View

కళ్యాణ్ మామయ్య చెప్పింది నిజం - సాయిధరమ్ తేజ్ (విన్నర్ ఫ్రీ రిలీజ్ వేడుక)

Sunday,February19th,2017, 11:55 AM

సాయిధరమ్‌ తేజ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్‌’. మహాశివరాత్రి కానుకగా à°ˆ నెల 24à°¨ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో à°ˆ సినిమా విడుదల కానుంది. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. సినిమా ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. à°ˆ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు.


కల్యాణ్‌ మామయ్య నాతో అలా అన్నారు
సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ – ‘‘ముందు ‘విన్నర్‌’ à°•à°¥ విన్నప్పుడు నేను బడ్జెట్‌ గురించి ఆలోచించాను. à°•à°¥ నాకు బాగా నచ్చింది. కానీ, బడ్జెట్‌ చాలా ఎక్కువ అవుతుంది. నా మీద à°…à°‚à°¤ బడ్జెట్‌ పెడతారా? అసలు à°…à°‚à°¤ అవసరమా? అని ఆలోచించాను. నిర్మాతలు మాత్రం ఆలోచించలేదు. కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు. ఎక్కడా రాజీపడలేదు. నా మార్కెట్‌ గురించి ఆలోచించలేదు. వాళ్ల ఎఫర్ట్స్‌à°•à°¿, గట్స్‌à°•à°¿.. à°ˆ చిత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నా. గోపీ అన్న, ఛోటా మామ చూపించే ప్రేమ, కేర్‌ ఎప్పుడూ మరచిపోలేను. తమన్‌ నాకు సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. à°ˆ చిత్రంలోని ఒక్కో పాట రిలీజ్‌ చేసిన మహేశ్‌బాబు, అనిరుద్, రవితేజ, మురుగదాస్, సమంతలకు థ్యాంక్స్‌. రకుల్‌ చాలా హార్డ్‌ వర్కింగ్‌. తనతో నాకిది మొదటి సినిమా. ఒకసారి కల్యాణ్‌ మామయ్య (పవన్‌ కల్యాణ్‌) నాతో మాట్లాడుతూ.. ‘అవార్డులు, రివార్డులు వస్తుంటాయ్, పోతుంటాయ్‌. కానీ, ఓటమి వచ్చినప్పుడు నీ చుట్టూ ఎవరుంటారన్నదే ఇంపార్టెంట్‌’ అన్నారు. అది నిజమే. నా à°—à°¤ సినిమా ఆడకపోయినా నా అభిమానులు సపోర్ట్‌à°—à°¾ నిలిచారు. à°ˆ రెండేళ్లల్లో ఏం గెలుచుకున్నావని ఎవరైనా అడిగితే.. మెగా ఫ్యాన్స్‌ అభిమానం గెలుచుకున్నానని చెబుతా. అది చాలు. నాకు గెలుపు, ఓటమిని పరిచయం చేసిన మా అమ్మకు లవ్‌ యూ’’ అన్నారు. ’’ అని చెప్పారు.


తేజూకి అబద్ధం చెప్పడం కూడా రాదు
నాగబాబు మాట్లాడుతూ– ‘మా ఇంట్లో మాకు చాలా లవబుల్‌ మేనల్లుడు సాయి (సాయిధరమ్‌ తేజ్‌). వాడంటే నాకు చాలా ఇష్టం. తన నటన, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ తెలిసిందే. మా అమ్మ అంటే మాకు ఇష్టం. వాళ్ల అమ్మ (నా పెద్ద చెల్లెలు) అంటే తేజూకి చాలా ఇష్టం. తనలో నాకు బాగా నచ్చే విషయం అది. అబద్ధం కూడా చెప్పడం రాదు తనకి. చిన్నప్పుడు నిజాలు చెప్పి తిట్లు తినేవాడు. మంచి కుర్రాడు. తేజూ అంచలంచెలుగా ఎదుగుతుండటం చాలా హ్యాపీ’’ అన్నారు.


చిరు, పవన్‌లను డైరెక్ట్‌ చేసినట్లు అనిపించింది
గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ – ‘‘తేజూతో సినిమా చేస్తున్నంత సేపూ సొంత తమ్ముడితో సినిమా చేసినట్టుంది. తేజూని మానిటర్‌లో చూస్తున్నప్పుడు నేను చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను దర్శకత్వం వహించినట్టు అనిపించింది. తేజూ మనసున్న మనిషి. మంచోళ్లకే మంచోడు. తను దర్శకుల హీరో. à°ˆ సినిమాలో గుర్రంతో చాలా రిస్కీ షాట్స్‌ చేశాడు. రెండు మూడుసార్లు పడ్డాడు. నేను వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఎలా ఉందనగానే ఏం కాలేదనేవాడు. ‘విన్నర్‌’తో నటుడిగా నెక్ట్స్‌ లెవల్‌à°•à°¿ వెళతాడు. రకుల్‌తో నాకిది రెండో చిత్రం. అనుష్క తర్వాత à°…à°‚à°¤ డెడికేషన్‌ రకుల్‌లో చూశా. తనతో ఎన్ని సినిమాలైనా చేయాలనిపిస్తుంది’’ అన్నారు.


ఈసారి విన్‌ అవుతాం
సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ – ‘‘నేనూ, తేజూ క్రికెట్‌ ఆడుతుంటాం. ధోనీ ఫస్ట్‌ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. తర్వాత మ్యాచ్‌లో 148 రన్స్‌ కొట్టాడు. అలాగే, మా కాంబినేషన్‌లో ఫస్ట్‌ మూవీ డకౌట్‌ అయింది. à°ˆ ‘విన్నర్‌’తో పెద్ద హిట్‌ కొడుతాం. తేజూకి సాంగ్స్‌ చేసేటప్పుడు నాకు మెగాస్టార్, పవర్‌స్టార్, సై్టలిష్‌ స్టార్, మెగాపవర్‌స్టార్‌ గుర్తుకొస్తారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్‌ చేస్తా. గోపీచంద్‌ మలినేని, నాదీ హిట్‌ కాంబినేషన్‌. మా ప్రతి సినిమా హిట్టే. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ‘బావా.. నీ బలుపు చూపించు’ అని ఛాన్స్‌ ఇచ్చాడు. తనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది. మా నిర్మాతలకు à°ˆ సినిమాతో మంచి లాభాలు రావాలి’’ అన్నారు.


మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ – ‘‘పంతం కోసం బంధం వదిలేయడం తప్పేమో.. కానీ, బంధం కోసం పంతం వదిలేయడం తప్పు కాదని à°ˆ à°•à°¥ ద్వారా చెప్పాం’’ అన్నారు.


చాలా కంఫర్ట్‌à°—à°¾ అనిపించింది
రకుల్‌ మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌గారితో నాకిది రెండో సినిమా. ఆయన డైరెక్షన్‌లో నేను చేసిన ‘పండగ చేస్కో’ పెద్ద హిట్‌. ఆయనతో ఇది రెండో సినిమా కాబట్టి, చాలా కంఫర్ట్‌à°—à°¾ ఉంది. తేజు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా చాలా సింపుల్‌à°—à°¾ ఉంటాడు. à°ˆ సినిమాకన్నా ముందు తను నాకు మంచి ఫ్రెండ్‌. నిర్మాతలు నా పట్ల చాలా కేర్‌ తీసుకున్నారు. తమన్‌ నా గురించి చెప్పడం మరచిపోయినా.. అతని గురించి చెప్పడం నేను మరచిపోను. హీ ఈజ్‌ రియల్లీ టాలెంటెడ్‌. ‘విన్నర్‌’ ఆల్బమ్‌ ఇరగదీసేశాడు’’ అన్నారు.


చిత్రనిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, పీవీపీ, ‘జెమినీ’ కిరణ్, రాజీవ్‌ రెడ్డి, దర్శకులు శ్రీను వైట్ల, మెహర్‌ రమేశ్, సురేందర్‌ రెడ్డి, బాబీ, అనిల్‌ రావిపూడి, బీవీఎస్‌ రవి, çసంకల్ప్, ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, ఎడిటర్‌ గౌతంరాజు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్, మాటల రచయిత అబ్బూరి రవి, నటులు రఘుబాబు, పృధ్వీ, అనూప్‌సింగ్, యాంకర్‌ అనసూయ తదితరులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !