View

Jil movie review

Friday,March27th,2015, 09:19 AM

చిత్రం - జిల్
బ్యానర్ - యు.వి.క్రియేషన్స్
నటీనటులు - గోపీచంద్, రాశిఖన్నా, హరీష్ ఉత్తమన్, సుప్రీత్, కబీర్, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, ఊర్వశి, అమిత్, ఫణికాంత్, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ అవసరాల, భరత్, కల్పలత, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, మౌనిక తదితరులు
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం - జిబ్రాన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - శక్తి శరవణన్
ఫైట్స్ - అనిల్ అరసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్
ప్రొడ్యూసర్స్ - వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్

గోపీచంద్ మంచి మాస్ హీరో. మాస్ కథ చుట్టూ.. కుటుంబ ప్రేక్షకులకు కూడా కావల్సిన అంశాలు అల్లుకుని సినిమా తీస్తే, బంపర్ హిట్ ఖాయం. అందుకు ఓ నిదర్శనం 'లౌక్యం'. ఇలాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత గోపీచంద్, 'మిర్చి'వంటి సూపర్ హిట్ అందించిన యువి క్రియేషన్స్ సంస్థ కాంబినేషన్లో వచ్చే చిత్రం అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అలాంటి అంచనాల నడుమ విడుదలైన చిత్రం 'జిల్'. మరి..ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

à°•à°¥
ముంబయ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) దగ్గర 1000కోట్లు కొట్టేసి, అతని గురించి పోలీసులకు ఇన్ ఫర్ మేషన్ ఇచ్చి హైదరాబాద్ పారిపోయి వస్తాడు ఛోటా నాయక్ ఫ్రెండ్ రఘునాధ్ (బ్రహ్మాజీ). పోలీసులు ఛోటా నాయక్ ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చడానికి తీసుకెళుతున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. తన గురించి పోలీసులకు ఇన్ ఫర్ మేషన్ ఇచ్చి, తన డబ్బు కొట్టేసిన రఘునాధ్ ను వేటాడం మొదలుపెడతాడు ఛోటా నాయక్.
జై (గోపీచంద్) ఫైర్ ఆఫీసర్. అతనికి తల్లిదండ్రులు ఉండరు. పిన్ని (ఊర్వశి), బాబాయ్ (చలపతిరావు)కు జై అంటే చాలా ఇష్టం. కన్నకొడుకులా చూసుకుంటారు. సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన సావిత్రి (రాశిఖన్నా)ని ఫైర్ ఆఫీసర్ హోదాలో కాపాడతాడు జై. తొలి చూపులోనే జై, సావిత్రి ప్రేమలో పడతారు. ఓ సందర్భంలో రఘునాధన్ ని ఛోటా నాయక్ మనుషుల నుంచి కాపాడతాడు జై. దాంతో ఛోటా నాయక్, అతని మనుషులు రఘునాధ్ కి జై సహాయం చేస్తున్నాడని అపోహపడతారు. ఓ బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే జై అక్కడకు వెళతాడు. అక్కడ రఘునాధన్ ని కాపాడతాడు. జై దగ్గర బాగా కాలిపోయిన రఘునాధన్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఏమీ చెప్పలేడు. రఘునాధన్ చనిపోతాడు. ఇది టి.విలో చూసిన ఛోటానాయక్, అతని మనుషులు జై దగ్గర రఘునాధన్ ఆ 1000కోట్లు గురించి చెప్పాడని ఆపోహపడి జై ని టార్గెట్ చేస్తారు. 1000కోట్లు గురించి చెప్పమని జై ని ఛోటా నాయక్ మనుషులు అడుగుతుంటారు. జై ని బెదిరించడం కోసం అతని ఫ్రెండ్ ని, బాబాయ్ ని చంపేస్తారు. రఘునాధన్ తన దగ్గర ఏం చెప్పలేదని ఛోటా నాయక్ దగ్గర జై చెప్పినప్పటికీ వినడు. మరి తనకు సంబంధంలేని విషయంలో ఇరుక్కున్న జై ఏం చేస్తాడు? ఆ 1000కోట్ల గురించి తెలుసుకుంటాడా. తన పిన్ని, చెల్లెల్ని, ప్రియురాలు సావిత్రిని ఛోటా నాయక్ నుంచి ఎలా కాపాడుకుంటాడు అనేదే ఈ సినిమా క్లయిమ్యాక్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రం కోసం గోపీచంద్ తన ఫిజిక్ ని మార్చుకున్నాడు. చక్కగా స్లిమ్ గా తయారయ్యాడు. ఒక ఫైర్ ఆఫీసర్ ఎలా ఉండాలో అచ్చంగా అలా మౌల్డ్ అయ్యాడు. ఫైట్స్ బాగా చేస్తాడని తన గత చిత్రాలు నిరూపించాయి. ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఇందులో డాన్సులు కూడా బాగా చేశాడు. తను చేసిన ఐదారు స్టెప్పులు స్టయిలిష్ గా ఉన్నాయి. రాశీ ఖన్నా గొప్ప అందగత్తె అనలేం. అభినయం విషయంలో కూడా గ్రేట్ అనలేం. చక్కగా ఉంది. నటన పరంగా ఓకే అనిపించుకుంది పాటల్లో హీరోయిన్ కన్నా సైడ్ డాన్సర్స్ కే ఎక్కువ స్టెప్పులు ఉంటాయి. దాంతో హీరోయిన్ కి డాన్స్ రాదేమో అనే ఫీల్ కలగక మానదు. పోలీసాఫీసర్ కారెక్టర్ చేసిన హరీష్ ఉత్తమన్ చాలా బాగున్నాడు. పోలీసాఫీసర్ గా చక్కని బాడీ లాంగ్వేజ్ కనబర్చాడు. ఛోటా నాయక్ పాత్ర చేసిన విలన్ పాత్రధారి కబీర్ బాగున్నాడు. ఒక ఫ్రెష్ విలన్ ని చూసిన ఫీల్ కలిగింది. చలపతిరావు, ఊర్వశి, పోసాని, బ్రహ్మాజీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
దర్శకుడు రాధా కృష్ణ కుమార్ కి ఇది తొలి చిత్రం. తను ఎన్నుకున్న కథ బాగుంది. టేకింగ్ పరంగా ఓకే అనిపించుకున్నాడు. కథలో తప్పులు దొర్లకుండా చూసుకుంటే, దర్శకునిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏ సినిమాకైనా పాటలే ఆయువుపట్టు కాబట్టి, సంగీతదర్శకుడు మంచి ట్యూన్స్ ఇవ్వాలి. కానీ, సంగీతదర్శకుడు జిబ్రాన్ ఈ సినిమాకి న్యాయం చేయలేదనిపిస్తోంది. పాటలన్నీ శబ్ద హోరుతో సాగడంతో పాటు హిందీ, ఇంగ్లిష్ పదాలు ఎక్కువ వినిపించడం మింగుడుపడదు. ఓవరాల్ గా పాటలు చెప్పుకోదగ్గ విధంగా లేవు. 'స్వింగ్ స్వింగ్..' పాట కొంతమేరకు కనెక్ట్ అవుతుంది. కథానుసారం శక్తి శరవణన్ తన కెమెరా పనితనం చూపించి, భేష్ అనిపించుకున్నాడు. వర్షం నేపథ్యంలో వచ్చే ఫైట్ లో అతని కెమెరా మెరిసింది. ఇతర శాఖల గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
మన తెలుగు సినిమాల్లో ఫైర్ ఆఫీసర్ పాత్రలు చాలా చాలా అరుదు. ఈ సినిమాలో ఉన్న కొత్తదనం హీరోని ఫైర్ ఆఫీసర్ గా చూపించడం. గోపీచంద్ మంచి ఎత్తు, ఫిజిక్ బాగుంది కాబట్టి, ఈ కారెక్టర్ కి బాగా నప్పాడు. సినిమా మొత్తం తన భుజాల మీదే నడుస్తుంది. అందుకు పూర్తి న్యాయం చేశాడు. రాశీ ఖన్నాని కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో చూపించడం ఓ కనువిందు. వెయ్యి కోట్ల కోసం విలన్ హీరో పాత్రను వెంటాడతాడు. కరుడు గట్టిన మాఫియా లీడర్, అతని నుంచి తప్పించుకోలేమని తెలిసి కూడా అతని దగ్గర్నుంచి 1000కోట్లు తీసుకుని అతని ఫ్రెండ్ పారిపోతాడు? సామాన్య ప్రజలే కాదు.. పోలీసులకు కూడా చుక్కలు చూపించే ఛోటా నాయక్ నుంచి అతి సులువుగా వేరే వ్యక్తి వెయ్యి కోట్లు కొట్టేయడం అనే పాయింట్ లాజిక్ కి అందదు. కథకు కీలకమైన ఈ పాయింట్ ని బలంగా చూపించి ఉంటే, సినిమా బాగా ఎలివేట్ అయ్యుండేది.. దర్శకుడు ఆ విషయంలో కేర్ తీసుకోలేదు. హీరో ఫైర్ ఆఫీసర్ కాబట్టి, ఎప్పుడూ నిప్పుతో చెలగాటమాడతాడు కాబట్టి, టీ కూడా చల్లగా తాగడం అతనికిష్టం. ఈ సీన్ పెట్టడం ద్వారా 'జిల్' అని ఎందుకు టైటిల్ పెట్టారో కన్వే చేశారు. అంతకు మించి ఈ టైటిల్ కి కథలో పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. ఈ చిత్రానికి పాటలు చాలా మైనస్ అయ్యాయి. జిబ్రాన్ స్వరపరచిన పాటలు విని, మరో తమన్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సెకండాఫ్ లో ఓ పాట లేకపోయినా బాగుండేదనే ఫీల్ కలగక మానదు.

ఫైనల్ గా చెప్పాలంటే.. కమర్షియల్ ఫార్మట్ లో సాగే మాస్ మసాలా మూవీ ఇది. ఈ తరహా చిత్రాలను ఇష్టపడేవారి సంఖ్య ఎక్కువే ఉంది కాబట్టి.. 'జిల్' బాక్సాఫీస్ ని గెల్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్లు కూడా రొటీన్ సినిమాకి ఏం వెళతాంలే అనుకుంటే.. అప్పుడు 'జిల్' కలక్షన్స్ 'నిల్' అని చెప్పక తప్పదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !