View

సుహాస్ చేతుల మీదుగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో థర్డ్ సాంగ్ లాంచ్

Thursday,May18th,2023, 02:13 PM

పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వంలో.. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు లావణ్య జంటగా నటించిన సినిమా. గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ తోపాటు రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు సుహాస్ చేతుల మీదుగా మరో పాటను విడుదల చేశారు.


ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. "అన్నపూర్ణ ఫోటో స్టూడియో నుంచి పాట లాంచ్ చేశాం. నా చేతుల మీదుగా ఒక పాట విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. పాట చాలా బావుంది. తక్కువ బడ్జెట్ అయినా.. హై క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. హీరో చైతన్య, చెందు ముద్దుతో పాటు మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.."  అలాగే నిర్మాత యష్ గారికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.


దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. " వాల్యూబుల్ టైమ్ ఇచ్చి మా పాట విడుదల చేసి సుహాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో మొదటగా వచ్చే పాట ఇది. సినిమాలో ఊరికీ ఓ పాత్ర ఉంటుంది. ఆ ఊరి పాత్రను ఎస్టాబ్లిష్‌ చేస్తూ సాగే పాట ఇది. ఆ ఊరు ఎలాంటిది.. అక్కడి మనుషులు ఎలాంటివాళ్లు అనేది ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు ప్రిన్స్ హెన్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ ట్యూన్ కు తగ్గట్టుగా మంచి లిరిక్స్ ఇచ్చాడు శ్రీనివాస్ మౌళి. పంకజ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది మా నిర్మాత యష్ గారికి చాలా థాంక్స్ అన్నారు.


హీరో చైతన్య రావు మాట్లాడుతూ... " మా సినిమాలో మొదటగా వచ్చే ఈ పాట సుహాస్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మేమిద్దరం చాలాకాలంగా ఫ్రెండ్స్. తను నటించిన అంబాజీ పేట పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సుహాస్ కు థ్యాంక్స్. ఈ పాటను మౌళిగారు అద్భుతంగా రాశారు. మంచి ట్యూన్ కుదిరింది.అందరికీ థ్యాంక్యూ సో మచ్ అలాగే మా యష్ గారు ప్రమోషన్స్ బాగా ప్లాన్ చేసారు  అన్నారు.


హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. " అన్నపూర్ణ ఫోటో స్టూడియోనుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ చేసినందుకు సుహాస్ గారికి థ్యాంక్స్. ఇంతకు ముందు వచ్చిన రెండు పాటలను బాగా ఆదరించారు. అలాగే ఈ పాట కూడా మీ అందరికీ అంతే బాగా నచ్చుతుంది. ఒక మంచి ట్యూన్ కు తగ్గట్టుగానే మంచి లిరిక్స్ కూడా కుదిరాయి. డివోపి పంకజ్ గారు, డైరెక్టర్ చందు మరియు నిర్మాత యష్ గారికి థ్యాంక్స్ యూ.." అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ.. " పాట విడుదల చేసిన సుహాస్ గారికి థ్యాంక్యూ. ఒక మంచి అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ గారికి థ్యాంక్యూ. మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే పాట ఇది.అలాగని రెగ్యులర్ ఫోక్ సాంగ్ లా ఉండదు. అందుకు తగ్గట్టుగా మౌళిగారు మంచి సాహిత్యం రాశారు. సాయి చరణ్‌ అంతే బాగా పాడారు. అన్ని రకాలుగా ది బెస్ట్ ఇచ్చాం. మీరు విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.." అన్నారు.


లిరిసిస్ట్ శ్రీనివాస మౌళి మాట్లాడుతూ.. " ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. ఇందుకు చెందుగారికి థ్యాంక్స్. నిర్మాత యశ్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. దర్శకుడు చెప్పినదాన్ని బట్టి సినిమాలో ఊరు కూడా ఒక పాత్ర. అందుకు తగ్గట్టుగా ఊరు జాగ్రఫీ, విజువల్స్ ఉండాలి.. కథ గురించి చిన్న గ్లింప్స్ కూడా ఉండాలన్నారు. పాటలో మొదటి లైన్ కే ఆయన సంతోషించారు. తర్వాత మంచి మంచి పోలికలతో ఈ పాటను చేశాం.." అన్నారు.


సినిమాటోగ్రాఫర్ పంకజ్ మాట్లాడుతూ.. "ఈ పాటలోని సాహిత్యాన్నిబట్టి చూస్తే దీన్ని సుహాసే విడుదల చేయాలి. పాట ఎంత అందంగా ఉందో.. సుహాస్ మనసూ అంతే అందంగా ఉంటుంది. ఇక ఈ సాంగ్ పిక్చరైజ్ చేయడానికి చాలా లొకేషన్స్ తిరిగాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.

 

ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలో


నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు.


సాంకేతిక నిపుణులు : సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !