View

సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీ రివ్య్వూ

Thursday,September24th,2015, 09:11 AM

చిత్రం - సుబ్రమ్యం ఫర్ సేల్
బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు - సాయిధరమ్ తేజ్, రెజీనా, ఆదాశర్మ, తేజస్వి, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాగబాబు, నరేష్, రావు రమేష్, ఫృథ్వీ, ప్రభాస్ శ్రీను, ప్రగతి, ఝూన్సీ, సురేఖావాణి తదితరులు
సంగీతం - మిక్కీ.జె.మేయర్
సినిమాటోగ్రఫీ - సి.రాంప్రసాద్
ఎడిటింగ్ - గౌతంరాజు
స్ర్కీన్ ప్లే - రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్
కో-ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్
నిర్మాత - దిల్ రాజు
కథ-మాటలు-దర్శకత్వం - హరీష్ శంకర్. ఎస్


ఈ మధ్యకాలంలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్స్ గా నిలిచినవాటిలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఒకటని చెప్పాలి. టైటిల్ ప్రకటించినప్పట్నుంచే ఈ చిత్రంపై ఓ పాజిటివ్ వైబ్ మొదలైంది. ఈ చిత్రం పోస్టర్స్ కూడా అంచనాలు పెరగడానికి ఓ కారణం అయ్యాయి. 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం తన సక్సెస్ పరంపరను కొనసాగించే విధంగా ఉంటుందా? 'రామయ్య వస్తావయ్యా'వంటి ఫ్లాప్ మూవీ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతని కెరీర్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా?.. చూద్దాం...


à°•à°¥
తల్లిదండ్రులు లేని సీతకు (రెజీనా) ఆమె పెదనాన (సుమన్) ఓ పెళ్లి సంబంధం కుదుర్చుతాడు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని సీత ఇంటి నుంచి పారిపోతుంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అభితో తన అభిప్రాయాలు కలవడంతో, అతనినే పెళ్లి చేసుకోవాలని భావించిన సీత యు.యస్ లో ఉంటున్న అభి దగ్గరకు వెళ్లిపోతుంది. ఎయిర్ పోర్ట్ లో అభిని కలుసుకుంటుంది సీత. అక్కడే సుబ్రమణ్యం (సాయిధరమ్ తేజ్) కూడా పరిచయం అవుతాడు. యు.యస్ లో ఆవకాయ్ అనే రెస్టారెంట్ పెట్టుకోవడంతో పాటు, రెడియో జాకీగా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు. అభి, సీత ఎంగేజ్ మెంట్ కి క్యాటరింగ్ చేసే అవకాశం సుబ్బుకి దక్కుతుంది. ఎంగేజ్ మెంట్ వేడుకలో అభి దుర్మార్గుడనే విషయం బయటపడటంతో అతని నుంచి సీతను కాపాడి తన ఇంటికి తీసుకువస్తాడు సుబ్బు. ఓ సందర్భంలో డబ్బు కోసం యన్.ఆర్.ఐ రాజశేఖర్ ఇచ్చిన పార్టీలో పాల్గొని బెస్ట్ కఫుల్ అవార్డ్, దాంతో పాటు ప్రైజ్ మనీ అయిన 25వేల డాలర్లను పంచుకుంటారు సుబ్బు, సీత. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదురుతుంది.


తన అక్క ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని యు.యస్ లో హ్యాపీగా ఉందని భావిస్తున్న సీత చెల్లెలు గీత (తేజస్విని) తనకు పెళ్లి కుదరిందని, బావతో కలిసి రమ్మని సీతకు ఫోన్ చేస్తుంది. దాంతో అసలు తనకు పెళ్లే అవ్వకుండా ఎలా పెళ్లయ్యిందని తన చెల్లెలుకు చెప్పాలి, పెళ్లికి ఎలా వెళ్లాలనే ఆలోచనలో పడిపోతుంది సీత. తన చెల్లెలుకు కూడా పెళ్లి కుదిరింది కాబట్టి తను కూడా ఇండియా వస్తున్నానని సుబ్బు చెపుతాడు. అలా సుబ్బు, సీత కలిసి ఇండియా వస్తారు.


సీతది కర్నూల్. తనను తన వాళ్ల దగ్గర వదలమని సీత అడగడంతో ఆమెను దింపడానికి కర్నూల్ బయలుదేరతాడు. అతనిని చూసిన ఓ రౌడీ గ్యాంగ్ సుబ్బు వెనకపడతారు. సీతను ఇంటికి తీసుకెళ్లిన సుబ్బు అక్కడ ఎన్.ఆర్.ఐ రాజశేఖర్ ఉండటం, అతని కొడుకుతోనే సీత చెల్లెలు గీత పెళ్లి కుదిరిందని తెలియడంతో షాక్ అవుతాడు. వీరిద్దరూ బెస్ట్ కఫుల్స్ కాబట్టే, తన కొడుకును సీత చెల్లెలుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నానని రాజశే్ఖర్ చెబుతాడు. దాంతో సీత, సుబ్బు భార్యా భర్తల్లా నటించడం మొదలుపెడతారు. పెళ్లే అవ్వని సుబ్బు, సీత ఈ విషయాన్ని తమ పెద్దలకు ఎలా చెబుతారు? సుబ్బుని చంపడానికి వెనకపడిన గ్యాంగ్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పర్ఫార్మెన్స్
సుబ్రమణ్యం క్యారెక్టర్ ను సాయిధరమ్ తేజ్ సునాయాసంగా చేశాడు. నటనలో మంచి ఈజ్ కనిపించింది. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఓకే అనిపించుకున్నాడు. ఓవరాల్ గా తనలో మంచి మాస్ హీరో ఉన్నవిషయాన్ని నిరూపించుకున్నాడు. అక్కడక్కడా చిరంజీవి, పవన్ కల్యాణ్ లను తలపించాడు. అది అభిమానులను అలరించే విషయం. ముఖ్యంగా 'గువ్వా గోరికంలా...' పాటలో సాయి చాలా స్టయిలిష్ గా స్టెప్స్ వేశాడు. ఆ విధంగా మెగాస్టార్ కి తగ్గ మేనల్లుడు అనిపించుకున్నాడు. రెజీనా చాలా క్యూట్ గా ఉంది. 'సీత ఇక్కడ' అంటూ ఆత్మవిశ్వాసం, పొగరు కలగలసిన హావాభావాలను చక్కగా ఇచ్చింది. అలాగే 'గువ్వా గోరింక..'కు చాలా క్యూట్ గా డ్యాన్స్ చేసింది. గ్లామరస్ క్యారెక్టర్స్ కి పనికొస్తుందని ప్రూవ్ చేసుకుంది. ఇక, బ్రహ్మానందం నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. చింతకాయ పాత్రను ఇరగదీసారు. సీనియర్ నరేశ్, ప్రగతి, అజయ్, రావు రమేశ్, గెస్ట్ రోల్ లో ఆదా శర్మ.. ఇలా నటించినవాళ్లందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం
దర్శకుడు హరీష్ శంకర్ పాత కథతోనే ఈ సినిమా తీశాడు. ఇలాంటి కథలు ఆల్రెడీ వచ్చి, సక్సెస్ అయ్యాయి కాబట్టి, దీన్నే ఫాలో అయితే సేఫ్ అనుకుని ఉంటాడు. సో.. కథ పరంగా కొత్తదనం లేకపోవడం ఓ డిస్పాయింట్ మెంట్. అలాగే, టూ మెనీ ట్విస్ట్స్ తో కథను నడిపించిన తీరు విసుగ్గా ఉంటుంది.సో.. దర్శకుడిగా హరీష్ పనితీరు అభినందనీయం కాదు. కాకపోతే, డైలాగ్స్ మాత్రం బాగా రాశాడు. పంచ్ డైలాగ్స్ అలరించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రధాన లోపం స్ర్కీన్ ప్లే అనొచ్చు. పాటలు కూడా మామూలుగా ఉన్నాయి. 'గువ్వా గోరింక..' ఆల్రెడీ హిట్ సాంగ్ కాబట్టి, ఆ పాట వచ్చినప్పుడు రిలీఫ్ గా ఉంటుంది. రాంప్రసాద్ కెమెరా పనితనం కలర్ ఫుల్ గా ఉంది. కథ ఎంపికలోనే తప్పు జరిగింది కాబట్టి, మిగతా అన్ని శాఖలూ ఎంత మెరుగైన పని తీరు కనబరిచినా ఏం ఉపయోగం ఉంటుంది?


ఫిల్మీబజ్ విశ్లేషణ
వాస్తవానికి ఈ సినిమా కథను సాయిధరమ్ కి చెప్పేటప్పుడు 'నన్నో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనుకోవద్దు.. ఫ్లాప్ డైరెక్టర్ అనుకునే కథ విను' అని హరీష్ శంకర్ అన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పాడు. అంత హింట్ ఇచ్చినా సాయిధరమ్ నమ్మి, ఈ సినిమా చేశాడు. ఒక ఆర్టిస్ట్ గా ఎంత కష్టపడాలో అంతా పడ్డాడు. దర్శకుడు ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ కాగల కెపాసిటీ సాయిధరమ్ కి ఉంది. సరైన కథతో హరీష్ సినిమా తీసి ఉంటే, సాయిధరమ్ ని వంద శాతం వాడుకున్నట్లు అయ్యుండేది. సాయిధరమ్, రెజీనా కెమిస్ర్టీ బాగుంది. కామెడీ బాగుంది. డైలాగ్స్ సూపర్బ్.
పాత కథ, సెకండాఫ్ కథ నడపడానికే అన్నట్లుగా లాగే సన్నివేశాలు, విసుగు పుట్టించే ప్రీ క్లయిమ్యాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన లోపాలు. ఫస్టాప్ ఫర్వాలేదనుకున్న ప్రేక్షకులకు సెకండాఫ్ అంతగా అలరించదు. చదువుకోవాలనే ఆశయంతో అమెరికా రావాలనుకున్నానని హీరో దగ్గర హీరోయిన్ చెబుతుంది. ప్రేమించినవాడితో పెళ్లి చేయలేదంటూ ఇంటి నుంచి పారిపోయినట్లుగా ఇంట్లో సన్నివేశాలు ఉంటాయి. చదువే తన లక్ష్యం అన్నది బలంగా కన్వే కాదు. వినోద ప్రధానంగా తీసుకెళ్లాలనే ధ్యేయంతో కామెడీ ట్రాక్స్ బోల్డన్ని పెట్టడంతో లెంగ్తీ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలా అనిపించిన ఏ సినిమా టికెట్ అయినా సేల్ కావడం కొంచెం కష్టమే. అలాగే సినిమాలో ఇచ్చిన ఏ ట్విస్ట్ కూడా బలంగా లేదు.


ఫైనల్ గా చెప్పాలంటే.. 'ట్రావెల్ ఏజెంట్లు ఇండియాకి ఎన్ని టికెట్స్ కొంటే అంత డిస్కౌంట్ ఇస్తారట' అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ని కొంచెం మార్చి.. 'డిస్కౌంట్ లో టికెట్స్ సేల్ చేయబడును' అని థియేటర్లో బోర్డ్ పెడితే, కొంచెం ఉపయోగం ఉంటుందేమో.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !