filmybuzz

View

జ్యో అచ్చుతానంద మూవీ రివ్య్వూ

Friday,September09th,2016, 11:31 AM

చిత్రం - జ్యో అచ్చుతానంద
బ్యానర్ - వారాహిచలన చిత్రం
నటీనటులు - నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా, పావని గంగిరెడ్డి తదితరులు
సంగీతం - కల్యాణ్ రమణ
నిర్మాణ సారధ్యం - సాయి కొర్రపాటి
సమర్పణ - సాయి శివాని
నిర్మాత - రజనీ కొర్రపాటి
రచన, దర్శకత్వం - శ్రీనివాస్ అవసరాల


ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, తుంగభద్ర మనమంతా వంటి హిట్ చిత్రాలను నిర్మించిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి 'బాహుబలి', 'రుద్రమదేవి', 'రాజుగారి గది', 'జత కలిసే' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను కూడా పంపిణీ చేసారు. వారాహి ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా అడుగుపెట్టింది. తను నిర్మించిన సినిమాలను ఓవర్ సీస్ లో సొంతంగా పంపిణీ చేస్తున్నారు సాయి కొర్రపాటి. ఆయన ఓ సినిమాని నిర్మించినా, పంపిణీ చేసినా ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్ తొలి సినిమాతోనే ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించగలడనే నమ్మకాన్ని కలిగించాడు. తాజాగా నారా రోహిత్, నాగశౌర్య లతో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం 'జ్యో అచ్చుతానంద'. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
అచ్చుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగశౌర్య) ఇద్దరూ మధ్య తరగతికి చెందిన అన్నదమ్ములు. ఇద్దరూ సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న సమయంలో వారి ఇంట్లో జ్యోత్స్న (రెజీనా) అద్దెకు దిగుతుంది. అచ్చుత్, ఆనంద్ ఇద్దరూ జ్యోత్స్నని ప్రేమిస్తారు. అయితే తాను మరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పి ఈ అన్నదమ్ముల ప్రేమను తిరస్కరిస్తుంది. ఆ తర్వాత అచ్చుత్, ఆనంద్ ల మధ్య ఏర్పడిన మనస్ఫర్ధలు ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది. ఇద్దరి పెళ్లిళ్లు అయిపోతాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ ఇద్దరి జీవితాల్లోకి జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. దాంతో కథ మలుపు తిరుగుతుంది. మరొక వ్యక్తిని ప్రేమించిన జ్యోత్స్న మళ్లీ అచ్చుత్, ఆనంద్ ల జీవితాల్లోకి ఎందుకు వచ్చింది... ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
అచ్చుత్ పాత్రకు నారా రోహిత్ పక్కాగా సూట్ అయ్యాడు. ఆ పాత్రలోతను ఒదిగిపోయిన విధానం సూపర్. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి కృషి చేసాడు రోహిత్. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు. నాగశౌర్య ఎప్పటిలానే చక్కటి నటన కనబర్చి శభాష్ అనిపించుకున్నాడు. ఈ పాత్రలకు ఈ ఇద్దరినీ సెలెక్ట్ చేసుకోవడం సినిమాకి చాలా ప్లస్.


రెజీనా మరోసారి తనలో మంచి నటి ఉందని నిరూపించుకుంది. రెజీనాది నటనకు స్కోప్ ఉన్న పాత్ర. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కథ. చక్కటి కథ తీసుకుని ఈ సినిమా చేసాడు అవసరాల శ్రీనివాస్. దానికి తగ్గట్టు స్ర్కీన్ ప్లే కూడా బాగుంది. సీన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. క్లయిమ్యాక్స్ సూపర్. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ గా సినిమా రిచ్ గా ఉంది. కల్యాణ్ రమణ అందించిన పాటలు బాగున్నాయి. సెకండాఫ్ లో ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు సాయి కొర్రపాటి. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ చేయడమే తన టార్గెట్ అని మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నారు.


ప్లస్ పాయింట్స్
నారా రోహిత్, నాగశౌర్య, సెంటిమెంట్, వన్ లైనర్స్, సినిమాటోగ్రఫీ, సంగీతం


మైనస్ పాయింట్స్
కమర్షియల్ ఎలిమెంట్స్, ఎడిటింగ్


ఫిల్మీబజ్ విశ్లేషణ
కథకు సరిపడా నటీనటులను ఎంపిక చేయడంలోనే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. అవసరాల శ్రీనివాస్ ఈ కథకు నారా రోహిత్, నాగశౌర్యను తీసుకుని ఫస్ట్ సక్సెస్ సాధించాడు. నీట్ ఫిల్మ్ చేసి అన్ని వర్గాల ప్రేకకులు సినిమా చూసే విధంగా తీర్చిదిద్దాడు. అన్న, దమ్ముల అనుబంధం, వారి మధ్య ఎమోషనల్ సీన్స్ చక్కగా ఎలివేట్ అవ్వడంతో ఆడియన్స్ సినిమాలో ఇన్ వాల్వ్ అయిపోతారు. సెకండాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉన్నప్పటికీ, క్లయిమ్యాక్స్ కి వచ్చేసరికి సినిమాలో పూర్తిగా లీనమైపోతారు. వన్ లైనర్స్ ఈ సినిమాకి చాలా ప్లస్. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. పాటల చిత్రీకరణ బాగుంది. మంచి కామెడీ ఉంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. దాంతో ఓ మంచి సినిమాని చూసామన్న ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ వీకెండ్ కి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే చిత్రం జ్యో అచ్యుతానంద. ఫ్యామిలీ స్ తో కలిసి హాయిగా సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు సో... డోంట్ మిస్ ఇట్.

ఫిల్మీబజ్ రేటింగ్ - 3.5/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !