filmybuzz

View

దేవిశ్రీ ప్రసాద్ ఆడియో లాంఛ్ విశేషాలు

Friday,October13th,2017, 08:40 AM

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రం `దేవిశ్రీ ప్ర‌సాద్‌`. పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్‌రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శ్రీ కిషోర్ ద‌ర్శ‌కుడు. డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు.క‌మ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జరిగింది. శివ బాలాజీ బిగ్ సీడీని విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ విడుద‌ల చేయ‌గా, తొలి సీడీని శివ బాలాజీ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా...


శివ బాలాజీ మాట్లాడుతూ - '' ధనరాజ సహా ఈ సినిమాలో నటించిన అందరితో మంచి పరిచయమే ఉంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


నిర్మాత ఆక్రోష్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో డి.వెంకటేష్‌గారు యాడ్‌ కావడం మాకెంతో ప్లస్‌ అయ్యింది. సినిమా పాటలను కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం'' అన్నారు.


ఆర్‌.వి.రాజు మాట్లాడుతూ - ''మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. సినిమాలో ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలుండవు. భూపాల్‌, పూజా రామచంద్రన్‌ సహా అందరికీ మంచి పేరొస్తుంది'' అన్నారు.


పూజా రామచంద్రన్‌ మాట్లాడుతూ - ''చాలా గ్యాప్‌ తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా ఇది. కథ విన్న వెంటనే చేయడానికి అంగీకరించాను. దర్శకుడు శ్రీకిషోర్‌గారు సినిమాను చక్కగా హ్యాండిల్‌ చేశారు. సినిమా సక్సెస్‌ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. కమ్రాన్‌ మంచి సంగీతం, రీరికార్డింగ్‌ అందించారు'' అన్నారు.


మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ - ''కొత్త కాన్సెప్ట్‌ మూవీస్‌ అన్నీ సక్సెస్‌లను సాధిస్తున్నాయి. అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రంలా ఇది కనపడుతుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.


మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు శ్రీ కిషోర్‌తో ఎప్పటి నుండో మంచి అనుబంధం ఉంది. మంచి మిత్రుడు. హాంగ్‌కాంగ్‌లో ఉన్నప్పటికీ శ్రీకిషోర్‌ ఎంతో ప్యాషన్‌తో ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈ సినిమా చేశాడు. కమ్రాన్‌ మ్యూజిక్‌ సినిమాకు పెద్ద ఎసెట్‌ అయ్యింది'' అన్నారు.


భూపాల్‌ మాట్లాడుతూ - ''సినిమా అద్భుతంగా వచ్చింది. మా అమ్మనాన్నలు కూడా ఈ సినిమా చూసి బాగా చేశానని మెచ్చుకున్నారు'' అన్నారు.


మనోజ్‌ నందం మాట్లాడుతూ - ''ప్రేక్షకుల ట్రైలర్‌ చూసి ఏవీ ఊహించుకుంటారో, దానికి భిన్నంగా ఉండ సినిమా. సినిమా చూసిన ప్రేక్షకుడు సంతృప్తితో బయటకు వస్తాడు.


మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమ్రాన్‌ మాట్లాడుతూ - ''అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు


ధనరాజ్‌ మాట్లాడుతూ - ''సినిమాను ముందు నేను లైట్‌గా తీసుకున్నాను. కానీ డైరెక్టర్‌ శ్రీకిషోర్‌గారి డేడికేషన్‌ చూసి పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయ్యాను. పూజా రామచంద్రన్‌ తన నటనతో అందరినీ డామినేట్‌ చేసేసింది. తప్పకుండా సినిమా చూసిన తర్వాత సినిమా ఎంటో ప్రేక్షకుల అర్థమవుతుంది. తప్పకుండా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కమ్రాన్‌ మ్యూజిక్‌, ఫణీంద్ర సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌ అయ్యాయి'' అన్నారు.


నిర్మాత డి.వెంకటేష్‌ మాట్లాడుతూ - ''నేను మహిళలను కించ పరిచే సినిమాలను ఎప్పటికీ తీయను. ముందు నేను ఈ సినిమా నిర్మాతను కాను. కానీ సినిమా పూర్తయిన తర్వాత చూసి నచ్చడంతో సినిమాలో నేను భాగమయ్యాను. శ్రీకిషోర్‌గారు అద్భుతమైన సినిమాను తీశారు'' అన్నారు.


దర్శకుడు శ్రీకిషోర్‌ మాట్లాడుతూ - ''నేను రామ్‌గోపాల్‌గారి వర్మగారి స్ఫూర్తితోనే దర్శకుడినయ్యాను. సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణమైన వ్యక్తుల్లో ధనరాజ్‌ ముందుంటారు. కమ్రాన్‌ సంగీతం, ఫణి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. పూజా రామచంద్రన్‌ కంటే ముందు చాలా మందికి ఈ కథను చెప్పాను. కానీ ఎవరికీ ఈ కథ నచ్చలేదు. పూజ కథ వినగానే చేయడానికి ఒప్పుకుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.


పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః కమ్రాన్‌, కెమెరాః ఫ‌ణీంద్ర వ‌ర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్ర‌మౌళి.ఎం, మాట‌లుః శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః చంద్ర వ‌ట్టికూటి, నిర్మాత‌లుః డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ కిషోర్‌.​Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !