filmybuzz
filmybuzz

View

బీటెక్ బాబులు మూవీ రివ్య్వూ

Friday,December08th,2017, 12:03 PM

చిత్రం - బీటెక్ బాబులు
బ్యానర్ - జేపీ క్రియేషన్స్
నటీనటులు - నందు, శ్రీముఖి, రోషిణి, అ
శ్విని తదితరులు
సంగీతం - అజయ్ పట్నాయక్
నిర్మాత - ధన జమ్ము
దర్శకత్వం - శ్రీను ఇమండి
విడుదల తేదీ - 8 డిసెంబర్, 2017


నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్ పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం బీటెక్ బాబులు. శ్రీను ఇమండి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం ఈ రోజు (8.12.2017) విడుదలయ్యింది. బీటెక్ బాబులు అనే యూత్ ఫుల్ టైటిల్ తో పాటు నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జీవితాల్లో జరిగిన సంఘటనలతో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి అందరినీ మెప్పించే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధుల జీవితాల్లో జరిగిన సంఘటనల ప్రధానాశంగా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. ఈ నలుగురు స్టూడెంట్స్ జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి... ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా వీరు విజయం సాధించారు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
నందు, శ్రీముఖి జంట చాలా బాగుంది. ఈ ఇద్దరి లవ్ ట్రాక్ యూత్ ని ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య చక్కటి కెమిస్ట్రీ కుదిరింది. వీరి ఫ్యాష్ బ్యాక్ లోని సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన కుర్రాళ్లు, వారి లవర్స్ కూడా బాగానే నటించారు. ముఖ్యంగా ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన షకలక శంకర్ పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ సూపర్బ్. అలీ పాత్రతో చేయించిన స్పూఫ్ లు నవ్విస్తాయి. అలీ పాత్ర నిడివి తక్కువైనప్పటికీ, ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తుంది. వైవా హ‌ర్ష‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాఘ‌వ‌, ప‌టాస్ ప్ర‌కాశ్, నోవ‌ల్ కిషోర్, రాణి, ఖుష్బు, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో మెప్పించారు.


సాంకేతిక వర్గం
స్టోరీ లైన్ పాతదే. స్ర్కీన్ ప్లే పరంగా డైరెక్టర్ మరి కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చిన డైరెక్టర్ ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. నలుగురు ఫ్రెండ్స్ కలుసుకోవడం బాగుంది. కానీ వారి అలవాట్లు, ఎదుర్కొనే ఇబ్బందులను డైరెక్టర్ ఇంప్రసివ్ గా చూపింలేకపోవడం నిరాశను కలిగిస్తుంది. చాలా సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. తాగుబోతు రమేష్ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకోలేదు. పాటలు వినసొంపుగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. దాంతో విజువల్ గా సినిమా ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి తక్కువ కావడం ఓ ప్లస్ పాయింట్. కథకు సరిపడా బడ్జెట్ తో సినిమాని నిర్మించడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
యూత్ కి మంచి మెసేజ్ ఇవ్వడం బాగుంది. కెరీర్ ని యూత్ చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉండాలనే పాయింట్ ని డైరెక్టర్ బాగా డీల్ చేసాడు. నటీనటులందరూ చక్కగా పెర్ ఫామ్ చేసారు.
ఫైనల్ గా చెప్పాలంటే... బీటెక్ బాబులు యూత్ ని ఆకట్టుకుంటారు.


ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !