View

కాటమరాయుడు మూవీ రివ్య్వూ

Friday,March24th,2017, 05:47 AM

చిత్రం - కాటమరాయుడు
బ్యానర్ - నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్
నటీనటులు - పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నాజర్, ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా, రావు రమేష్, శివబాలాజీ, చైతన్యకృష్ణ, అజయ్, అలీ, పవిత్రలోకేష్ తదితరులు
ఫైట్స్‌ - రామ్ - లక్ష్మ‌ణ్‌
ఎడిటింగ్‌ - గౌతంరాజు
సినిమాటోగ్ర‌ఫీ - ప‌్ర‌సాద్ మూరెళ్ల‌
మ్యూజిక్‌ - అనూప్ రూబెన్స్‌
నిర్మాత‌ - శ‌ర‌త్ మ‌రార్‌
ద‌ర్శ‌క‌త్వం - డాలి
రిలీజ్ డేట్ - 24 మార్చి, 2017


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత యేడాది 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంతో ఆడియన్స్ ని అలరించాడు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదుగానీ, వసూళ్ల పరంగా మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ స్టామినా అది. సరిగ్గా యేడాది తర్వాత ఈ రోజు (24.3.2017) 'కాటమరాయుడు' సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు పవన్ కళ్యాణ్. ఇది తమిళ్ చిత్రం 'వీరమ్' కి రీమేక్. అజిత్ హీరోగా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్ లో భారీ విజయాన్ని చవిచూసింది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ లో నటించడం, టీజర్స్, ట్రైలర్స్ కి భారీ స్పందన రావడంతో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. గోపాల గోపాల ఫేం డాలి దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.


కథ
రాయలసీమలోని తాళ్లపాక గ్రామంలో కాటమరాయుడు (పవన్ కళ్యాణ్) కుటుంబం నివసిస్తుంటుంది. కాటమరాయుడికి తన నలుగురు తమ్ముళ్లంటే ప్రాణం. తమ్ముళ్లకు కూడా అన్నయ్య కాటమరాయుడు మాటంటే వేదం. పెళ్లి చేసుకుంటే వచ్చే భార్యలు అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతారనే ఆలోచనతో కాటమరాయుడు పెళ్లి చేసుకోడు... తన తమ్ముళ్లను కూడా ఆడవారి జోలికి పోనివ్వడు. కానీ కాటమరాయుడు తమ్ముళ్లు ముగ్గురు ఆల్ రెడీ ప్రేమలో పడిపోతారు. కాటమరాయుడు లాయర్ లింగబాబు (అలీ) కూడా ప్రేమలో పడిపోతాడు. తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే, అన్నయ్య కాటమరాయుడుని కూడా ప్రేమలో పడేలా చేయాలని ఫిక్స్ అవుతారు తమ్ముళ్లు. ఎదురింటిలో దిగిన క్లాసికల్ డ్యాన్సర్ అవంతి (శృతిహాసన్) దగ్గర తన అన్నయ్య గురించి గొప్పగా చెబుతారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేయడానికి రకరకాల ప్లాన్స్ వేస్తారు. ఫైనల్ గా కాటమరాయుడు, అవంతి ప్రేమలో పడతారు.


తన తండ్రి భూపతి(నాజర్) కి పరిచయం చేయడానికి కాటమరాయుడుని తన ఊరికి తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటుంది అవంతి. కానీ ట్రైన్ లో రౌడీలతో కాటమరాయుడు గొడవపడటంతో అతను గురించి తనకు చాలా తెలీదని, తను అనుకుంటున్నట్టు కాటమరాయుడు పీస్ ఫుల్ గా బ్రతికే వ్యక్తి కాదని తెలుసుకుని తన జీవితం నుంచి తప్పుకోవాల్సిందిగా కాటమరాయుడుకి చెప్పేసి తన ఊరు వెళ్లిపోతుంది అవంతి. కట్ చేస్తే...


అవంతి ఊరికి కాటమరాయుడు వెళతాడు. అవంతి ఫ్యామిలీని భాను (తరుణ్ అరోరా) టార్గెట్ చేసాడని తెలుసుకుంటాడు. అప్పట్నుంచి అవంతి కుటుంబాన్ని కాపాడుతుంటాడు కాటమరాయుడు. పీస్ ఫుల్ గా బ్రతకాలనే అవంతి ఆమె కుటుంబాన్ని భాను ఎందుకు టార్గెట్ చేస్తాడు... తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిన భాను వల్లే కాటమరాయుడు గొడవలు పడుతున్నాడని అవంతి తెలుసుకుంటుందా... ఫైనల్ గా వీరి ప్రేమ సక్సెస్ అవుతుందా... అవంతి కుటుంబాన్ని టార్గెట్ చేసిన భానుని కాటమరాయుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
కాటమరాయుడుగా పవన్ కళ్యాణ్ గెటప్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. పంచ్ డైలాగ్స్, పంచె కట్టులో తనదైన శైలిలో డ్యాన్సులు, శృతిహాసన్ తో లవ్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించాడు. అవంతి పాత్రను శృతిహాసన్ బాగా చేసింది. గ్లామర్ గా ఉంది. నాజర్, తరుణ్ అరోరా తమ పాత్రల పరిధిమేరకు నటించారు. రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది. కానీ కానీ.. అని రావు రమేష్ చెప్పిన డైలాగ్, ఆ డైలాగ్ మాడ్యులేషన్ ట్రెండింగ్ అవ్వడం ఖాయం, అలీ, ఫృధ్వీ కొన్ని సీన్స్ లో నవ్వులు పూయించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ సినిమాకి ప్లస్ యాక్షన్ ఎపిసోడ్స్. ఫైట్స్ చాలా బాగున్నాయి. పంచ్ డైలాగ్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సినిమాటోగ్రఫీ సూపర్. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు యావరే్జ్ గా ఉన్నాయి. సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండటం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. నిర్మాణపు విలువలు సూపర్బ్. ఫ్యాన్స్ కి నచ్చే విధంగా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ బాబి చేసిన మార్పులు బాగున్నాయి. ముఖ్యంగా రీమేక్ అన్న ఫీలింగ్ కలగకుండా, నేటివిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ డాలి.


పిల్మీబజ్ విశ్లేషణ
పవన్ కళ్యాణ్, శృతిహాసన్ లవ్ సీన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. తమ్ముళ్లతో సరదాగా గడిపే సీన్స్, పవన్ కళ్యాణ్ వారితో ఆడిపాడటంలాంటి సీన్స్ అన్ని వర్గాల ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. లుంగీ కట్టుతో పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, లుక్స్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాప్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సెకండాఫ్ బిగినింగ్ లో కొంచెం స్లో అవుతుంది అనే ఫీలింగ్ కలిగేలోపు యాక్షన్ ఎపిసోడ్స్ రావడం, క్లయిమ్యాక్స్ కి లీడ్ తీసుకోవడంతో సినిమా బోర్ కొట్టిన ఫీలింగ్ కలగదు. హీరోయిజం ఎలివేట్ చేసే విధంగా సీన్స్ ఉండటం పవన్ కళ్యాణ్ అభిమానులను కట్టిపడేస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశపడిన మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఊరటనిస్తుంది. మాస్, ఫ్యాన్స్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి కమర్షియల్ గా సినిమా వర్కవుట్ అవుతుంది. వచ్చే వారం పెద్ద సినిమాలు విడుదలవ్వడం లేదు. ఇది 'కాటమరాయుడు' స్మూత్ రన్ కి ఉపయోగపడుతుంది. ఉగాది హాలీడేస్ ని కాటమరాయుడు క్యాష్ చేసుకుంటుంది కాబట్టి వసూళ్ల పరంగా విజృంబించడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమాని చూడొచ్చు.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.5/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !