పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం నిన్న (24.3.2017) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకుదూసుకెళుతోంది. ఫస్ట్ డే వసూళ్లు భారీగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసాయి. వారి లెక్కలు తప్పవ్వలేదు. అందరి అంచనాలను అందుకునే విధంగా ఈ చిత్రం వసూళ్లు సాధిస్తోంది. ఫస్ట్ డే ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు మీ కోసం...
కాటమరాయుడు బడ్జెట్ - 40కోట్లు
ఫస్ట్ డే స్ర్కీనింగ్ అయిన ధియేటర్స్ - 1700+
కాటమరాయుడు శాటిలైట్ హక్కులు - 12.5కోట్లు
ఫస్ట్ డే వసూళ్ల వివరాలు (షేర్)
ఆంధ్రప్రదేశ్ - 15కోట్లు
తెలంగాణా - 10కోట్లు
కేరళ - 2కోట్లు
కర్నాటక - 90లక్షలు
యు.యస్.ఎ (ప్రీమియర్స్ తో కలిపి) - 10కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ - 38కోట్లు
ఈ లెక్కలను బట్టి పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అతి త్వరగా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ లాభాల బాట పట్టేస్తారు. ఉగాది హాలీడేస్ ని కూడా ఈ సినిమా క్యాష్ చేసుకుంటుంది కాబట్టి, కాటమరాయుడు కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం.