కాన్సెష్ట్. ఏడు తరాల వారి గురించి తెలుసుకోవడానికి హీరో ఆసక్తి కనబర్చడం బాగుంది. కుటుంబం విలువలు, ఉమ్మడి కుటుంబంలో ఉండే సరదాలను పుష్కలంగా చెప్పడానికి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పూర్తి ప్రయత్నం చేసారు. ఇలాంటి విలువలతో కూడుకున్న సినిమాలు చేయాలనే శ్రీకాంత్ అడ్డాల ఆలోచనను అభినందించాల్సిందే. అయితే స్ర్కీన్ ప్లే విషయంలో మాత్రం శ్రీకాంత్ అడ్డాల పట్టుతప్పారని చెప్పక తప్పదు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. కనులపండుగగా సినిమా ఉంది. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఒకే. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ నిర్మాత. ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా టైటిల్ కి తగ్గట్టు ఓ పండుగలా సినిమాని తెరకెక్కించడానికి నిర్మాత ఖర్చు పెట్టిన విధానం తెరపై కనిపిస్తోంది. అబిరుచిగల నిర్మాత అని పివిపి అధినేత పొట్లూరి వరప్రసాద్ మరోపారి నిరూపించుకున్నారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఏడు తరాల తమ బంధువుల గురించి తెలుసుకోవాలనే కాన్సెఫ్ట్ చాలా బాగుంది. అయితే ఇలాంటి కాన్సెష్ట్ ను పర్ ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినప్పుడే ప్రేక్షకుల హృదయాలను ఇలువంటి సినిమాలు తాకుతాయి. ఆ పరంగా శ్రీకాంత్ అడ్డాల కృషి చేయలేకపోయారు. స్ర్కీప్ ప్లే విషయంలో పట్టు తప్పడం వల్ల అక్కడక్కడ కొన్ని సీన్లు బోరు కొట్టాయి. ముఖ్యంగా ఏడుతరాల బంధువుల గురించి తెలుసుకోవడానికి బయలుదేరిన హీరో, ఓ టూర్ కి వెళ్లినట్టు ఉంటుందే తప్ప.. తన మూలాలను తెలుసుకునే ప్రయత్నంలో సాగే సెంటిమెంట్ సీన్స్ సరిగ్గా వర్కవుట్ చేయలేకపోవడం నిరాశకు గురి చేస్తుంది. ఒక్క శరణ్య కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు మాత్రమే ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది, మిగతా వెతుకులాట అంతా ఓ టూర్ సాగినట్టుగా ఉంటుంది. దాంతో కథ డైవర్షన్ తీసుకున్న ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. ఇది ఈ సినిమాకి మైనస్ పాయింట్. సత్యరాజ్, మహేష్ బాబు మధ్య వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాకి ఆయువుపట్టులాంటిది. ఈ ఎపిసోడ్ లో సత్యరాజ్, మహేష్ బాబు అద్భుతంగా నటించారు. క్లయిమ్యాక్స్ లో రావు రమేష్, మహేష్ బాబు మధ్య సాగే సీన్ బాగుంది. సినిమా ఆరంభం నుంచి పెళ్లి, ఆ తర్వాత బ్రహ్మోత్సవం సెలబ్రేషన్స్ తో ఓ పండుగలా సాగుతుంది. ఈ సీన్స్ ని, సినిమా రిచ్ నెస్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రానికి భిన్నంగా ఉంటుంది. ఫైట్స్, పాటలు కూడా అలానే ఉంటాయి. సెకండాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆసహనానికి గురి చేస్తాయి. కాకపోతే ఈ సినిమాలో ఎక్కడా అసభ్యకరమైన సీన్ గానీ, డైలాగ్ గానీ ఉండదు. కుటుంబంతో కలిసి సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు.


ఫైనల్ గా చెప్పాలంటే... ఇది కుటుంబ విలువలను చాటి చెప్పే ఓ కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సో... ఈ బ్రహ్మోత్సవం ని కుటుంబంతో కలిసి చూడండి.. ఎంజాయ్ చూడండి.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !