View

గ్రాండ్ గా 'రామబాణం' ఫ్రీ రిలీజ్ వేడుక 

Monday,May01st,2023, 04:01 PM

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో à°ˆ చిత్రం రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న à°ˆ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ స్వరకర్త. మే 5à°¨ à°ˆ సినిమా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే à°ˆ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని à°ˆ వేసవిలో అసలుసిసలైన వినోదాన్ని పంచడానికి à°ˆ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ నేపథ్యంలో తాజాగా à°ˆ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. సినీ ప్రముఖుల సమక్షంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో à°ˆ వేడుక ఎంతో వైభవంగా జరిగింది.


కథానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. "ముందుగా ఇంత మంచి కథ ఇచ్చిన భూపతిరాజా గారికి ధన్యవాదాలు. కమర్షియల్ ఫార్మాట్ లో ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో ఈ కథ అంత బాగుంటుంది. ఈ కథని వాసు అద్భుతంగా తెరకెక్కించారు. మా గత చిత్రాలు లక్ష్యం, లౌక్యం సినిమాల మాదిరిగానే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్ని ఉంటాయి. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు చాలా మంచి నిర్మాతలు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇది ఎందుకు అని అడగలేదు. చాలా పాజిటివ్ పీపుల్. ఇలాంటి మంచి మనసున్న వారికి అంతా మంచే జరగాలి. ఖచ్చితంగా రామబాణం మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. రామబాణం టైటిల్ పెట్టిన బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆయన టైటిల్ పెట్టినప్పటి నుంచి సినిమా చాలా పాజిటివ్ గా దూసుకెళ్తుంది. సినిమా రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి పని చేసిన తోటి నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. డింపుల్ చాలా బాగా చేసింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి, ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే జగపతిబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. లక్ష్యం తర్వాత మళ్ళీ అన్నదమ్ములుగా చేశాం. ఆయనతో సినిమా చేస్తే ఓ నటుడితో చేసినట్టు అనిపించదు.. సొంత అన్నతో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే మా మధ్య ఎమోషన్స్ ఎంతగానో పండాయి. కుష్బూ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా మీ అందరినీ ఖచ్చితంగా అలరిస్తుంది." అన్నారు.


కథానాయిక డింపుల్ హయతి మాట్లాడుతూ.. "మిక్కీ జె.మేయర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన పాటలకు నేను డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వెట్రి పళని స్వామి గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. జగపతిబాబు గారు, కుష్బూ గారు, అలీ గారు, వెన్నెల కిషోర్ గారు వీరందితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఖిలాడీ విడుదల కాకముందే శ్రీవాస్ గారు నన్ను à°ˆ సినిమాకి ఎంపిక చేశారు. ఆయన ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి చెప్పాలి. ధమాకా సమయంలో నేను ఇంత మంచి మనుషులను చూడలేదని రవితేజ గారు చెప్పారు. నేను ప్రొడక్షన్ లోకి వచ్చాక తెలిసింది వాళ్ళు à°Žà°‚à°¤ మంచివారో. ఏదైనా సమస్య విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు కుటుంబసభ్యుల్లా à°…à°‚à°¡à°—à°¾ ఉంటారు. నేను వీరి ప్రొడక్షన్ లో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. మాచో స్టార్ పంచెకట్టులో బాగున్నారు. రణం, యజ్ఞం రోజుల్లో ఉండే గోపీచంద్ గారు గుర్తుకొస్తున్నారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ à°—à°¾ ఉంది. ఆయనంత జెంటిల్ మన్ ఎవరూ ఉండరు. డౌన్ టు ఎర్త్ ఉంటారు. మే 5à°¨ మీ ఫ్యామిలీతో వెళ్లి మా రామబాణం సినిమా చూడండి. అందరికీ నచ్చుతుంది" అన్నారు.  


చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. "నిర్మాతలు విశ్వ గారు, వివేక్ గారు, నా లక్కీ హీరో గోపీచంద్ గారు.. వీళ్ళందరూ ఎప్పుడూ చాలా పాజిటివ్ గా ఉంటారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. హ్యాట్రిక్ కాంబినేషన్ అనేది మాకు మైండ్ లో తిరుగుతూ ఉంది. అది మాకు కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. అలాగే ఇంకా బాగా చేయాలనే సంకల్పాన్ని ఇచ్చింది. భూపతిరాజా గారు అద్భుతమైన కథ అందించారు. రైటింగ్ టీం అంతా కలిసి ఎంటెర్టైనమెంట్, ఎమోషన్స్ కలగలిపి ఓ మంచి స్క్రిప్ట్ ని రూపొందించాం. ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఒక మంచి అనుభూతి కలిగింది. ఈ సినిమాకి గోపీచంద్ గారు, జగపతి బాబు గారు రెండు పిల్లర్స్. వాళ్ళు నిజంగానే అన్నదమ్ముల్లా ఉంటారు. ఇద్దరూ ఎమోషన్స్ అద్భుతంగా పండించారు. ఇది మా లక్ష్యం, లౌక్యం సినిమాలను మించి పెద్ద హిట్ కావాలి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. గోపీచంద్ గారికి, నాకు మా కెరీర్స్ లో బిగెస్ట్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి పని చేసిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ఇది ఫ్యామిలీ సినిమా.. అదే సమయంలో గోపీచంద్ గారి అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది." అన్నారు.


సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. "మేము మంచి సినిమా తీశాం. మా సినిమాకి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.


రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. " ఈ వేడుకలో ఉన్న ఎనర్జీ చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ కి సౌండ్ ఎక్కువ. గోపీచంద్ గారి సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకు నేను రావడం ఒక పాజిటివ్ సెంటిమెంట్. విశ్వ గారు, వివేక్ గారు, శ్రీవాస్ గారు, గోపీచంద్ గారి కోసం.. వారు కలిసి చేసిన సినిమా కోసం వచ్చాను. రామబాణం అంటే ఒక ఆయుధం మాత్రమే కాదు.. అదొక గురి. భూపతిరాజా రాజా గారు, మధు, అబ్బూరి రవి ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి సంధించిన బాణమే గోపీచంద్ గారు. గోపీచంద్ గారి నటనను మనం సహానుభూతి పొందుతాం. ఆయన కామెడీని ఎంజాయ్ చేస్తాం.. ఆయన సెంటిమెంట్ డైలాగ్ చెప్తే మన కళ్ళ వెంట నీళ్లొస్తాయి. ఆయనలో ఉన్న నిజాయితీ.. ఆయన నటనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సిన్సియర్ యాక్టర్ గోపీచంద్ గారు. ఆయనతో పాటు ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ లో రామబాణం గుర్తుండిపోయే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు మారుతి "ఈ కథ విన్నప్పుడే గోపీచంద్ గారు చెప్పారు. భూపతిరాజా గారు ఒక కథ చెప్పారు.. చాలా బాగుంది, మంచి ఎమోషనల్ స్టోరీ అన్నారు. మొన్న ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనిపించింది. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. ఈ సమ్మర్ లో ఒక మంచి ఎంటర్టైనర్ ఫిల్మ్. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న పీపుల్ మీడియా ఖాతాలో మరో విజయం నమోదు కావాలని కోరుకుంటూ.. శ్రీవాస్ గారికి, మిగతా టీం అందరికి ఆల్ ది బెస్ట్" అన్నారు.


దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. "గోపీచంద్ గారి సినిమా ఫంక్షన్ కి వస్తే నా సొంత సినిమా ఫంక్షన్ కి వచ్చినట్లే ఉంటుంది. ఆయన ఆరడుగుల బుల్లెట్ కాదు.. ఆరడుగుల బంగారం. ఈరోజుల్లో ఇలాంటి హీరోలు ఉండటం.. మా లాంటి దర్శకులకు అదృష్టం. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు.. వి అండ్ వి.. రెండు విక్టరీలు కలిసినట్టుగా కలిశారు. పీపుల్స్ మీడియా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సంచలనం. మీకు ఇంకో సంచలన విజయం రావాలని కోరుకుంటున్నాను. శ్రీవాస్ గారి 'లక్ష్యం' సినిమా.. నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ అందుకోవాలని ఆశిస్తున్నాను. మూవీ టీం అందరికి ఆల్ ది బెస్ట్" అన్నారు.


నటుడు అలీ మాట్లాడుతూ.. " మా నిర్మాత లక్ష్మీపుత్రుడు. మా దర్శకుడు సరస్వతీపుత్రుడు. మా హీరో రామబాణంలో ఎంత పవర్ ఉంటుందో.. అంత పవర్ ఉన్న మాచో స్టార్ గోపీచంద్. ఆయనను అందరూ ఇష్టపడతారు. ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఏ ప్రొడక్ట్ తయారైనా కూడా అది చాలా పవర్ ఫుల్. మొన్న కార్తికేయ-2, తర్వాత ధమాకా, ఇప్పుడు రామబాణం. మే 5 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, అద్భుతమైన కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.


నటుడు సప్తగిరి మాట్లాడుతూ.. "లౌక్యంతో ఆలోచించి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వదిలిన బాణం.. రామబాణం. గోపీచంద్ గారితో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమాతో గోపీచంద్ గారు, శ్రీవాస్ గారు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మే 5 న థియేటర్లకు వెళ్లి రామబాణం చూడండి. మిమ్మల్ని అసలు కొంచెం కూడా నిరాశపర్చదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కుటుంబ కథా చిత్రం రాలేదు. మీ తల్లిదండ్రులతో కలిసి ఈ సినిమాకి వెళ్ళండి. ఎంతో సంతోషంగా థియేటర్ నుండి బయటకు వస్తారు" అన్నారు.


కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ.. "ఇది మన కథ. మన కుటుంబ కథ. ఈ సినిమాలో గోపీచంద్ గారి పాత్ర, జగపతి బాబు గారి పాత్ర చాలా కీలకం. గోపీచంద్ గారు బెంగాల్ టైగర్ లా కనిపిస్తారు. ఈ తరంలో కుటుంబ కథలు, సెంటిమెంట్ కథలు ఎవరు చూస్తారని కొందరు అంటుంటారు. ఎమోషన్స్ ఎప్పటికీ మారవు. కుటుంబ కథలను అప్పుడూ ఆదరించారు, ఇప్పుడూ ఆదరిస్తారు. గోపీచంద్ గారికి ఒకేసారి ఈ కథ చెప్పాను. రెండో సారి కథ గురించి చర్చించడానికి వెళ్ళినప్పుడు ఒక చోట నేను తడబడితే.. ఆయన కథ మొత్తం చెప్పేసారు. అంతలా ఆయన కథని ఓన్ చేసుకున్నారు. నేను ఇప్పటిదాకా ఎందరో దర్శకులతో పని చేశాను. అయితే శ్రీవాస్ గారిలో ఓ ప్రత్యేకత ఉంది. ఆయన ఎమోషన్, యాక్షన్ దేన్నయినా డీల్ చేయగలరు. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్ అన్నీఉంటాయి. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారి సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది" అన్నారు.


స్క్రీన్ ప్లే రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. "ఎమోషన్ పాత పడదు. భయం, బాధ, ధైర్యం ఇవన్నీ కోర్ ఎమోషన్స్. వీటిని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు. బాధ వచ్చినా, కోపమొచ్చినా, భయమేసినా చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే గోపీచంద్ గారు ఈ సినిమాలో. మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిని భయపెట్టే ఒక మనిషి కావాలి.. ఆ మనిషే గోపీచంద్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్ గారికి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు. సరస్వతిని గౌరవించే వారికి లక్ష్మి వస్తుంది. పీపుల్స్ మీడియా సరస్వతిని గౌరవిస్తూనే ఉంది.. ఆ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలా రన్ అవుతూనే ఉంటుంది. విశ్వప్రసాద్ గారికి వివేక్ గారి మీద ఉన్న నమ్మకం ఈ బ్యానర్ ని నిలబెడుతుంది. అలాగే వివేక్ గారికి విశ్వప్రసాద్ గారి మీదున్న గౌరవం ఈ బ్యానర్ ని నిలబెడుతుంది." అన్నారు.


రచయిత మధు మాట్లాడుతూ.. "అన్నదమ్ముల మధ్య గొడవలు, చిన్న చిన్న మాట పట్టింపులు సహజం. అయితే అసలు గొడవే పడని అన్నదమ్ముళ్లను నేను చేశాను. శ్రీవాస్ గారు, ఆయన అన్నయ్య గారు. శ్రీవాస్ గారు ఆయన అన్నయ్యకి ఎంతో గౌరవం ఇస్తారు. అలాగే గోపీచంద్ గారు కూడా. ఆయన అన్నయ్య గారు ఇప్పుడు మన మధ్య లేరు. చిన్నప్పుడు తన అన్నయ్య గారి వల్ల అనుకోకుండా ఆయన ముక్కుపై గాటు పడింది. ఆయన ఇంత పెద్ద హీరో అయినా కూడా ఆ గాటుని అలాగే ఉంచుకున్నారు. అంటే అన్నయ్య జ్ఞాపకాలను తనతోనే పదిలంగా దాచుకున్నారు అన్నమాట. అన్న అనే బంధానికి అంత విలువ ఇచ్చే శ్రీవాస్ గారు, గోపీచంద్ గారు కలిసి సినిమా చేస్తే లక్ష్యం అయింది. మళ్ళీ రెండో సారి అదే అన్నదమ్ముల కథతో సినిమా తీస్తే ఆ లక్ష్యాన్ని ఛేదించే రామబాణం అయింది. మే 5 న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన ఎమోషనల్ సినిమా ఇది" అన్నారు.


గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "ఈ వేడుక చూస్తుంటే పండుగ వాతావరణంలా ఉంది. సినిమా కూడా అలాగే ఉండబోతోంది. రీరికార్డింగ్ చేస్తూ మిక్కీ జె.మేయర్ గారు ఈ సినిమా పట్ల చాలా సంతృప్తికరంగా మాట్లాడారు. అలాగే రచయిత అబ్బూరి రవి గారు కూడా ఈ సినిమాకి పని చేశారు. ఆయన కూడా ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. నాకు ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. రామబాణానికి తిరుగులేదు.. అలాగే ఈ రామబాణానికి కూడా తిరుగులేదు. భారతీయ సమాజానికి మూలాధారమైన విషయం కుటుంబ వ్యవస్థ. మన మానవ సంబంధాలు, మన ఆత్మీయ అనుబంధాలు, ముఖ్యంగా అన్నదమ్ముల అనుబంధం.. అలాంటి ఒక పాయింట్ ని ఈరోజుల్లో తీసుకొని కమర్షియల్ గా చెప్పాలనుకోవడం శ్రీవాస్ గారి యొక్క మంచి మనసుకి తార్కాణం. అలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న పీపుల్ మీడియా సంస్థ మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాను. గోపీచంద్ గారు సౌజన్యమూర్తి. చక్కగా మాట్లాడతారు. ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.


గీత రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ.. "మనం ఇష్టపడేవాళ్లు చాలామంది ఉంటారు. మనల్ని ఇష్టపడే హీరో, డైరెక్టర్ దొరికితే.. అది రామబాణం సినిమాకి పని చేయడం లాంటిది. నాకు గోపీచంద్ గారితో, శ్రీవాస్ గారితో ఎంతో అనుబంధముంది. వారిద్దరూ నాచేత మోనాలిసా పాట రాయించినందుకు ధన్యవాదాలు. గీత రచయితలకు సినిమా పట్ల అవగాహన గలిగించి, మంచి పాటలు రాబట్టుకోవడం శ్రీవాస్ గారి శైలి. ఈ సినిమాలో పాటలన్నీ బాగున్నాయి. నా ఈ అవకాశం ఇచ్చిన పీపుల్ మీడియా బ్యానర్ కి, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ గారికి నా ధన్యవాదాలు" అన్నారు.


సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సునీల్ నారంగ్, అభిషేక్ అగర్వాల్, రాధామోహన్, ప్రసన్న కుమార్, దర్శకుడు కార్తీక్ దండు, రచయిత వెలిగొండ శ్రీనివాస్, నటులు కాశి విశ్వనాథ్, సమీర్, తరుణ్ అరోరా, నాగ మహేష్, నటి సోనియా తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర సాంకేతిక బృందం
దర్శకుడు: శ్రీవాస్
నిర్మాతలు: టి.జి. విశ్వ ప్రసాద్,
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జే మేయర్
డీఓపీ: వెట్రి పళని స్వామి
కథ: భూపతి రాజా
డైలాగ్స్: మధుసూధన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్, వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !