మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన బాబాయ్ కి మాటిచ్చాడట. తను సెట్ చేస్తానని అన్నాడట. పవన్ కళ్యాణ్ కోసం రాంచరణ్ సెట్ చేసేది ఏముంటుంది అనుకుంటున్నారా... రాంచరణ్ సెట్ చేస్తానని మాట ఇచ్చింది పవన్ కళ్యాణ్ కి కాదు... మరో బాబాయ్ నాగబాబుకి ఇచ్చాడట. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం చాలా నిరాశలో ఉన్నాడు. లోఫర్, మిస్టర్ చిత్రాల ఫ్లాప్ లతో తన కెరియర్ గురించి టెన్షన్ పడుతున్నాడట వరుణ్ తేజ్. కొడుకు టెన్షన్ చూసి నాగబాబు కూడా తెగ ఫీలైపోతున్నాడట.
కాగా రాంచరణ్ ఈ తండ్రికొడుకులను ఓదార్చి, వరుణ్ తేజ్ కి మంచి ప్రాజెక్ట్ ని సెట్ చేసే బాధ్యతను నెత్తిన వేసుకున్నాడట. తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని నాగబాబుకు మాటిచ్చాడట రాంచరణ్. ఆల్ రెడీ వరుణ్ తేజ్ కోసం కథలు కూడా వింటున్నాడట. సక్సెస్ ఫుల్ దర్శకుల దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్ లో టాలెంట్ ఉన్న వారిని గుర్తించి వారి దగ్గర మంచి కథలు ఉంటే వారిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో రాంచరణ్ ఉన్నాడట. అలా ఎవరైనా మంచి కథ వరుణ్ తేజ్ కోసం చెబితే ఓ ప్రాజెక్ట్ ని సెట్ చేయాలనుకుంటున్నాడట. లేదా అప్ కమింగ్ డైరెక్టర్స్ మంచి కథ ఇచ్చినా వరుణ్ తేజ్ తో సినిమా నిర్మించాలనుకుంటున్నాడట. మొత్తం మీద తమ్ముడిని సక్సెస్ ట్రాక్ ఎక్కించడానికి అన్నయ్య రాంచరణ్ నడుం బిగించాడని అర్ధం చేసుకోవచ్చు. మరి ఎలాంటి ప్రాజెక్ట్ ఈ మెగాబ్రదర్స్ కాంబినేషన్ లో సెట్ అవుతుందో వేచి చూద్దాం.