View

బ్లాక్ బస్టర్ మీట్ లో 'సర్కారు వారి పాట' టీమ్

Thursday,May12th,2022, 02:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు ప్రీమియర్ షో నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా వుంది. సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం  సృష్టించారు'' అన్నారు దర్శకుడు పరశురాం. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా  నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్  మీట్ నిర్వహించింది. దర్శకుడు పరశురాంతో పాటు  నిర్మాతలు  నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మీట్ లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. మొదటి ఆట నుండే  సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ , క్లాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు సర్కారు వారి పాట నచ్చింది. మహేష్ బాబు గారితో సర్కారు వారి పాట లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా అయితే బావుంటుదని బలంగా నమ్మి సెట్స్ కి వెళ్ళడం జరిగిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. మార్నింగ్ షో నుండి కొనసాగుతున్న ప్రభంజనం అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇంకా బలంగా తాకుతుందని నమ్ముతున్నాను. సర్కారు వారి పాట దేశం ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐ తో ఇబ్బంది పడని మిడిల్ క్లాస్ మనిషి వుండరు. అలాంటి పాయింట్ ని మహేష్ బాబు గారి లాంటి సూపర్ స్టార్ తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. ఇలాంటి కథ రాయడం రచయిత, దర్శకుడిగా నాకూ ఒక తృప్తిని ఇచ్చింది. సర్కారు వారి పాటని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు '' అన్నారు పరశురామ్


నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా అద్భుతంగా వుందని సందేషాలు పంపుతున్నారు. ఇంత ఘన విజయం ఇచ్చిన మా హీరో  సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, దర్శకుడు పరశురామ్ గారి చాలా కృతజ్ఞతలు. 2020లో ప్రాజెక్ట్ అనుకున్నాం. తర్వాత ప్యాండమిక్ వచ్చింది. అయితే ఈ రెండేళ్ళ కష్టం.. సర్కారు వారి పాట కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఒక్కసారిగా ఎగిరిపోయింది. మా బ్యానర్ లో బెస్ట్ రెస్పాన్స్ వచ్చిన మూవీ సర్కారు వారి పాట. సుదర్శన్ లో సినిమా చూశాం. ఫ్యాన్స్ కి సినిమా ఫుల్ మీల్స్ లా వుంది. షో అయిన తర్వాత ఫ్యాన్స్ కేక్  కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. సర్కారు వారి పాట ఫస్ట్ డే నే కాదు..  ఈ రెండు వారాలు  భారీ కలెక్షన్స్ సాధించబోతుంది. యూఎస్ ప్రిమియర్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులన్నీ క్రాస్ చేసింది. అదే స్థాయిలో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి.  ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు


నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ... సర్కారు వారి పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఎంత ఎక్సయిటింగా ఫీలయ్యారో .. సినిమా చూసి అంతకంటే ఎక్కువ ఎక్సయిట్ అయ్యారు. ఈ మధ్య  కాలంలో ఇంత పండగలాంటి సినిమా సర్కారు వారి పాటే. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో సర్కారు వారి పాట లాంటి  పెద్ద సినిమా మళ్ళీ చూడగలమా అంటే సందేహమే. మహేష్ బాబు గారు సర్కారు వారి పాటలో నటన పరంగా విజ్రుభించారు. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి. సర్కారు వారి పాట మేము వూహించినదాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది' అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !