View

Malli Malli Idi Rani Roju Movie Review

Friday,February06th,2015, 08:32 AM

చిత్రం - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
బ్యానర్ - సి.సి.మీడియా & ఎంటర్ టైన్ మెంట్స్ లిమిటెడ్
నటీనటులు - శర్వానంద్, నిత్యామీనన్, నాజర్, చిన్నా, సన, సూర్య, పవిత్ర లోకేష్, తేజస్విని మదివాడ తదితరులు
సంగీతం - గోపిసుందర్
డైలాగ్స్ - బుర్రా సాయిమాధవ్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్ - సాహి సురేష్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - నల్లూరి రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ నిర్మాత - తమ్ముడు సత్యం
నిర్మాత - కె.వల్లభ
సయర్పణ - కె.యస్.రామారావు
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కె. కాంత్రి మాధవ్

''ఇదొక అందమైన పుష్పగుచ్ఛంలాంటి సినిమా. అద్భుతమైన ప్రేమ కావ్యం''.. అని 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రం గురించి పలు ప్రెస్ మీట్స్ లో కె.యస్. రామారావు చెప్పకుంటూ వచ్చారు. ఇప్పటివరకూ క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థపై దాదాపు అన్నీ మంచి చిత్రాలే అందించారు కాబట్టి, ఈసారి కూడా అద్భుతమైన చిత్రం రూపొందించి ఉంటారనే అంచనా అందరిలోనూ ఏర్పడింది. పైగా.. మంచి కథలు ఎన్నుకునే హీరోగా శర్వానంద్ కి, మంచి చిత్రాల్లో మాత్రమే నటించే హీరోయిన్ గా నిత్యామీనన్ కి పేరుంది. ఇక, 'ఓనమాలు' అనే మంచి చిత్రం ద్వారా దర్శకుడనిపించుకున్నారు క్రాంతి మాధవ్. సో.. ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా ఓ అద్భతుమే సెల్యులాయిడ్ కి వచ్చి ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆ ఊహ ఎంతవరకు నిజం అవుతుంది? 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' మంచి అనుభూతికి గురి చేస్తుందా?.. తెలుసుకుందాం.

కథ
తల్లి పార్వతి (పవిత్రా లోకేష్) అంటే రాజారాం (శర్వానంద్)కి చాలా ఇష్టం. మ్యూజిక్ టీచర్ అయిన పార్వతి తన భర్త చనిపోవడంతో అన్నీ తానై కొడుకును పెంచుతుంది. స్టేట్ లెవెల్లో రన్నింగ్ లో చాంపియన్ అయిన రాజారాం నేషనల్ లెవెల్ పోటీల్లో గెలిచి తన తల్లికి గోల్డ్ మెడల్ ని గిఫ్ట్ గా ఇవ్వాలనే పట్టుదలతో ఉంటాడు. తన కోచ్ (సూర్య) ప్రోత్సాహంతో టార్గెట్ రీచ్ అవ్వడానికి కృషి చేస్తున్న రాజారాంకి ముస్లిం అమ్మాయి నజీరా ఖానమ్ (నిత్యామీనన్) కంట పడుతుంది. బురఖా ధరించిన నజీరా కళ్లు తొలి చూపు నుంచే రాజారాంని వెంటాడటం మొదలుపెడతాయి. తొలి చూపులోనే నజీరాని ప్రేమించడం మొదలుపెట్టేస్తాడు రాజారాం. నజీరా కూడా రాజారాంని తొలి చూపు నుంచే ప్రేమించడం మొదలుపెడుతుంది. ఖానమ్ పేరుతో బురఖా తీసేసి రాజారాం తల్లి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అవుతుంది నజీరా. బురఖాలో నజీరాను చూసిన రాజారాం తన ఇంటికి వస్తున్న ఖానమే తన ప్రేమికురాలు అనే విషయాన్ని తెలుసుకోలేకపోతాడు. నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొనడానికి రాజారాంకి అవకాశం వస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి వెళుతున్న రాజారాంకి సెండాఫ్ ఇవ్వడానికి వెళుతుంది నజీరా. ట్రైన్ లో మూవ్ అవుతున్న సమయంలో బురఖా వేసుకుని నిల్చున్న నజీరా బురఖా తొలిగిపోవడంతో ఆమె ముఖారవిందాన్ని చూస్తాడు రాజారాం. తన ఇంటికి వస్తున్న ఖానమే నజీరా అని తెలుసుకుని సంతోషపడిపోతాడు. ఢిల్లీలో పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ తో ఇంటికి వచ్చిన రాజారాంకి తన తల్లి తన ప్రేమను అంగీకరించడం ఆనందాన్ని కలిగిస్తుంది. రాజారాం తన ప్రేమను నజీరా కి చెప్పే సమయంలో నజీరా బాబాయ్ ఆమెను ఇంటికి రమ్మని కబురు పంపిస్తాడు. తర్వాత కలుసుకుందామని చెప్పి వెళ్లిపోయిన నజీరా తిరిగి రాజారాంని కలవడానికి రాదు. అదే సమయంలో తల్లి చనిపోవడంతో ఒంటరి వాడవుతాడు రాజారాం. ఒకేసారి తనను ఎంతోగానో ప్రేమించే తల్లి, తను ఎంతగానో ప్రేమించే ప్రేమికురాలు రాజారాంకి దూరమవుతారు.
రాజారాంని ఎంతగానో ప్రేమించిన నజీరా తిరిగి ఎందుకు రాలేదు? రాజారాంని కలవని నజీరా పెళ్లి చేసుకుందా? నజీరాని ప్రేమించిన రాజారాం పెళ్లి చేసుకున్నాడా? చివరికి రాజారాం, నజీరా కలుసుకున్నారా అనేది ఈ సినిమా కథ.

నటీనటులు

ఏ నటుడైనా 'మంచి ఆర్టిస్ట్' అనిపించుకునేది ఎప్పుడంటే ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ బాగా చేసినప్పుడే. ఈ రెండింటినీ పండించడం అంత సులువు కాదు. 'గమ్యం'లో ప్రేయసిని వెతికే ప్రయాణంలో శర్వానంద్ మంచి ఎమోషన్ పలికించాడు. ఆ సినిమాతోనే తనలో మంచి నటుడు ఉన్న విషయం అర్థమయ్యింది. ఇక, 'రన్ రాజా రన్'లో లైటర్ వీన్ కారెక్టర్ ని బాగా చేశాడు. ఆ పాత్రలో కామెడీని కూడా పండించగలిగాడు. ఈ రెండు చిత్రాలూ ఒక ఎత్తయితే 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' నటన పరంగా శర్వానంద్ కి మరో ఎత్తు అవుతుంది. ఈ పరిణతి గల ప్రేమకథలో 'రాజా రాం' పాత్రలో జీవించాడు. ప్రేమలో ఉన్నప్పుడు ఆ రసాన్ని, విడిపోయిన తర్వాత ఆ ఎమోషన్ ని అద్భుతంగా పలికించాడు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో 'గీతాంజలి' చిత్రంలో నాగార్జున ఎక్కువ శాతం ట్రాజెడీగా కనిపిస్తాడు. అప్పుడు పోటీ ఉన్న ఇతర హీరోల్లో 'ది బెస్ట్ ట్రాజెడీ కింగ్' అనిపించుకున్నాడు. ఇప్పుడు యువహీరోల్లో ఆ బిరుదుని శర్వానంద్ కి ఆపాదిస్తే అతిశయోక్తి కాదు. ఇక.. నిత్యామీనన్ గురించి కూడా చెప్పాలి. అద్భతుమైన నటి. కళ్లతో తను పలికించిన భావాలు అద్భుతం. అందంగా ఉంది. అభినయం భేష్ అనిపించే విధంగా ఉంది. శర్వా, నిత్యా కాకుండా రాజారామ్, నజీరా పాత్రల్లో ఎవర్నీ ఊహించలేం. అంత బాగా నటించారు. శర్వా తల్లిగా చేసిన పవిత్రా లోకేష్ ని కూడా మెచ్చుకోవాలి. సూర్య, చిన్నా, నాజర్, సన, తేజస్విని.. ఇలా సినిమాలో ఉన్న ఇతర పాత్రధారుల నటన కూడా చాలా బాగుంది.

సాంకేతిక వర్గం
క్రాంతి మాధవ్ దర్శకత్వ పని తీరు చాలా బాగుంది. కథ బాగుంది. స్ర్కీన్ ప్లే అంతకన్నా బాగుంది. టేకింగ్ ఇంకా ఇంకా బాగుంది. 'ఓనమాలు'తో క్రాంతి పెద్దవాళ్లకి దగ్గరైతే, ఈ చిత్రంతో యూత్ కి దగ్గరైపోతాడు. మంచి టేస్ట్ ఫుల్ దర్శకుడునిపించుకున్నాడు. ఏ కథనైనా స్పష్టంగా చెప్పగలిగేది మంచి సంభాషణల ద్వారానే. ఇక, 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి పరిణతి కలిగన ప్రేమ కావ్యానికి పదునైన సంభాషణలు చాలా అవసరం. ఆ పరంగా సాయిమాధవ్ కలం మెరిసింది. ఆలోచింపజేసే అర్థవంతమైన సంభాషణలు రాశారు. ఈ కథ అందరి హృదయాలను హత్తుకోవడానికి సంభాషణలు ఓ కారణం అవుతాయి. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం అభినందనీయం. కలర్ ఫుల్ పెయింటింగ్ లా ఉంది సినిమా. మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ అద్భుతమైన బాణీలిచ్చారు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా చేశారు. ఒక్క సీన్ కూడా వేస్ట్ అన్నట్లు ఉండదు. సో.. ఆ ఘనత ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుకి దక్కుతుంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
కేయస్ రామారావు చెప్పిన మాటలు నిజమే. ఇదొక అందమైన ప్రేమకావ్యం. సినిమాలో వెతికి పట్టుకుందామన్నా.. ఒక్క బూతు ఉండదు. ఇప్పుడొస్తున్న కొన్ని ప్రేమకథల్లో ఉండే వెకిలి చేష్టలు అస్సలుండవు. ప్రేమ అనేది తనువుతో ముడిపడింది కాదు..మనసుతో ముడిపడిందనే అంశాన్ని చాలా చక్కగా చూపించారు. స్వచ్ఛమైన ప్రేమ ఉంటే మనుషులు ఎంత దూరం వెళ్లినా.. మనసులు దగ్గరగా ఉన్నట్టే ఉంటుందనేది చాలా బాగా చూపించారు. సినిమాలో ప్రేయసీ, ప్రియుడి మధ్య ప్రేమ మాత్రమే కాదు.. అమ్మకీ, కొడుక్కీ మధ్య ప్రేమ, తండ్రికీ, కూతురికీ మధ్య ఉండే ప్రేమ, ఓ కోచ్ కీ, స్టూడెంట్ కీ మధ్య ఉండే ప్రేమ.. ఇలా అన్ని బంధాల మధ్య ఉండే్ ప్రేమ మనకు నచ్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనసుని తాకుతుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం ఇది. ఒక్కసారి చూడండి.. మళ్లీ మళ్లీ ఈ సినిమా గురించి నాలుగు మంచి మాటలు పక్కవాళ్లకి చెప్పాలనిపించడం ఖాయం.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !