View

కేటుగాడు మూవీ రివ్య్వూ

Friday,September18th,2015, 09:11 AM

చిత్రం - కేటుగాడు
బ్యానర్ - 100క్రోర్స్ అకాడమీ
నటీనటులు - తేజస్ కంచక్ల, చాందిని చౌదరి, సుమన్, రాజీవ్ కనకాల, అజయ్, స్నిగ్ధ, భావన, ప్రవీణ్, చంద్రశేఖర్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, అదుర్స్ రఘు, సత్య, సప్తగిరి తదితరులు
మాటలు - పి.రాజశేఖర్ రెడ్డి, భాషాశ్రీ
సంగీతం - సాయికార్తీక్
ఎడిటింగ్ - పి.వెంకటేశ్వర్రావు
ఎగ్జిక్యూటిల్ ప్రొడ్యూసర్స్ - అచ్చిబాబు.యం, సంపత్ కుమార్.ఎ
సమర్పణ - వి.యస్.పి.తెన్నేటి
నిర్మాత - వెంకటేష్ బాలసాని
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కిట్టూ నల్లూరి

 

'ఉలవచారు బిర్యాని' ద్వారా పరిచయమైన తేజస్ ఆ చిత్రంతో నటుడిగా పాస్ అయ్యాడు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ సీన్స్ ను బాగా చేశాడు. ఇప్పుడు 'కేటుగాడు'లో చేసిన హీరో క్యారెక్టర్ తనకు మరింత మంచి పేరు తెస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. దర్శకుడు కిట్టు నల్లూరికి ఇది మొదటి సినిమా. మరి.. అప్ కమింగ్ హీరో తేజస్ తో కిట్టు చేసిన ఈ 'కేటుగాడు' ఎలా ఉంది?.. తెలుసుకుందాం...

 

à°•à°¥
చందు (తేజస్) కార్లును దొంగిలిస్తుంటాడు. అతని ఫ్రెండ్ ప్రవీణ్ దొంగిలించిన కార్లును అమ్ముతుంటాడు. అలా ఓ కారును దొంగిలించే క్రమంలో అకీరా (చాందిని చౌదరి)ని చూస్తాడు చందు. తొలి చూపులోనే ఆమెను ప్రేమించిన చందు ఆమెను ఫాలో అవుతుంటాడు. ఫేస్ బుక్ ద్వారా అకీరా తన ఫామ్ హౌస్ కి వెళుతుందన్న సంగతి తెలుసుకున్న చందు ఆమె కారును ఫాలో అవుతాడు. ఓ దాబా ముందు అకీరా కారు ఆగి ఉండటంతో తను కూడా ఆగుతాడు. కారు డిక్కీలోంచి సౌండ్స్ రావడంతో డిక్కీ ఓపెన్ చేస్తాడు చందు. కారు డిక్కీలో అకీరా ఉండటం చూసి షాక్ అవుతాడు. తనను కిడ్నాపర్ అనుకుంటుందేమోనని భయపడి కారు దొంగిలించడానికి ఆమెను ఫాలో అయ్యానని చెప్పి ఆమెతో సహా కారుని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు.


టివిలో వ్యాపారవేత్త ప్రకాష్ (రాజీవ్ కనకాల) చెల్లెలు అకీరా కిడ్నాప్ కి గురయ్యిందని, ఆమెను కిడ్నాప్ చేసింది చందు అని స్ర్కోలింగ్ ఇస్తుంటారు. ఈ న్యూస్ తెలుసుకుని చందు తన మీద కిడ్నాప్ కేసు పడుతుందని, తను సేఫ్ గా ఉన్నాననే విషయం తన అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పమని అకీరా దగ్గర చెబుతాడు. అకీరా తన దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేసిన చందుకి అసలు అకీరాని కిడ్నాప్ చేయించింది అన్నయ్య ప్రకాష్ అన్న సంగతి తెలుసుకుని షాక్ అవుతాడు. తనని కిడ్నాప్ చేయమని చెప్పింది అన్నయ్య ప్రకాష్ అని తెలుసుకున్నఅకీరా కూడా షాక్ అవుతుంది. ఈ ఊహించని ట్విస్ట్ తో అకీరా, చందు ఇద్దరూ అయోమయంలో పడతారు. మరోవైపు అకీరాని చంపడానికి అజయ్ కూడా ప్రయత్నం చేస్తుండటంతో చందుకీ, అకీరాకీ ఏం జరుగుతుందో అర్ధం కాదు.


అకీరాని సొంత అన్నయ్య ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడు.. అకీరాని చంపడానికి అజయ్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు... ఈ ట్విస్ట్ ల వెనకున్న అసలు కథేంటీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
చందు పాత్రను తేజస్ బాగా చేశాడనే చెప్పాలి. కొంచెం ఎమోషన్, కొంచెం యాక్షన్, కొంచెం సెంటిమెంట్.. ఇవన్నీ తన పాత్రలో ఉంటాయి. కాకపోతే వాటిని డీప్ గా చూపించుకునేంత స్కోప్ సీన్స్ లో లేకపోవడంవల్ల ఉన్నంతలో లైటర్ వీన్ గా చేశాడు. చాందినీ చౌదరి ఓకే అనిపించుకుంది. నటనపరంగా విజృంభించే స్కో్ప్ తన క్యారెక్టర్ కి కూడా లేదు. అన్నయ్య పాత్రను రాజీవ్ కనకాల బాగా చేశాడు. బడా వ్యాపారవేత్త రతన్ రాయ్ పాత్రలో సుమన్ నిడివి తక్కువ పాత్ర చేశారు. కానీ, ఆ పాత్ర తగ్గట్లుగా హుందాగా ఉన్నారు. నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ను అజయ్ బాగా చేశాడు. ఇంకా పృథ్వీ, సప్తగిరి, ప్రవీణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

 

సాంకేతిక వర్గం
ఈ స్టోరీ లైన్ బాగుంది. ఆ లైన్ చుట్టూ కథ అల్లుకుని కిట్టు ఈ సినిమా చేశారు. చిన్న లైన్ అయినప్పటికీ బలమైనదే. కానీ, దాని చుట్టూ అల్లిన కథ కూడా ఇంకా బలంగా ఉండి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఓ వెరైటీ లైన్ ని అనుకున్నందుకు కిట్టుని అభినందించాల్సిందే. సాయి కార్తీక్ స్వరపరచిన పాటలు, మల్హర్ భట్ కెమెరా పనితనం బాగున్నాయి. వెంకటేష్ బాలసానికి ఇది నిర్మాతగా మొదటి సినిమా. రాజీపడకుండా ఖర్చుపెట్టారనే చెప్పాలి.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇవాళ ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ నే కోరుకుంటున్నారు కాబట్టి డైరెక్టర్ అది మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ఎక్కువ శాతం కామెడీ సీన్స్ తో చిత్రాన్ని నడిపించారు. హీరోయిన్ ని చంపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు, అన్నయ్యే చెల్లెలును ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడనే సస్పెన్స్ ని చివరి వరకూ మెయింటెన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.  à°¨à°¿à°¡à°¿à°µà°¿ తక్కువ కాబట్టి సినిమా లాగినట్టు అనిపించదు. కాబట్టి ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !