View

ఇంటర్య్వూ - డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి (బాయ్స్ హాస్టల్)

Monday,August21st,2023, 04:38 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి à°ˆ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. బాయ్స్ హాస్టల్ ఆగస్ట్ 26à°¨ విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  


మీ గురించి చెప్పండి ?
నా పేరు నితిన్ కృష్ణమూర్తి. పుట్టి పెరిగింది కర్ణాటక. ఇంజనీరింగ్ చేస్తున్నపుడు సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. లూసియా చిత్రానికి పవన్ కుమార్ గారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. తర్వాత జీ టీవీలో కొన్ని యాడ్స్, ప్రోమోస్ ని డైరెక్ట్ చేశాను. దాదాపు అక్కడ ఏడేళ్ళు పని చేశాను. తర్వాత హాస్టల్ హుడుగారు బేకగిద్దరే కథని రాసి సినిమాగా చేశాను. కన్నడలో ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ గా తెలుగులో విడుదలౌతుంది.


ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమిటి ?
ఈ కథకు యూనివర్సల్ అప్పీల్ వుంది. హాస్టల్స్ ప్రపంచంలో అన్ని చోట్ల వున్నాయి. ఇందులో వున్న పాత్రలు కూడా అందరూ రిలేట్ చేసుకునేలా వుంటాయి. ఈ సినిమా తెలుగు చాలా బాగా వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం వుంది. ఎందుకంటే తెలుగు కర్ణాటక ఒకేరకమైన కల్చర్ ని పంచుకుంటాయి. అలాగే డబ్బింగ్ కూడా తెలుగు నేటివిటీ తగ్గట్టుగా చాలా సహజంగా డబ్ చేశాం.


రమ్య గారి సీన్స్ ని  à°°à°·à±à°®à±€ తో à°°à±€ షూట్ చేయడానికి కారణం ?  
తెలుగులో అందరికీ పరిచయం వున్న పర్శన్ తో à°† పోర్షన్ ని షూట్ చేస్తే బావుంటుందని  à°­à°¾à°µà°¿à°‚చాం. రష్మీ à°ˆ పాత్ర చక్కగా పోషించారు. చాలా హాట్ అండ్ బ్యూటిఫుల్ à°—à°¾ కనిపిస్తారు.   మొదటి పదిహేను నిముషాలు ఆమె à°’à°• టీచర్ à°—à°¾ కనిపిస్తారు. తర్వాత సినిమా అంతా డిఫరెంట్ à°—à°¾ వుంటుంది.  à°†à°®à±† పాత్ర తెరపై మనం చూసి హీరోయిన్స్ అందరికీ à°’à°• ట్రిబ్యూట్ లా వుంటుంది. సినిమా చూస్తున్నపుడు అది మీకే తెలుస్తుంది.  


ఇందులో చాలా పాత్రలు వున్నాయి కదా ?
అవును.. దాదాపు ఐదు వందలకు పైగా నటీనటులు కనిపిస్తారు. 120 పాత్రలకు డైలాగులు వుంటాయి. అందరూ చాలా చక్కగా నటించారు.నాకు చాలా మంచి టీం వుంది. మంచి టీం వర్క్ తో అందరినీ బ్యాలెన్స్ చేశాం.


పునీత్ రాజ్ కుమార్  à°—ారిని ఎలా కలిశారు ?
పోస్టర్ రిలీజ్ కోసం పునీత్ రాజ్ కుమార్  à°—ారిని కలిశాం. మేము అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం పోస్టర్ బాలేదని ఆయన మా మొహం మీదే తిట్టాలి. కానీ దానికి ఆయన అంగీకరించలేదు. రెండోసారి ఆయన ఇంటికి వెళ్లి కన్వెన్స్ చేశాం. à°ˆ సారి వీడియో కూడా బావొచ్చింది. అప్పుడే ఆయనకి సినిమా ఫుటేజ్ ని చూపించాం.’’  à°šà°¾à°²à°¾ మంది నటీనటులు వున్నారు కదా సౌండ్ విషయంలో జాగ్రత్త తీసుకోండని’’ సూచించారు. ఆయన ఆశీస్సులు మాకు దొరికాయి.


తరుణ్ భాస్కర్ గారి పాత్ర గురించి
తరుణ్ భాస్కర్ గారి పాత్ర కూడా చాలా ఆసక్తి à°•à°°à°‚à°—à°¾ వుంటుంది. చాలా ఫన్  à°µà±à°‚టుంది. అలాంటి పాత్రని ఇప్పటివరకూ ఆయన చేయలేదు. ఆయన పోర్షన్ చాలా హిలేరియస్ à°—à°¾ వచ్చింది.


ఇందులో వార్డెన్ ది కీలక పాత్రనా ?
ఇందులో ఆయన ఆయన పాత్ర కీలకం. ఆయన కారణంగానే ఈ కథ జరుగుతుంది. అది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది.


ఈ సినిమా తెలుగులో వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారా ?
à°ˆ సినిమా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తుందనే నమ్మకం వుంది. కొన్ని రోజులు క్రితం కొంత మంది ఆడియన్స్ à°•à°¿ చూపించాం. చూసిన వారంతా చాలా ఎంజాయ్ చేశారు. ఇది డబ్బింగ్ సినిమాలా అనిపించదు. చాయ్ బిస్కెట్ టీం, మేము రిరైటింగ్ చేశాం. డబ్బింగ్  à°µà°¾à°¯à°¿à°¸à±†à°¸à± కూడా చాలా సహజంగా వుంటాయి. ప్రేక్షకులకు ఫ్రెష్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది . `


రిషబ్ శెట్టి పాత్ర ఎలా వుంటుంది ?
రిషబ్ శెట్టి పాత్ర  à°šà°¾à°²à°¾ ఎక్సయిటింగ్ à°—à°¾ వుంటుంది. ఇందులో హాస్టల్ లో చదువుకున్న పూర్వ విద్యార్ధిగా కనిపిస్తారు. à°ˆ కథలో ఆయన పాత్ర ఊహతీతంగా వుంటుంది. ఇందులో ఆయన ఐదు నిమిషాల సీన్ ని సింగల్ టేక్ లో చేశారు.  à°…లాగే పవన్ గారి పాత్ర కూడా ఇంట్రెస్టింగ్  à°—à°¾  వుంటుంది.


తెలుగు పరిశ్రమ, ప్రజలపై మీ అభిప్రాయం ?
నేను బెంగళూరు లో తెలుగు ప్రజలు ఎక్కువగా నివాసం వున్న చోటే వుంటాను. దాదాపు నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది తెలుగే. కల్చర్, ఆహారపు అలవాట్లు దాదాపు ఒకేలా వుంటాయి.  à°‡à°•à±à°•à°¡à°¿ ప్రేక్షకులకు సినిమా అంటే చాలా ఇష్టం. అది నాకు చాలా నచ్చుతుంది.


ఈ సినిమాని తెలుగులో విడుదల చేయాలనే ఆలోచన ఎవరిది. చాయ్ బిస్కట్ ద్వారా విడుదల చేయడానికి కారణం
శరత్ , అనురాగ్ à°ˆ సినిమాని కన్నడలో చూశారు. వారికి చాలా నచ్చింది. à°’à°• కామన్ ఫ్రండ్ ద్వారా కలిశాం. చాయ్ బిస్కట్ మా సొంత టీంలానే అనిపించింది. మా ఆలోచనలు కలిశాయి.  à°¡à°¬à±à°¬à°¿à°‚గ్ విషయంలో చాయ్ బిస్కెట్ టీం చాలా శ్రద్ధ తీసుకున్నారు. à°ˆ సినిమా చూస్తున్నపుడు అది మీకు అర్ధమౌతుంది.


ఎడిటింగ్ లో మార్పులు చేశారా ?
అదే ఎడిటింగ్ వుంటుంది. సురేష్ అద్భుతంగా ఎడిట్ చేశారు. ఇందులో ప్రతి షాట్ ని ఒకటి సింగల్ టేక్ , మరొకటి కట్ షాట్ గా తీశాం . సినిమా చూస్తున్నపుడు అది మీకు తెలుస్తుంది. కట్స్ చాలా ప్రత్యేకంగా వుంటాయి.


ఇందులో మీకు దగ్గరగా వుండే పాత్ర ఏది ?
చాలా పాత్రలు దగ్గరగా వుంటాయి. నేను కూడా ఇందులో ఒక పాత్ర చేశాను. ప్రతి పాత్ర మన పక్కింటి కుర్రాడిలా వుంటుంది.


మీరు, మీ స్నేహితులు కలసి ఈ సినిమాని నిర్మించడానికి కారణం ?
ఈ సినిమా స్ట్రక్చర్ చాలా ప్రయోగాత్మకంగా వుంటుంది. మరొకరి డబ్బుని రిస్క్ లో పెట్టాలని అనుకోలేదు. నేను ,వరుణ్ ,ప్రజ్వల్ ,అరవింద్ కలసి నిర్మించాలని అనుకున్నాం. మేమే ఆ రిస్క్ తీసుకోవాలని అనుకున్నాం. షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత రక్షిత్ గారి పరంవా సంస్థ ఆసక్తిని చూపించారు. తర్వాత అన్నీ కలిసొచ్చాయి.


మిగతా భాషల్లో కూడా విడుదల చేస్తారా ?
ప్రస్తుతం మా దృష్టి తెలుగు పైనే వుంది.


మ్యూజిక్ గురించి ?
కాంతార, విరూపాక్ష చిత్రాలతో ఆకట్టుకున్న జనీష్ లోక్‌నాథ్ à°ˆ చిత్రానికి మ్యూజిక్ చేశారు.  à°ˆ సినిమా చూసి మొదట ఇందులో మ్యూజిక్ à°•à°¿ స్కోప్ లేదు చాలా డైలాగ్స్ వున్నాయని అన్నారు. ఐతే దాన్ని à°’à°• సవాల్ à°—à°¾ తీసుకొని à°’à°• మ్యూజికల్ ఫిల్మ్ à°—à°¾ మార్చారు. ప్రొటెస్ట్ సాంగ్ à°•à°¿ తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో పాట కూడా విడుదల చేస్తున్నాం.


అన్నపూర్ణ స్టూడియోస్ గురించి ?
అన్నపూర్ణ స్టూడియోస్ లెజెండరీ ప్రొడక్షన్ హౌస్. నా చిన్నప్పటినుంచి అన్నపూర్ణ స్టూడియోస్ గురించి వింటున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్ తో అసోసియేట్ అవుతున్నామని శరత్ గారు చెప్పినప్పుడు చాలా అనందంగా అనిపించింది. సుప్రియ గారు చాలా సపోర్ట్ చేశారు.  à°…న్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ లాంటి సంస్థల ద్వారా తెలుగులోకి రావడం అనందంగా వుంది.


తెలుగు సినిమాలు చూస్తుంటారా ?
చిన్నప్పటినుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఠామేస్త్రి సినిమా రిలీజ్ సమయంలో పోలీసు దెబ్బలు కూడా తిన్నాను. కాలేజ్ డేస్ లో ‘అతడు’ సినిమా చాలా ఇష్టం. కేరాఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు, à°ˆ నగరానికి ఏమైంది.. ఇలా దాదాపుగా ప్రతి తెలుగు సినిమా చూస్తాను.


తెలుగులో సినిమా అవకాశం వస్తే ఎవరితో దర్శకత్వం చేయాలనుకుంటారు ?
అవకాశం వస్తే.. బాలకృష్ణ గారితో సినిమా చేయడానికి ఇష్టపడతాను.  


కొత్త ప్రాజెక్ట్స్ గురించి ? ఏ జోనర్ ఇష్టం ?
కొన్ని ఆలోచనలు వున్నాయి. రాస్తున్నాను. అన్ని జోనర్స్ ఇష్టం. ఐతే చేసిన జోనర్ మళ్ళీ రిపీట్ చేయాలనుకోను.


ఆల్ ది బెస్ట్
థాంక్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !