చిత్రం - స్ట్రీట్ లైట్
నటీ నటులు - తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు
దర్శకత్వం - విశ్వ
నిర్మాత - మామిడాల శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ - రవి సి కుమార్
మ్యూజిక్ - విరించి
ఎడిటర్ - శివ వై ప్రసాద్
స్టూడియో - యుఅండ్ఐ
పిఆర్ ఓ - మధు వి.ఆర్
ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో 'స్ట్రీట్ లైట్' ఒకటి. హైదరాబాద్ మహానగరంలో మారుమూల ఉండే ఓ చిన్న ప్రాంతంలో బస్ స్టాప్ దగ్గరలోని ఓ స్ట్రీట్ లైట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. మరి ఈ వారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
తన భార్య, కూతురితో కారులో ప్రయాణిస్తున్న ఓ మాజీ ఎమ్మెల్యే స్ట్రీట్ లైట్ దగ్గరికి రాగానే కారులో కుప్పకూలిపోతాడు. తన భర్తను కాపాడుకోవడానికి కారు దిగి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటుంది భార్య. సరిగ్గా ఆ సమయంలో అటుగా వెళుతున్న ఏసిపి ఉదయ్ కుమార్ ఇంజక్షన్ ఇచ్చి ఎమ్మెల్యే ను చంపేసి, భార్యతో కోరిక తీర్చుకుని వెళ్లిపోతాడు. ఇదంతా చిన్న పిల్ల వైజయంతి చూస్తుంది. అప్పట్నుంచి ఉదయ్ కుమార్ పైన పగ పెంచుకుంటుంది. భర్త చనిపోయిన తర్వాత వ్యసనాలకు బానిస అయిన ఎమ్మెల్యే భార్య కూతురిని కూడా పట్టించుకోదు. చెడు మార్గంలో నడుస్తున్న తల్లిని భరిస్తూనే, పట్టుదలగా చదివి లాయర్ అవుతుంది. ఆ తర్వాత వైజయంతి తన పగను ఎలా తీర్చుకుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఏసిపి ఉదయ్ కుమార్ గా నెగటివ్ షేడ్ రోల్ చేసాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. హీరోయిన్ వైజయంతి పాత్ర గ్లామరతో పాటు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను తాన్య దేశాయ్ చక్కటి పెర్ ఫామెన్స్ తో ఆకట్టుకుంది. వైజయంతి తల్లి కుమారి పాత్ర చేసిన నటీమణి ఈ సినిమాకి చాలా కీలకం. కథ అంతా ఆమెతోనే ముడిపడి ఉంటుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. చిత్రం శ్రీనుకు ఈ సినిమాలో చక్కటి పాత్ర లభించింది. శ్రీను తనదైన శైలిలో నటించి మెప్పించాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ విరంచి, సినిమాటోగ్రాఫర్ రవిప్రకాష్ ఈ సినిమాకి చాలా ప్లస్. ఈ ఇద్దరూ సినిమాకి పూర్తి న్యాయం చేసారు. విజువల్స్ బాగున్నాయి. సింఫుల్ స్టోరీ లైన్ తో చక్కటి స్ర్కీన్ ప్లే తో సినిమాని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్ విశ్వ. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు నిర్మాత మామిడాల శ్రీనివాస్.
విశ్లేషణ
ఓ స్ట్రీట్ లైట్ లో జరిగిన స్టోరీతో ఈ సినిమా ఇంట్రస్టింగ్ తెరకెక్కింది. నటీనటులను డైరెక్టర్ ఇంకా వాడుకుని ఉంటే బాగుండేది. తల్లి, కూతురు సెంటిమెంట్ ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోవడం ఈ సినిమాకి మైనస్. షకలక శంకర్ సాంగ్ ఈ సినిమాకి ప్లస్. ధనరాజ్ క్యారెక్టర్ సినిమాకి ప్లస్ పాయింట్. చాలా గ్యాప్ తర్వాత వినోద్ కుమార్ మంచి పాత్ర చేసారు. ఓవరాల్ గా చెప్పాలంటే - ఈ సవీకెండ్ కి ఈ సినిమాని థియేటర్ప్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5