View

హైదరాబాద్ లో మ‌ధ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ 13న విడుదల

Wednesday,March11th,2020, 11:16 AM

26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్ణా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో ఇందిరా బ‌స‌వ నిర్మించిన ఈ చిత్రం మార్చి 13న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో...


సినిమాటోగ్రాఫ‌ర్ అభిరాజ్ మాట్లాడుతూ - ‘‘నా క‌ల నిజ‌మైన స‌మ‌య‌మిది. సాధార‌ణంగా ఓ లేడీ డైరెక్ట‌ర్‌తో సినిమా అన‌గానే రొమాంటిక్ ల‌వ్ కామెడీ సినిమా అని ఎవ‌రైనా అనుకుంటారు. అయితే శ్రీవిద్య థ్రిల్ల‌ర్ సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చారు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంది’’ అన్నారు. 


మ్యూజిక్ డైరెక్ట‌ర్ నరేశ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ - ‘‘శ్రీవిధ్య‌, ఆమె త‌ల్లిగారు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొని ధైర్యంగా నిల‌బ‌డ్డారు కాబ‌ట్టే.. మేమంద‌రం ఈ రోజు ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాం. హ‌రీశ్ శంక‌ర్‌గారికి, న‌వ‌దీప్‌గారి, మ‌హేశ్ కొనేరుగారికి థాంక్స్‌. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌’’ అన్నారు. 


చాందిని చౌద‌రి మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా శ్రీవిద్య చేయాల‌నుకున్న‌ప్పుడు.. ఆమె త‌ల్లిగారు ఇందిర ఇచ్చిన ఎమోష‌న్ స‌పోర్ట్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఈ సినిమాలో వ‌ర్క్ చేసిన చాలా మందితో నాకు మంచి అనుబంధం ఉంది. త్రిష్ణా అద్భుతంగా న‌టించింది. శ్రీవిద్య జ‌ర్నీ గురించి నాకు తెలుసు. త‌ను ఈ స్థానాన్ని చేరుకోడానికి చాలా క‌ష్ట‌ప‌డింది. ఎంటైర్ యూనిట్‌కు కంగ్రాట్స్‌’’ అన్నారు. 


రాహుల్ మాట్లాడుతూ - ‘‘శ్రీవిద్య నాకు టైటిల్ చెప్ప‌గానే అర్థం కాలేదు. నాకు తెలిసినంత వ‌ర‌కు సినిమాల‌పై విద్య‌కి ఉన్న పిచ్చే ఈ సినిమా అని చెప్ప‌గ‌ల‌ను. నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరిస్తూ అన్నీ డిపార్ట్‌మెంట్స్‌ను చ‌క్క‌గా హ్యాండిల్ చేసింది. లిమిటెడ్ బ‌డ్జెట్‌లో మంచి ఔట్‌పుట్ రాబ‌ట్టుకుంది. త్రిష్ణా డేడికేష‌న్ ఉన్న యాక్ట‌ర్‌. త‌ను సినిమాలో పెట్టిన ఎఫ‌ర్ట్ తెర‌పై క‌న‌ప‌డుతుంది’’ అన్నారు. 


అనీష్ మాట్లాడుతూ - ‘‘చాలా ఎగ్జ‌యిట్‌మెంగ్‌గా ఉంది. శ్రీవిద్య‌ను చూసి గ‌ర్వంగా కూడా ఉంది. ఇందిర‌గారు శ్రీవిద్య‌ను న‌మ్మి త‌ను సంపాదించిన అమౌంట్‌ను ఇందులో ఇన్వెస్ట్ చేయ‌డం గొప్ప విష‌యం. లేడీ డైరెక్ట‌ర్ నుండి రొమాంటిక్ సినిమాల‌ను ఆశిస్తారు. కానీ.. త‌ను సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ చేసి ఆక‌ట్టుకుంది. త్రిష్ణాకి తెలుగు రాక‌పోయినా నేర్చుకుని మ‌రీ న‌టించింది. హ‌రీశ్‌గారికి, న‌వ‌దీప్‌గారికి, మ‌హేశ్‌గారు రిలీజ్‌కు స‌పోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్‌’’ అన్నారు. 


త్రిష్ణా ముఖ‌ర్జీ మాట్లాడుతూ - ‘‘మా సినిమాను  ఎంక‌రేజ్ చేయ‌డానికి వ‌చ్చిన ల‌క్ష్మీ మంచుగారికి, నాగ్ అశ్విన్‌గారికి...స‌పోర్ట్ చేస్తున్నహరీశ్‌గారికి, న‌వ‌దీప్‌గారికి, మ‌హేశ్‌గారికి థాంక్స్‌. సినిమా అంటే విప‌రీత‌మైన ప్రేమ‌, ప్రొఫ‌ష‌న‌లిజం ఉన్న వ్య‌క్తులంద‌రం క‌లిసి చేసిన సినిమా ఇది. అంద‌రికీ అభినంద‌న‌లు’’ అన్నారు. 


డైరెక్టర్ శ్రీవిద్య బసవ మాట్లాడుతూ - ‘‘మా సినిమాను రిలీజ్ చేయడంలో సపోర్ట్ చేస్తున్న హరీశ్‌గారికి, న‌వ‌దీప్‌గారికి, మ‌హేశ్‌గారికి థాంక్స్. మా అమ్మగారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను పూర్తి చేయ‌డానికి నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌రేశ్ కుమర‌న్‌, కెమెరామెన్ అభిరాజ్‌, ఇంకా స‌చిన్‌, అర‌వింద్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. మూడేళ్లు అయినా అంద‌రూ స‌పోర్ట్ అందించారు. త్రిష్ణాను కూడా ఫేస్‌బుక్ ద్వారానే క‌లిశాను. ఆమె ఎంతో స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. అనీశ్‌గారికి థాంక్స్‌. నాకు గైడ్‌లా స‌పోర్ట్ చేశారు. రాహుల్‌కి థాంక్స్‌. అలాగే మాకు స‌పోర్ట్ అందించ‌డానికి వ‌చ్చిన ల‌క్ష్మీ మంచు, నాగ్ అశ్విన్‌, చాందిని చౌద‌రికి థాంక్స్‌’’ అన్నారు. 


నాగ్ అశ్విన్ మాట్లాడుతూ - ‘‘ఓ క‌థ దొర‌కాలంటే.. రాయాలంటే చాలా టైమ్ ప‌డుతుంది. ఓ క‌థ‌ను సినిమాగా చేయాలంటే ఓ ట్రావెల్ ఉంటుంది. సినిమాను తీసిన త‌ర్వాత రిలీజ్ చేయ‌డం మామూలు విషయం కాదు. శ్రీవిద్య‌గారికి, ఇందిర‌గారికి అభినంద‌న‌లు. తొలి సినిమాలు ఎవ‌రికైనా చాలా స్పెష‌ల్‌గా ఉంటాయి. ఓ న‌మ్మ‌కంతో తొలి సినిమాను ప్రేమ‌తో చేస్తాం. ఎలా లెక్క‌లు వేసుకోం. సౌండ్‌, విజువ‌ల్స్ అద్భుతంగా ఉంటాయి. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 


లక్ష్మీ మంచు మాట్లాడుతూ - ‘‘సినిమా ఒక మేజిక్ అని చెప్పడానికి ఇలాంటి సినిమాలే ఉదాహరణగా చెప్పొచ్చు. శ్రీవిద్య చేసిన వర్క్ చూసి స్టన్ అయ్యాను. నా సినిమాలా ఫీలయ్యాను. సౌండ్ డిజైనింగ్, విజువల్స్ ఇలా అన్నీ డిపార్ట్‌మెంట్స్ అద్భుతంగా వ‌ర్క్ చేశారు. ఓ సినిమాను ముందుకెళ్లాలంటే న‌మ్మ‌కం కావాలి. మూడేళ్లు అయిన ఈ సినిమాను ముందుకొస్తుందా?  లేదా? అని యూనిట్ అనుకుంటున్న స‌మ‌యంలో హ‌రీశ్‌, న‌వ‌దీప్‌, మ‌హేశ్‌గారు ముందుకొచ్చి సినిమాను విడుద‌ల చేస్తున్నారు. శ్రీవిద్య‌కు ఆమె అమ్మ‌గారు అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త్రిష్ణా అద్భుతంగా న‌టించింది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. చిన్నా, పెద్ద అని కాదు.. సినిమా ఎప్పుడూ సినిమానే. 26 ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ గెలుచుకున్న ఈ సినిమాను ఎప్పుడో విన్న‌ర్‌గా చెప్పొచ్చు. శ్రీవిద్య మంచి స్క్రిప్ట్‌తో వ‌స్తే త‌న‌తో సినిమా చేయ‌డానికి నేను రెడీ. ఈ యూనిట్ను చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను’’ అన్నారు. 


మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ - ‘‘యంగ్ ఫిల్మ్ మేకర్, ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ప్రొడ‌క్ట్‌పై న‌మ్మ‌కంతో ఇంత ఎఫ‌ర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. టెక్నిక‌ల్‌గా చాలా స్ట్రాంగ్ మూవీ. హ‌రీశ్ శంక‌ర్‌గారు సినిమా చూసి బావుంద‌ని చెప్ప‌డంతో చూశాను. సినిమా బావుంది. శ్రీవిద్య‌గారి ఎఫర్ట్‌ను అభినందించాల్సిందే. మార్చి 13న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాను ఇన్ని ఫిలిం ఫెస్టివ‌ల్స్‌కు పంపొచ్చున‌ని ఈ సినిమా చూస్తే అర్థ‌మైంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 


న‌వ‌దీప్ మాట్లాడుతూ - ‘‘ఎంతో మంది అమ్మ‌లు, నాన్న‌లు వాళ్ల పిల్ల‌ల‌కు సినిమాల్లోకి వ‌స్తామ‌న్న‌ప్పుడు స‌పోర్ట్ చేస్తున్నారు. అలాంటి వ్య‌క్తుల్లో శ్రీవిద్య‌, ఇందిర‌గారు ఉంటారు. ఇలాంటి శ్రీవిద్య‌లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంటైర్ మ‌ధ యూనిట్‌కు అభినంద‌న‌లు. మార్చి 13న వ‌స్తోన్న ఈ సినిమాలో ప్ర‌తి ప‌దినిమిషాల‌కు ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ ఉంటుంది. సీట్ ఎడ్జ్‌లో కూర్చొనిబెట్టే రేసీ థ్రిల్ల‌ర్ ఇది’’ అన్నారు. 


హరీశ్ శంక‌ర్ మాట్లాడుతూ - ‘‘ఎప్పుడు పాట‌లు, ఫైట్స్ ఉన్న సినిమాల‌తో పాటు ఇలాంటి సినిమాలు కూడా వ‌స్తుండాలి. శ్రీవిద్య నిజంగా అదృష్ట‌వంతురాలు. పిల్ల‌లు క‌ల‌ల్ని నేరవేర్చే త‌ల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. అలాంటి మాతృమూర్తి ఇందిర బ‌స‌వ‌గారికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. మ‌నం అనుకున్న ప‌నిని చేయ‌డ‌మే స‌క్సెస్‌. ఆ ప‌ని ప‌ది మందికి న‌చ్చితే అది బోన‌స్‌. ఆ కోవ‌లో శ్రీవిద్య ఆల్‌రెడీ స‌క్సెస్ అయ్యింది. ఈ సినిమాకు అద్భుత‌మైన టెక్నిక‌ల్ టీం ప‌ని చేసింది. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే సినిమా కాదు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌లో వ‌స్తున్న సినిమా. ఈ సినిమాలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు. మార్చి 13న సినిమా విడుద‌ల‌వుతుంది’’ అన్నారు. 


నటీనటులు: 
రాహుల్, త్రిష్ణా ముఖ‌ర్జీ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: మిక్స్‌: అర‌వింద్ మీన‌న్‌ఎస్.ఎఫ్‌.ఎక్స్‌:  సింక్ సినిమార‌చ‌న‌:  ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరిఎడిట‌ర్‌: ర‌ంజిత్ ట‌చ్‌రివ‌ర్‌కెమెరా: అభిరాజ్ నాయ‌ర్‌సంగీతం: న‌రేశ్ కుమ‌ర‌న్‌నిర్మాత‌:ఇందిరా బ‌స‌వ‌ద‌ర్శ‌క‌త్వం:  శ్రీవిద్య బ‌స‌వ‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !