View

ఇజం మూవీ రివ్య్వూ

Friday,October21st,2016, 09:33 AM

చిత్రం - ఇజం
నటీనటులు - నందమూరి కళ్యాణ్ రామ్, ఆదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, అలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, శ్రీకాంత్, కోటేష్ మాధవ, నయన్ (ముంబై), రవి (ముంబై) తదితరులు
సంగీతం - అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ - ముఖేష్
ఎడిటింగ్ జునైద్
నిర్మాత - నందమూరి కళ్యాణ్ రామ్
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - పూరి జగన్నాధ్


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇజం'. ఈ చిత్రంలోని కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే. కళ్యాణ్ రామ్ మేకోవర్ అయిన విధానం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. పనామా లీక్స్ అంశాన్ని ఇన్సిఫిరేషన్ గా తీసుకుని ఓ జర్నలిస్ట్ తన బాధ్యతను భయం లేకుండా నిర్వర్తిస్తే సమాజానికి ఎంత ఉపయోగం అనే పాయింట్ తో 'ఇజం' చిత్రాన్ని చేసారు పూరి. చిన్న పాయింట్ ని అయినా పవర్ ఫుల్ గా తెరపై ఆవిష్కరించగల సత్తా ఉన్న పూరి జగన్నాధ్, పవర్ ఫుల్ పాయింట్ తో 'ఇజం' స్టోరీ లైన్ ని అల్లారు కాబట్టి ఖచ్చితంగా దుమ్ము దులిపేసి ఉంటారనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం టీజర్ కి కూడా భారీ స్పందన లభించింది. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
సిన్సియర్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ 'ఇజం'. టెర్రిఫైన్ ఐల్యాండ్ లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటాడు ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జావెద్ భాయ్ (జగపతిబాబు). అతని కూతురు అలియా ఖాన్ (అదితి ఆర్య) ని తన ప్రేమలో పడేట్టు చేసుకుంటాడు సత్య మార్తాండా (కళ్యాణ్ రామ్). మరోవైపు జావెద్ భాయ్ ని తన ఫ్రెండ్ అయ్యేలా చేసుకుంటాడు. అలియా ఖాన్ కి తన తండ్రి జావెద్ భాయ్ తో సత్య మార్తాండ్ కి ఫ్రెండ్ షిప్ ఉందనే విషయం తెలియదు. అలాగే జావెద్ భాయ్ కి కూడా అలియాకి సత్య తెలుసన్న విషయం తెలియదు.


జావెద్ భాయ్ బోల్డన్ని ఇల్లీగల్ బిజినెస్ లు చేస్తుంటాడు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైస్ అనే సొంత బ్యాంక్ ని ఏర్పాటు చేసుకుని పొలిటీషియన్స్ డబ్బులను మెయింటెన్ చేస్తుంటాడు. ఆ బ్యాంక్ లో దాచిన రాజకీయనాయకుల డబ్బుతో దేశంలోని పేదలందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వొచ్చు. అంత డబ్బుని దోచుకుని దాచేస్తుంటారు రాజకీయనాయకులు. అలా దోచుకుని దాచేస్తున్నవారి లిస్ట్ ను బయటపెట్టాలనే టార్గెట్ తో ఉంటాడు సత్య.


తన కూతురు ప్రేమించిన అబ్బాయి, తనతో ఫ్రెండ్ షిప్ చేసిన అబ్బాయి ఒకే వ్యక్తి అని తెలుసుకుని షాక్ అవుతాడు జావెద్. సత్య మార్తాండ్ ని తన గ్యాంగ్ తో కలిసి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు సత్య ఇండియా వచ్చేస్తాడు. జావెద్ గురించిన విషయాలను బయట పెట్టేస్తాడు. అప్పుడు అతను ఓ జర్నలిస్ట్ అని, తన ఆధ్వర్యంలో నడుస్తున్న బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ అకౌంట్స్ ని హ్యాక్ చేయడానికి కావాల్సిన తన ల్యాప్ టాప్ ని సత్య తీసుకెళ్లిపోయాడని తెలుసుకుని షాక్ అవుతాడు జావెద్.


అసలు అలియాని సత్య ఎందుకు ట్రాప్ చేసాడు... తన రహస్యాలను బయటపెట్టిన సత్య మార్తాండ్ కోసం జావెద్ ఇండియా వస్తాడా... సత్య జర్నలిజం చేయడం వెనుక కారణం ఏంటీ... సత్య మార్తాండ్ అసలు టార్గెట్ ఏంటీ.. ఫైనల్ గా తను అనుకున్నది సత్య సాధించగలిగాడా అనేదే ఈ చిత్రం సెకండాఫ్.


నటీనటుల పెర్ ఫామెన్స్
ఇజం చిత్రం కోసం కళ్యాణ్ రామ్ మేకోవర్ అయిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. లుక్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. కొత్త కళ్యాణ్ రామ్ ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కళ్యాణ్ రామ్ ని కొత్త అవతారంలో చూపించిన పూరిని అభినందించాల్సిందే. అదితిఆర్య గ్లామరస్ గా ఉంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జావెద్ భాయ్ గా నటించాడు జగపతిబాబు. లుక్ పరంగా జగపతిబాబు బాగున్నాడు. కానీ 'లెజెండ్' లో పవర్ ఫుల్ విలన్ గా జగపతిబాబు చేసిన పాత్రని ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాలోని జగపతిబాబు పాత్ర అంత పవర్ ఫుల్ గా ఈ ఉండదు. మిగతా నటీనటులందరూ ఎవరి పాత్రల పరిధిమేరకు వారు నటించారు.


సాంకేతిక వర్గం
ఓ మంచి మెసేజ్ ఇవ్వగల స్టోరీ లైన్ ని తీసుకున్నాడు పూరి. దానికి తగ్గట్టు హీరో క్యారెక్టరైజేషన్ ని జర్నలిస్ట్ గా, విలన్ క్యారెక్టరైజేషన్ ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా తీర్చిదిద్దాడు. ఈ పవర్ ఫుల్ పాత్రలతో పూరి స్టైల్లో మ్యాజిక్ చేయగల కెపాసిటీ ఉన్నప్పటికీ, సరైన సీన్స్ పడకపోవడం నిరాశపరుస్తుంది. సినిమాలో ఒక్క కోర్టు సీన్ మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. పాటలు అంత ఇంప్రసివ్ గా లేవు. బ్యాక్ గ్రాండ్ స్కోర్ ఫర్వాలేదు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
నటులను మేకోవర్ చేసినంతగా సబ్జెక్ట్ మీద కాన్ సెన్ ట్రేట్ చేయడం పూరి జగన్నాధ్ మానేసాడేమో అని సినిమా చూసిన అడియన్స్ అనుకోకుండా ఉండరు. 'టెంపర్' చిత్రంలో పోలీసీఫీర్ గా అవినీతిపై పోరాటం జరుపుతాడు ఎన్టీఆర్, ఈ సినిమాలో ఓ జర్నలిస్ట్ గా అవినీతి పై పోరాటం జరుపుతాడు కళ్యాణ్ రామ్. సేమ్ ఫార్ములా అయినప్పటికీ టెంపర్ లో కొన్ని ఎమోషన్ సీన్స్, కోర్టు సీన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. కానీ 'ఇజం'లో ఎమోషన్ లేదు. లాజిక్ లేదు, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బైక్ చేజింగ్ అంత కిక్ ఇవ్వదు. క్లయిమ్యాక్స్ లో కోర్టు సీన్ తప్ప... హీరో, విలన్ మీట్ అయ్యే సీన్ చాలా సాదాసీదాగా ఉంటుంది. ప్రపంచాన్నే గడగడలాడించే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అతనిని రోడ్డుకు లాక్కొచ్చిన హీరో ఎదురుపడితే ఎంత బలంగా సీన్స్ ఉండాలో, అంత బలంగా సీన్స్ లేకపోవడంతో క్లయిమ్యాక్స్ చప్పగా ఉంటుంది. పూరి సినిమాలో పంచ్ డైలాగులు, కడుపుబ్బా కామెడీ ట్రాక్ ని ఆడియన్స్ ఎక్స్ ఫెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో అవి లేవు. మోటివేట్ చేయగల మెసేజ్ తో స్టోరీని తీర్చిదిద్దిన పూరి లాజక్ ని మిస్ చేయకుండా బలమైన సీన్స్ తో ఈ సినిమాని తెరకెక్కించి ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ప్రశంసలు అందుకునేది. స్టైలిష్ గా సినిమాని తెరకెక్కించిన పూరి సీన్స్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. పవర్ ఫుల్ స్టోరీని సిల్లీగా తెరకెక్కించడం నిరాశపరుస్తుంది. 


ఫైనల్ గా చెప్పాలంటే... కోర్టు సీన్ మినహా, ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !