మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ఱ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నేల టిక్కెట్' టైటిల్ ని పరిశీలిస్తున్నారనే వార్తలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి సంబంధించి తాజా అప్ డేట్ ఏంటంటే...
రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ ని వేసారట. ఈ సెట్ లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరపడానికి ప్లాన్ చేసారట. ఏప్రిల్ నెలాఖరుకల్లా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మే నెలాఖరులో ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారమ్. ఉగాదిని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంటే, 'ఫిదా' ఫేం శక్తికాంత్ సంగీతం సమకూర్చుతున్నాడు.