కింగ్ నాగార్జున చేసిన బుల్లితెర షో 'మీలో కోటీశ్వరుడు ఎవరు' ఏ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇదే షోని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసారు. తాజాగా వీరి బాటలో ఎన్టీఆర్ కూడా బుల్లితెర ఆడియన్స్ కి స్వీట్ షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది.
స్టార్ మా చానెల్లో 'బిగ్ బాస్' రియాల్టీ గేమ్ షో ఆరంభంకానుందట. ఈ రియాల్టీ గేమ్ షో ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ గేమ్ షో ని ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే భారీ విజయం సాధించడం ఖాయం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు త్రివిక్రమ్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి అంగీకరించాడు. సో... ఓ వైపు క్రేజీ ప్రాజెక్ట్స్, మరో వైపు బుల్లితెర ఎంట్రీ... ఓహ్.. ఎన్టీఆర్ లైఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ..!