'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్' చిత్రాలతో వరుసగా ఫ్లాప్స్ ని చవిచూసాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. దాంతో అతని కెరియర్ డైలమాలో పడిపోయింది. శ్రీను వైట్ల తదుపరి సినిమాకి హీరో, నిర్మాత దొరకడం కష్టమని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. కానీ శ్రీను వైట్ల మాత్రం వెనుకడుగు వేయలేదు. హీరోని పట్టేసాడు.. నిర్మాతలను పట్టేసాడు. మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయబోతున్నాడు శ్రీను వైట్ల. వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది. దాంతో శ్రీను వైట్ల మంచి కాంబినేషన్ ని వర్కవుట్ చేసుకున్నాడని, ఈ సినిమాతో అయినా మళ్లీ అతను సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని మాట్లాడుకుంటున్న వారికి ఈ సినిమా గురించి వచ్చిన వార్త చర్చించుకునేలా చేస్తోంది.
రవితేజతో చేయబోతున్న సినిమా కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్లానింగ్ జరుగుతోందట. రవితేజ, కాజల్ అగర్వాల్ ఇప్పటికే 'వీర','సారొచ్చారు' సినిమాల్లో కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ ఫ్లాప్ కాంబినేషన్ తో శ్రీను వైట్ల సినిమా చేయడమేంటీ అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఏమో శ్రీను వైట్ల ఇవన్ని పట్టించుకోకుండా, తన ఎంచుకున్న కథ మీద నమ్మకంతో ముందుకెళుతున్నాడేమో... ఈ సినిమాతో ఫ్లాప్ కాంబినేషన్ అనిపించుకున్న రవితేజ, కాజల్ హిట్ అందుకుని ఈ సెంటిమెంట్ ని తుడిచిపెడుతుందేమో... అసలు నిజంగానే రవితేజ సినిమాకి కాజల్ సైన్ చేసిందా... ఇవన్ని ప్రశ్నలే. ఆన్సర్ కావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.