View

అల్లు అర‌వింద్ చేతుల మీదుగా మామాంగం ట్రైల‌ర్ 

Wednesday,December04th,2019, 07:39 AM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం' మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ   హిస్టారిక‌ల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం. ఇది ఏ సందర్భంలో వస్తుంది అనేది మాత్రం సర్ ప్రైజ్. ఈ లేడీ గెటప్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ను ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ విడుద‌ల చేయ‌గా, సాంగ్‌ను యాత్ర మూవీ డైరెక్ట‌ర్ మ‌హి.వి. రాఘ‌వ్ లాంచ్ చేశారు. 


ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ మాట్లాడుతూ... చ‌రిత్రలో క‌నిపించ‌ని హీరోలు ఎంద‌రో ఉన్నారు. సైరా కూడా అలాంటి పోరాట యోధుడి జీవిత గాధే. ఇప్పుడు వ‌చ్చే మ‌మాంగం కూడా అలాంటి ఒక పోరాట యోధుడి చ‌రిత్రే. ఆయ‌న పోరు కూడా ఒక స్వాంతంత్ర్య‌పోరాటం లాంటిది. నిర్మాత‌లు చాలా ఎంతో వ్య‌వ‌ప్ర‌యాస‌లు కూర్చి ఇంత చ‌క్క‌టి చారిత్రాత్మ‌క చిత్రం చేయ‌డం చాలా గొప్ప‌ప‌ని. ఈ చిత్రం కోసం దాదాపుగా 50కోట్లు ఖ‌ర్చు చేశారు. న‌న్ను ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌మ‌ని కోర‌గానే చాలా ఆనంద‌ప‌డ్డాను. మ‌మ్ముట్టి గురించి మీకొక విష‌యం చెప్పాలి. స్వాతి కిర‌ణం చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడుతీసుకున్న‌ప్పుడు అత‌ను మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతాడు అనుకున్నాను ఇలా తీసుకున్నారేంటి అని ఆశ్చ‌ర్య‌పోయాను.  కానీ సినిమా విడుద‌ల‌య్యాక థియేట‌ర్‌లో క‌నీసం లేచి నిల‌బ‌డ‌లేక‌పోయాం అంత గొప్ప‌గా న‌టించారు. అంత గొప్ప న‌టుడాయ‌న‌. ఓ ప‌దేళ్ళ త‌ర్వాత నేను ఆయ‌న‌కు ఒక సంద‌ర్భంలో కాల్ చేశాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం ఓ విల‌న్ పాత్ర ఉంది చేయ‌మ‌న్నాను దానికి ఆయ‌నఇదే మాట చిరంజీవిని అడుగుతావా అన్నారు. నేను అడ‌గ‌న‌న్నాను మ‌రి న‌న్నెందుకు అడుగుతున్నావ్ అన్నారు. ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తీశారు. ఇమ్‌షా, ప్రాచీతెహ‌ల‌న్ చాలా బాగా న‌టించారు. వండ‌ర్ బాయ్ అతీష్ చాలా చ‌క్క‌గా ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా క‌రాటెలోని క‌ల‌రీ అనే దాన్ని ప్ర‌త్యేకంగా నేర్చుకుని చాలా చ‌క్క‌గా చేశాడు. ఇంకా ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.


ద‌ర్శ‌కుడు మ‌హి.వి. రాఘ‌వ్ మాట్లాడుతూ... మ‌మ్ముట్టిగారు దాదాపు 400పైగా చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న న‌టించే చిత్రాల్లో ఆయ‌న క‌నిపించ‌డు కేవ‌లం ఆయ‌న పోషించిన  పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఆయ‌న న‌టించిన చిత్రాల్లో దాదాపుగా 80,90 మంది కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. నాతో స‌హా క‌లిపి అందుకు వారంద‌రి త‌ర‌పున ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు ప‌ద్మాక‌ర్‌గారు ఈ చిత్రాన్ని చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వివేక్ మాట్లాడుతూ... నాలుగు భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. కేర‌ళ హిస్ట‌రీ పైన ఈ చిత్రం ఉంటుంది. ఇది మొత్తం భార‌త‌దేశానికి చ‌రిత్ర అన్న‌ట్లే. మా చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నందుకు వాసుగారికి, గీత ఆర్ట్స్‌కి నా ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతాన్ని అందించారు. ఆయ‌న‌కు ఎక్కువ స‌మ‌యం ఇవ్వ‌క‌పోయినా చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా చ‌క్క‌టి సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజమౌళిగారి చిత్రంతో బిజీగా ఉన్నారు.


వండ‌ర్ బాయ్ అచ్చుతన్ మాట్లాడుతూ... నేను ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా మార్ష‌ల్ ఆర్ట్స్‌లో క‌లారి అనేదాన్ని నేర్చుకున్నాను. ఈ చిత్ర షూటింగ్ కోసం దాదాపుగా నేను రెండు సంవ‌త్స‌రాలు స్కుల్‌కి కూడా వెళ్ళ‌లేదు. కేవ‌లం ఎగ్జామ్స్ టైం లో మాత్ర‌మే వెళ్లి ఎగ్జామ్స్ రాసి వ‌చ్చేవాడిని. ఇది నా మొద‌టి చిత్రం. నా మొద‌టి చిత్ర‌మే మ‌మ్ముట్టిగారితో చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో స‌పోర్ట్‌ని అందించిన మ‌మ్ముట్టిగారికి ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు న‌న్ను ఒక త‌మ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు. అంద‌రికీ నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

 

మ‌మ్ముట్టి మాట్లాడుతూ... ఈ చిత్రం నాకు ఒక టాస్క్ లాంటిది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభ‌వం ఇదొక మ్యాజిక్‌లా జ‌రిగిపోయింది. అంద‌రం చాలా ఫ‌న్నీగా షూట్ చేశాం. అంద‌రం చాలా స‌ర‌దాగా ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి అనుభ‌వం. మామాంగం కేర‌ళ మ‌హోత్స‌వం మాత్ర‌మే కాదు. మ‌న దేశం మొత్తానికి మ‌హోత్స‌వం లాంటిది. 16, 18శ‌తాబ్ధాల్లో ఇది ఇక ఉత్స‌వంలా జ‌రిపేవారు. ఎన్నో భావోద్యేవ‌గాల‌తో నిండిన‌టువంటి క‌థ ఇది. ఇది చ‌రిత్ర‌ను ఎంతో వాస్త‌వికంగా క‌ళ్ళ‌ముందు క‌ట్టిన‌ట్టు తీసుకొచ్చారు. సీజీ చాలా త‌క్కువ ఉంటుంది. ఎక్కువ‌గా సెట్ ల పైనే దీన్ని తీశారు. ఇది ప్ర‌తి భార‌తీయుడు తెలుసుకోవ‌ల‌సిన క‌థ‌. ఈ చిత్రంలోని వేసిన సెట్‌లు ఏవీ మీకు ఎక్క‌డా కూడా ఆర్టిఫిష‌య‌ల్ అనిపించ‌వు. వాస్త‌వికానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి అన్నారు.


మమ్ముట్టి,ప్రాచి తెహెలన్,ఉన్ని ముకుందన్,మోహన్ శర్మ,అను సితార,ప్రాచీ దేశాయ్,మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్: ఎం. పద్మకుమార్, ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్, డైలాగ్స్ : కిరణ్, డి.ఓ.పి: మనోజ్ పిళ్ళై, యాక్షన్: శామ్ కౌశల్, వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్, ఎడిటర్: రాజా మొహమ్మద్, మ్యూజిక్: ఎం. జయచంద్రన్,
బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా, పిఆర్ఓ : ఏలూరు శ్రీను.


Allu Aravind to unveil Mamangam trailer


Mammootty, one of the biggest superstars in Malayalam film industry is starring in a historical period drama,

 

Mamangam. The film is based on Chaaverukal warriors who plot to overthrow Zamerin rulers.The film was originally shot in Malayam and it will be releasing in Telugu, Hindi, and Tamil.


M Padmakumar is directing this big-budget celluloid and Venu Kunnapilli is directing it on Kavya film company banner.


The trailer of the film was unveiled by noted film producer, Allu Aravind while the first song was launched by Mahi V Raghav.


Speaking at the event, Allu Aravind said Mamangam is the story of a rebel leader, much like  Sye Raa Narasimha Reddy. The makers had spent big bucks on this project their efforts are to be appreciated. We all know the kind of actor Mammootty is, he is a true legend. I am wishing the entire movie unit all the very best, he said.


Mahi V Raghav said Mammootty starred in over 400 films and introduced around 80-90 directors. The director of Mamangam, Padmakumar did a very good job, he added.


Executive producer Vivek stated this film is releasing in 4 languages and it is based on Kerala history. He thanked Vasu and Geetha Arts for their support. He also thanked Keeravani for composing tunes for this period drama.


Wonder boy, Achyuthan said he learnt martial arts for this film and had to stay away from school for two years. I would like to thank Mammootty garu and my producers for their constant support, he said.


Mammootty said Mamangam has been a remarkable experience for him. We enjoyed shooting for the film. It is based on incidents in 16th and 18th centuries. We used very little CG for this film and preferred to go for sets instead, he said.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !