filmybuzz

View

ప్రేమమ్ మూవీ రివ్య్వూ

Friday,October07th,2016, 09:06 AM

చిత్రం - ప్రేమమ్
బ్యానర్ - సితార ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - అక్కినేని నాగచైతన్య, శృతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ, నోయల్ తదితరులు
సంగీతం - గోపీ సుందర్, రాజేష్ మురుగేషన్
సినిమాటోగ్రఫీ - కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఓరిజినల్ స్టోరీ - అల్ఫోన్సె పుధరిన్
సమర్పణ - పి.డి.వి.ప్రసాద్
నిర్మాత - సూర్యదేవర నాగవంశీ
స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - చందు మొండేటి


లవ్ సబ్జెక్ట్ కి పేటెంట్ హక్కులు అక్కినేని హీరోలవే అనేంతగా ఓ ముద్ర పడిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు రొమాంటిక్ హీరో ఇమేజ్ ని నాగార్జున తన భుజాలపైన వేసుకుని మోసారు.ఇప్పుడు ఆయన వారసులు అక్కినేని అఖిల్, నాగచైతన్య కూడా లవర్ బోయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని ముందుకు దూసుకెళుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య పై ఈ ఇమేజ్ చాలా గట్టిగా పడింది. ఇక 'ప్రేమమ్' టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ నాగచైతన్య చేస్తున్నాడనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది మలయాళ చిత్రం ''ప్రేమమ్' కి రీమేక్. మలయాళ టైటల్ నే తెలుగు సినిమాకి కూడా పెట్టేసారు. 'కార్తీకేయ' ఫేం చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి మలయాళంలో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ మేరకు తెలుగు ప్రేకకులను ఆకట్టుకుంటుంది... నాగచైతన్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా తెలుసుకుందాం.


కథ
ఓ కుర్రాడి జీవితంలో మూడు దశల్లో కలిగే ప్రేమను 'ప్రేమమ్' చిత్రంలో చూపించడం జరిగింది. 10th క్లాస్ స్టూడెంట్ విక్రమ్ (నాగచైతన్య) తన ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఆ ఊరిలోని కుర్రాళ్లంతా సుమ (అనుపమాపరమేశ్వరన్) అనే అమ్మాయి వెనకాల పడుతూ, ఆమెను ప్రేమలో పడేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. ఇంత కాంపిటీన్ ఉన్నఅమ్మాయి మనసును గెల్చుకోవాలని విక్రమ్ కూడా ప్రయత్నాలు మొదలుపెడతాడు. ప్రేమలేఖలు రాస్తాడు. చివరికి ఆ అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమిస్తుందని తెలియడంతో విక్రమ్ ప్రేమకి బ్రేక్ పడుతుంది.


ఆ బాధను మర్చిపోవడానికి విక్రమ్ కి 5యేళ్లు పడుతుంది. విక్రమ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ ఓ గ్యాంగ్ ని మెయింటెన్ చేస్తూ, హీరోయిజం చూపిస్తూ జూనియర్స్ ని రాగింగ్ చేస్తూ గడిపేస్తుంటాడు విక్రమ్. ఆ సమయంలో కాలేజ్ లో లెక్కరర్ గా జాయిన్ అవుతుంది సితార వెంకటేషన్ (శృతిహాసన్). ఆమెను చూసినప్పట్నుంచే ఆమె ప్రేమలో పడిపోతాడు విక్రమ్. సితారను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. తన ప్రేమను వ్యక్తపరచడానికి సిద్ధమవుతున్న సమయంలో సితార తన సొంత ఊరికి వెళుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన ప్రేమను చెప్పాలనుకుంటాడు విక్రమ్. అయితే సితారకు యాక్సిడెంట్ అవ్వడంతో గతం మర్చిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె బావతో పెళ్లి కుదురుతుంది. అలా సితార, విక్రమ్ ప్రేమకు ఫుల్ స్టాప్ పడుతుంది.


మరో ఐదేళ్లు గడిచిపోతాయి. విక్రమ్ ఎస్ రెస్టో రెస్టారెంట్ ని ఆరంభించి లైఫ్ లో సెటిల్ అవుతాడు. సితార జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేకపోతాడు. ఆ సమయంలో సింధు (మడోన్నా సెబాస్టియన్) తారసపడుతుంది. ఆ సింధు ఎవరో కాదు... చిన్నప్పుడు తమ ఇంటి ఎదురుగా ఉండే పిల్ల అని తెలుసుకుని షాక్ అవుతాడు. సింధును ప్రేమించడం మొదలుపెడతాడు. ఓ సందర్భంలో ఆమెకు తన ప్రేమను వ్యక్తపరుప్తాడు. అప్పుడు తనకు వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయ్యిందన్న విషయాన్ని చెబుతుంది సింధు. ఈ మూడో ప్రేమ కథకి కూడా ఫుల్ స్టాప్ పడుతుందా... లేక సుఖాంతం అవుతుందా.. గతం మర్చిపోయిన సితారను విక్రమ్ కలుసుకుంటాడా అనేదే ఈ చిత్రం క్లయిమ్యాక్స్.


నటీనటుల ఫర్ ఫామెన్స్
నాగచైతన్య నటనకు వంద మార్కులు గ్యారంటీ. కెరీర్ బెస్ట్ ఫెర్ ఫామెన్స్ ఇచ్చాడు. ఈ చిత్రంలో మూడు దశల్లో కనిపిస్తాడు నాగచైతన్య. స్కూల్ డేస్ లోని అమాయకత్వం, కాలేజ్ డేస్ లోని హీరోయిజం, రెక్ లెస్ నెస్, లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మెచ్చుర్డ్ పర్సన్ గా అద్భుతంగా నటించాడు నాగచైతన్య. ఈ మూడు దశల్లోనూ ఫిజిక్, లుక్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు సూపర్బ్. హీరోయిన్లు అనుపమాపరమేశ్వరన్, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్లు తమ పాత్రలకు బాగా సూట్ అయ్యారు. ముగ్గురికి మంచి మార్కులు పడతాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. వెంకటేష్, నాగార్జున గెస్ట్ అఫియరెన్స్ ఆడియన్స్ లో హుషారును నింపుతుంది.


సాంకేతిక వర్గం
గ్రిప్పింగ్ స్టోరీ లైన్, అంతే గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే ఈ చిత్రానికి బలం. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్. అంత సూపర్ హిట్ సాధించిన సినిమాని రీమేక్ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే ఏమైనా మార్పులు చేయాలంటే చాలా టెన్షన్ పడాల్సి ఉంటుంది. కానీ చందు మొండేటి ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి విజయం సాధించాడు. ఎక్కడా రీమేక్ స్టోరీ అనే ఫీలింగ్ కలగదు. టేకింగ్ బాగుంది. డైలాగులు బాగున్నాయి. గోపీసుందర్ రీ-రికార్డింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. 'ఎవరే....' సాంగ్ ఆడియో పరంగా, విజువల్ గా కూడా బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సినిమాకి చాలా ప్లస్. కథకు సరిపడా బడ్జెట్ తో నిర్మాణ విలువలు సూపర్బ్,


ఫిల్మీబజ్ విశ్లేషణ
'ప్రేమమ్' అందమైన ప్రేమ కథ. మలయాళ వెర్షన్ ని మక్కికి మక్కి దింపేయకుండా డైరెక్టర్ చందు మొండేటి మార్పులు చేసిన విధానం బాగుంది. స్కూల్ స్టూడెంట్ గా, కాలేజ్ స్టూడెంట్ గా, లైఫ్ లో సెటిల్ అయిన కుర్రాడిగా నాగచైతన్య అద్భుతమైన నటన కనబర్చాడు. స్కూల్ స్టూడెంట్ గా నాగచైతన్య బాడీ లాంగ్వేజ్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. కాలేజ్ స్టూడెంట్ గా రఫ్ లుక్, రెక్ లెస్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. లైఫ్ లో స్థిరపడిన కుర్రాడిగా మెచ్చుర్డ్ లుక్, బిహేవియర్ నటుడిగా నాగచైతన్య బాగా ఇంఫ్రూవ్ అయ్యాడనే ఫీలింగ్ ని కలుగజేస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టంగా నాగచైతన్య చేసాడని చెప్పాల్సిందే. ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో ఇరగదీసాడు. విక్రమ్ జీవితంలో జరిగిన సంఘటనలు ప్రతి మనిషి జీవితంలో జరుగుతాయి కాబట్టి, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకునే విధంగా సినిమా ఉంటుంది. కాబట్టి సినిమాటిక్ గా కాకుండా ఓ కుర్రాడి రియల్ లైఫ్ ని చూస్తున్న అనుభూతిని కలుగుతుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమా. రెండో ప్రేమకథ కాస్త సాగదీసినట్టు అనిపించినా, ఆ కథలో ఉన్న ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఓ ఫ్రెష్ లవ్ సబ్జెక్ట్ ని చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగజేయడం కూడా ఈ సినిమాకి ప్లస్. ఇంటర్వెల్ తర్వాత కొన్సి సీన్స్ బోర్ అనిపించినా, తర్వాత ఆ కథలోని ఎమోషన్ కి కనెక్ట్ అయిపోయి సినిమాని చూస్తారు. థియేటర్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్ 'సినిమా బాగుంది' అంటారే తప్ప.. నెగటివ్ ఫీడ్ బ్యాక్ రాదు. లవ్ అనేది యూనివర్శిల్ పాయింట్. కాబట్టి ఎ, బి, సి సెంటర్స్ తేడా లేకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. నాగార్జున, వెంకటేష్ గెస్ట్ అఫియరెన్స్ ఆడియన్స్ పెదవులపైన నవ్వులు పూయిస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ 'ప్రేమమ్' ఓ స్వీట్ జర్నీ. ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో పడినవారు, ప్రేమలో ఓడిపోయినవారు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. స్వీట్ మొమరీస్ ని నెమరేసుకుంటారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !