filmybuzz
filmybuzz

View

జనతాగ్యారేజ్ మూవీ రివ్య్వూ

Thursday,September01st,2016, 07:21 AM

చిత్రం - జనతాగ్యారేజ్
నటీనటులు - ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, ఉన్ని ముకుందన్, సాయికుమార్, అజయ్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, దేవయాని, సితార, సురేష్ తదితరులు
బ్యానర్ - మైత్రి మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ - తిరు
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి
నిర్మాతలు - నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్
రచన, దర్శకత్వం - కొరటాల శివ
విడుదల తేదీ - 1.9.2016


'టెంపర్', 'నాన్నకు ప్రేమతో' అంటూ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున విజృంభిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ 'జనతాగ్యారేజ్'. 'మిర్చి'. 'శ్రీమంతుడు' లాంటి హిట్ చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ 'శ్రీమంతుడు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. రెండో చిత్రం 'జనతాగ్యారేజ్' తో కూడా భారీ విజయాన్ని అందుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. హిట్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
జనతాగ్యారేజ్ అనే ఆటో మొబైల్ వర్క్ షాప్ నెలకొల్పి తన గ్యారేజ్ కి వచ్చిన బండ్లను రిపేర్ చేయడంతో పాటు, తన సహాయం కోరి వచ్చిన వారికి అండగా నిలబడతాడు సత్యం (మోహన్ లాల్). ఇదంతా తన ఫ్రెండ్స్ సహాయంతో చేస్తాడు. అయితే స్యతంపై కక్ష కట్టిన ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కో్ల్పోతాడు. దాంతో సత్యం తమ్ముడు కొడుకు ఆనంద్ (ఎన్టీఆర్) అతని మేనమామ ఇంట్లో పెరుగుతాడు.


ఆనంద్ కి చిన్నప్పట్నుంచి మొక్కలంటే ఇష్టం. ప్రేమగా వాటిని పెంచుకుంటూ అవే తన ప్రపంచం అని జీవిస్తుంటాడు. ఓ సిట్యువేషన్ లో సత్యం గ్యారేజ్ కి ఆనంద్ వెళతాడు. ఆనంద్ గ్యారేజీలోకి ఎంట్రీ అయిన తర్వాత జనతాగ్యారేజ్ ఎలా మారింది... సత్యం తన పెదనాన అన్న విషయం ఆనంద్ కి తెలుస్తుందా... తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగలడు. ఫుల్ ఎనర్జిటిక్ గా చెలరేగిపోగలడు. ఈ సినిమాలో కూడా ఆనంద్ గా విజృంభించేసాడు. స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ కావడంతో ఎన్టీఆర్ ఎక్కడా తగ్గలేదు. స్టైలిష్ లుక్, బాడీ లాంగ్వేజ్ సూపర్బ్. డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. సత్యం గా మోహన్ లాల్ అభినయం సూపర్బ్. మరోసారి తన సత్తా చాటుకున్నారు.


సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించారు. స్కోప్ ఉన్న మేరకు నటించారు తప్ప.. వారి పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.


కాజల్ అగర్వాల్ ఐటమ్ పాట చేసింది. 'చికిని చమేలీ....' పాట కోసం కత్రినా కైఫ్ చేసిన మూమెంట్ప్, బాడీ లాంగ్వేజ్ గుర్తుకు వస్తాయి.
సాయికుమార్, ఉన్నిముకుందన్, సచిన్ ఖేడ్కర్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, బెనర్జీ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ అందించిన తిరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజువల్స్ చాలా బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. కానీ రీ-రికార్డింగ్ పరంగా మాత్రం దేవి నిరాశపరిచాడు. రీ-రికార్డింగ్ పరంగా వెలితిగా అనిపిస్తుంది. నిర్మాణపు విలువలు పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ సినిమాకి పెట్టాల్సినంత ఖర్చు పెట్టలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కాంప్రమైజ్ అవ్వడం వల్ల రిచ్ విజువల్స్ ని మిస్ అయ్యామనే ఫీలింగ్ కలగకమానదు. కొరటాల శివ తీసుకున్న స్టోరీ లైన్ బాగున్నప్పటికీ, స్ర్కీన్ ప్లే పరంగా చేసిన మిస్టేక్స్ సినిమాని టాన్ లెవెల్లో నిలబెట్టలేకపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ కి కొన్ని రిపేర్లు చేసి ఉంటే అంచనాలను చేరుకునే విధంగా సినిమా ఉండేది. సెకండాఫ్ స్లోగా సాగిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ పరంగా కొరటాల శివ తనలోని రైటర్ కి మరింతగా పదునుపెట్టి ఎన్టీఆర్ కోసం డైలాగులు రాసినట్టు అనిపిస్తుంది.


ప్లస్ సాయింట్స్
ఎన్టీఆర్, మోహన్ లాల్, డైలాగ్స్, ఎన్టీఆర్ డ్యాన్సులు
మైనస్ పాయింట్స్
స్ర్కీన్ ప్లే, డైరెక్షన్, కామెడీ, సెకండాఫ్ సాగతీత


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్ ఎన్టీఆర్, మోహన్ లాల్. స్టోరీ లైన్ బాగుంది. కానీ స్ర్కీన్ ప్లే పరంగా మాత్రం కొరటాల శివ ఫెయిల్ అవ్వడం నిరాశపరుస్తుంది. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే చేయలేకపోయారు. సెకండాఫ్ సీన్స్ బలంగా లేవు. కొరటాల శివ తనదైన స్టైల్లో ఓ మంచి మెసేజ్ ఇస్తూనే, ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అభిమానులను శాటిస్ ఫై చేసే విధంగా సినిమా చేయడానికి ట్రై చేసాడు. ఇక్కడే దెబ్బపడింది. మంచి మెసేజ్ అయితే చెప్పాడుగానీ, సెకండాఫ్ లో తడిబడిపోయాడు. మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ, గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే చేయలేకపోయాడు. ముఖ్యంగా సెకండాఫ్ ఈ సినిమాకి చాలా మైనస్. సెకండాఫ్ లో ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని, రొటీన్ సినిమాలకు అలినట్టు సీన్స్ అల్లాడు. ఫైట్స్, సాంగ్స్ పైన దృష్టి పెట్టి స్ర్కీన్ ప్లే పరంగా తప్పటడుగు వేసాడు కొరటాల శివ. అందుకే మంచి మెసేజ్ చెప్పాలన్న కొరటాల శివ ఆశయం ఈ సినిమా ద్వారా నెరవేరలేదు. ఎలాంటి మేసేజ్ లు లేకపోయినా, ఎన్టీఆర్ ఎమోషన్స్ తో హై యాక్షన్ మూవీ చేసి ఉంటే ఓ బ్లాక్ బస్టర్ సినిమా అయినా ఇవ్వగలిగేవాడు. అదీ చేయలేకపోయాడు. మెసేజ్, కమర్షియల్ ఫార్ములా బ్లెడింగ్ సరిగ్గా జరగలేదు. అందుకే 'జనతగ్యారేజ్' అంచనాలను చేరుకోలేకపోయింది. ఆడియన్స్ ని నిరాశపరుస్తోంది. అబిమానంతో చూసేవారికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ రెగ్యులర్ ఆడియన్స్ ని మాత్రం ఈ సినిమా నిరాశపరుస్తుంది. ఎన్టీఆర్, కొరటాల శివ నుంచి వచ్చిన సినిమా ఇంత పేలవంగా ఉండటం ఎవ్వరూ భరించలేరు, ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు.


ఫైనల్ గా చెప్పాలంటే...
పుష్కరకాలం తర్వాత ఓ మంచి హిట్ ని అందుకోబోతున్నానని 'జనతాగ్యారేజ్' ఆడియో వేడుకలో చెప్పాడు ఎన్టీఆర్. 'ఆది', 'సింహాద్రి' అంతటి హిట్ ని అందుకోబోతున్నానని ఎన్టీఆర్ చెప్పకనే చెప్పాడు. కానీ అది 'జనతాగ్యారేజ్' తో నెరవేరే అవకాశంలేదు. ఇక కమర్షియల్ గా సినిమా ఎలా ఉంటుంది, ఎన్ని కోట్ల క్లబ్ లో చేరుతుందనేది బి, సి సెంటర్స్ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యేదాన్నిబట్టి ఉంటుంది. ఓ రెండు రోజలు ఆగితే ఈ సినిమా ఎన్ని కోట్ల క్లబ్ లో చేరుతుందనే విషయంలో ఓ అంచనాకు రావచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !