యోగా గురువు భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ భూమిక సినిమాలకు దూరమయ్యింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఈ మాజీ హీరోయిన్ మంచి క్యారెక్టర్స్ వస్తే... అక్క, అమ్మ, వదిన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉంది. రెండు, మూడు సినిమాలు కూడా కమిట్ అయ్యిందని సమాచారమ్.
కాగా భూమిక భర్త భరత్ ఠాగూర్ పెయింటింగ్స్ వేయడంలో కూడా దిట్ట. భరత్ వేసిన పెయింటింగ్స్ తో దుబాయ్ లో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసింది భూమిక. ఈ ఆర్ట్ గ్యాలరీకి చాలామందిని ఆహ్వానించిందట, శ్రియను కూడా ఆహ్వానించడంతో ఎంచక్కా ఈ ఆర్ట్ గ్యాలరీకి వెళ్లింది. పెయింటింగ్ ని చూస్తూ, ఉత్సాహంగా గడిపింది. శ్రియ సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యిందట. శ్రియ ఎక్కువ సేపు ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉండటం భూమికను చాలా సంతోషపరిచిందని తెలుస్తోంది. భరత్ కి కూడా పెయింటింగ్స్ కోసం మంచి డీల్స్ కుదిరాయట. సో... మాజీ హీరోయిన్ కి శ్రియ బాగానే హెల్ప్ చేసిందన్నమాట.