View

అడవి కూడా చాలా అందంగా ఉంటుంది - రామ్‌ గోపాల్‌ వర్మ

Thursday,October26th,2023, 04:02 PM

అక్షర క్రియేషన్‌ పతాకంపై శ్రీమతి స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో, నగేష్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా , అప్సరా రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘తలకోన’ నవంబర్‌ రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. à°ˆ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. à°ˆ వేడుకకు ముఖ్య అతిథులుగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ, నటుడు శివాజీరాజా ప్రముఖ నిర్మాత రామారావు విచ్చేసి పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు.


రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... à°¨à°¾à°•à± అందమంటే మహా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి అందమైన అడవిలో అందమైన అప్సర రాణి డాన్స్‌లు చేస్తూ.. ఫైట్స్‌ చేస్తుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి. à°ˆ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు. 


శివాజీరాజా మాట్లాడుతూ... à°¤à°²à°•à±‹à°¨ అడవిలో నేను కూడా కొన్ని సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నాను. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే చాలా చాలా కష్టం ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించి షూటింగ్‌ పూర్తి చేశారు అంటేనే యూనిట్‌ సంకల్పం అర్ధమౌతోంది. à°ˆ సినిమా చక్కటి విజయం సాధించాలి అన్నారు.
అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ... à°¤à°²à°•à±‹à°¨ అనే టైటిల్‌లోనే ఉంది ఇది అడవిలో జరిగే à°•à°¥ అని. అడవిలో షూటింగ్‌ చేయడం అంటే మాటలు కాదు. చాలా ఇబ్బందులు ఉంటాయి. అన్నింటినీ అధిగమించి నిర్మాత అన్‌ కాంప్రమైజ్డ్‌à°—à°¾ నిర్మించారు. అప్సర రాణి మంచి ఫ్యూచర్‌ ఉన్న నటి. à°ˆ మధ్య కాలంలో ఇటువంటి ఆర్టిస్ట్‌లు అరుదుగా ఉంటున్నారు. అందరం చాలా కష్టపడ్డాం. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. 


నిర్మాత దేవర శ్రీధర్‌రెడ్డి (చేవెళ్ల) మాట్లాడుతూ... à°®à°¾ à°ˆ ఈవెంట్‌కు విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలిపిన రామ్‌గోపాల్‌ వర్మ గారికి, శివాజీ రాజా గారికి కృతజ్ఞతలు. దర్శకుడు à°ˆ కథను చెప్పగానే మంచి థ్రిల్లింగ్‌à°—à°¾ అనిపించింది. à°ˆ సినిమా కోసం యూనిట్‌ మొత్తం చాలా రిస్క్‌ లొకేషన్స్‌లో కూడా పనిచేశారు. ఎక్కువగా ఫారెస్ట్‌లో షూటింగ్‌ చేయడం వల్ల మరింత ఇబ్బంది అయింది. అయినా యూనిట్‌ అంతా సహకరించారు. దర్శకుడు నగేష్‌ గారు తాను చెప్పిన దానికన్నా బాగా తీశారు. à°ˆ సినిమా నిర్మాణంలో నాకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. à°ˆ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నవంబర్‌ రెండో వారంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. ఇక మీదట కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతా అన్నారు.


దర్శకుడు నగేష్‌ నారదాసి మాట్లాడుతూ...  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ శ్రీధర్‌రెడ్డి గారు చెప్పినట్లు à°ˆ చిత్రం కోసం చాలా రిస్క్‌ చేశాం. యూనిట్‌ అందరూ గొప్పగా సహకారాన్ని అందించారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు. శ్రీధర్‌రెడ్డిగారు కూడా మాకు ఏది కావాలంటే అది సమయానికి అరేంజ్‌ చేయడం ద్వారా తాను à°’à°• ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ అనిపించుకున్నారు. కైమ్‌ థ్రిల్లర్‌తో సాగే à°ˆ కథాంశం మొత్తం ఫారెస్ట్‌లో చిత్రీకరించాం. ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ అయినా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అన్ని అంశాలూ ఉన్నాయి. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. దయచేసి అందరూ థియేటర్స్‌లో à°ˆ సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి అన్నారు.


హీరోయిన్‌ అప్సర రాణి మాట్లాడుతూ... à°®à°®à±à°®à°²à±à°¨à°¿ ఆశీర్వదించటానికి వచ్చిన వర్మ గారికి థ్యాంక్స్‌. అందరూ చెప్పినట్లు అడవిలో చాలా ఇబ్బందులు పడ్డాము. దర్శకుడు, నిర్మాత యూనిట్‌ అందర్నీ తమ స్వంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలోనే నాకు ఇలాంటి యాక్షన్‌, అడ్వెంచర్‌, నటనకు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ చాలా కోపరేటివ్‌à°—à°¾ ఉన్నారు. మంచి à°•à°¥, కథనాలతో వస్తున్న à°ˆ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.


ఇంకా à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్‌ సభ్యులు తామెంతో కష్టపడి, ఇష్టపడి చేసిన à°ˆ సినిమా విజయవంతం అయి అందరికీ మంచి పేరును తీసుకు రావాలని కోరుకుంటూ ప్రసంగించారు.


అప్సరా రాణి, అశోక్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, ఉగ్రం మంజు, దేవర శ్రీధర్ రెడ్డి, డెబోరా , కరణ్‌విజయ్ ,విజయ రంగరాజా, శ్రవణ్, రాజారాయ్‌, యోగి కత్రి , ఆజాద్, భువనేశ్వరి, చంద్రిక , అరుణ తదితరులు నటించిన à°ˆ చిత్రానికి సింగర్స్ : స్నిగ్ధ శర్మ, జయశ్రీ, ఎడిటర్: ఆవుల వెంకటేష్  à°¨à°¿à°°à±à°µà°¹à°£: పరిటాల రాంబాబు, డిఓపి: ఈదర ప్రసాద్‌, మల్లికార్జున్, మ్యూజిక్‌: సుభాష్‌ ఆనంద్‌, ఫైట్స్‌: వింగ్ చన్ అంజి, పి ఆర్ à°“: బాసింశెట్టి వీరబాబు, డాన్స్: చార్లీ,లిరిక్స్ & కో డైరెక్టర్ : కర్ణ నాయుడు, నిర్మాత: దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల), à°•à°¥-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: నగేష్‌ నారదాసి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !