filmybuzz

View

ధృవ మూవీ రివ్య్వూ

Friday,December09th,2016, 03:35 AM

చిత్రం - ధృవ
బ్యానర్ - గీతా ఆర్ట్స్
నటీనటులు - రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, పోసాని కృష్ణమురళి, నవదీప్, నాజర్, షయాజీ షిండే తదితరులు
సినిమాటోగ్రఫీ - పి.యస్.వినోద్
సంగీతం - హిప్ హాఫ్ తమిళ
ఎడిటింగ్ - నవీన్ నూలి
నిర్మాతలు - అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్
దర్శకత్వం - సురేందర్ రెడ్డి
విడుదల తేదీ - 9.12.2016


మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన చిత్రం 'ధృవ'. ఇది తమిళ్ చిత్రం 'తని ఒరువన్' కి రీమేక్, తమిళంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఈ చిత్రం యూనిట్ ఉంది. రాంచరణ్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్, రాంచరణ్ లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
ఐపియస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ధృవ (రాంచరణ్) తన బ్యాచ్ లో తన ఆశయాలకు దగ్గరగా వుండే నలుగురు ఐపియస్ ట్రైనర్స్ తో కలిసి తన కళ్లముందు జరిగే అన్యాయాలను ఎదుర్కొంటాడు. అందులో భాగంగా నేరస్థులను పోలీసులకు పట్టిస్తుంటాడు. కానీ పోలీసులకు పట్టించిన ప్రతి వ్యక్తి చేస్తున్న నేరాల వెనుక ఉన్న అసలు టార్గెట్ వేరని తెలుసుకుంటాడు ధృవ. దాంతో మూలాలను పట్టుకుని అసలు నేరస్థుడుని బయటికి లాక్కురావాలనే టార్గెట్ ని పెట్టుకుంటాడు ధృవ. ఎంక్వయిరీ మొదలుపెడతాడు. ఆ ఎంక్వయిరీలో ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీఖాన్ అనే ముగ్గురు వ్యక్తులు కారణమని, ఆ ముగ్గురు వెనక ఉన్న అసలు వ్యక్తి ప్రముఖ సైంటిస్ట్ సిద్ధార్ధ్ అభిమన్యు (అరవింద్ స్వామి) అని తెలుసుకుంటాడు. ఈ ముగ్గురిని బినామీలుగా పెట్టుకుని అభిమన్యు చేస్తున్న అరాచకాలను తెలుసుకుంటాడు ధృవ. ఐపియస్ ఆఫీసర్ గా పోస్టింగ్ తీసుకోగానే అభిమన్యును టార్గెట్ చేస్తూ, అతని అరాచకాలను బయటపెట్టడానికి వర్కవుట్ చేస్తాడు. తనని ఐపియస్ ఆఫీసర్ ధృవ టార్గెట్ చేసాడని తెలుసుకున్న అభిమన్యు ఏం చేసాడు... ధృవను ఎలా అడ్డుకున్నాడు... అభిమన్యు ప్లాన్స్ ని బెడిసికొట్టేలా చేసి, అతను నేరస్థుడు అని నిరూపించడానికి ధృవ ఎలాంటి ఆపరేషన్ చేసాడు... ఆ ఆపరేషన్ లో ధృవ విజయం సాధించాడా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెరఫామెన్స్
ఐపియస్ ఆఫీసర్ ధృవ పాత్ర చేయడానికి రాంచరణ్ తీసుకున్న శ్రద్ధ తెరపై ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది. చాలా ఇష్టంగా ఈ పాత్ర కోసం కష్టపడ్డాడు రాంచరణ్. సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఫిజిక్ ని మల్చుకున్న విధానం సూపర్బ్. సిక్స్ ప్యాక్ బాడీ, షార్ప్ లుక్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ గా ఉంది. ముఖ్యంగా పరేషాన్ సాంగ్ లో చాలా హాట్ గా ఉంది. అరవింద్ స్వామి హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. తన తెలితేటలతో ఎంతోమందిని తొక్కేస్తూ, అడ్డంపడిన వారిని చంపేస్తూ జీవితాన్ని మలుచుకున్న సిద్ధార్ధ్ అభిమన్యు పాత్రలో నటించాడు అనేకంటే అరవింద్ స్వామి జీవించాడు అనడం కరెక్ట్. నవదీప్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసాడు. తనకు ఈ క్యారెక్టర్ ప్లస్ అవుతుందే తప్ప మైనస్ అవ్వదు. నాజర్, పోసాని, షయాజీ షిండే వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మిగతా నటీనటులదంరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ చిత్రంలో పాటలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కానీ రీరికార్డింగ్ కి స్కోప్ ఉన్న సినిమా. సంగీత దర్శకుడు హిప్ హాఫ్ తమిళ ఈ విషయాన్ని అవగాహన చేసుకుని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రతి సీన్ ఎలివేట్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు. విజువల్ గా సాంగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కనులవిందుగా ఉంది. ఎడిటింగ్ సూపర్బ్. ఎక్కడా బోర్ అనిపించదు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెప్పాలంటే... స్టైలిష్ టేకింగ్ తో ఇరగదీసాడు. ఇది తమిళ్ రీమేక్. నిజం చెప్పాలంటే రీమేక్స్ చేయడం చాలా రిస్క్. ప్రతి విషయాన్ని కంపేర్ చేస్తారు, కానీ సురేందర్ రెడ్డి రీమేక్ సినిమా చూస్తున్నమన్న ఫీలింగ్ ని ఆడియన్స్ కి కలగకుండా చేసాడు. ఒరిజినల్ వెర్షన్ కి చిన్న మార్పులు చేసినప్పటికీ, అవి బెటర్ మెంట్ కోసం చేసినవిగానే అనిపిస్తాయి తప్ప... సినిమా చెడగొట్టలేదు. యాక్షన్ సీన్స్ స్టైలిష్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సురేందర్ రెడ్డికి ఈ సినిమా ప్లస్ అవుతుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణపు విలువలు సూపర్బ్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఓ తెలివైన శత్రవుతో పోరాడే పోలీసాఫీసర్ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది, అతను ఎంత షార్ప్ గా ఉండాలో తెరపై ఆవిష్కరించిన విధానం సూపర్బ్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ ఈ టెంపో ని మెయింటెన్ చేసారు. సింఫుల్ స్టోరీ లైన్ అయినప్పటికీ, స్ర్కీన్ ప్లే సూపర్బ్. హీరో, విలన్ వేసే ఎత్తుకు, పై ఎత్తులతో స్టోరీ సాగిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోని హీరో పాత్ర కాకుండా ఇంటిలిజెన్స్ ఐడియాస్ తో సాగే హీరో క్యారెక్టరైజేషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. విలన్ అంటే వంద మందిని చితక్కొట్టేయడం కాదు... తెలివిగా తన జీవితాన్ని మలుచుకుంటూ, అడ్డంపడిన వారిని చంపేస్తూ, అవసరమైతే తన తండ్రిని సైతం చంపేయగల క్రూరత్వం ఉన్న విలన్ ని చాలా స్టైలిష్ గా చూపించడం బాగుంది. రాంచరణ్ ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం.


ఫైనల్ గా చెప్పాలంటే... అష్ట దిగ్భందనం చేసి... అన్ని వర్గాల ఆడియన్స్ 'ధృవ' కి జై కొట్టేలా చేసారు.

 

 

ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !